హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోటెక్ కంపెనీ కార్స్24 వచ్చే నెలలో విజయవాడలో హబ్‌ను ప్రారంభిస్తోంది. 200 కార్లు పార్క్ చేయగలిగే సామర్థ్యంతో ఈ కేంద్రం రానుందని కార్స్24 కోఫౌండర్ గజేంద్ర జంగిద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘దేశవ్యాప్తంగా పాత కార్ల క్రయవిక్రయాల్లో 8 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మార్కెట్ 8వ స్థానంలో ఉంది. కార్స్24 వ్యాపారంలో ఢిల్లీ రాజధాని ప్రాంతం, మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత తెలుగు రాష్ట్రాలు 15 శాతం వాటాతో నాల్గవ స్థానంలో ఉన్నాయి.
కొత్త కార్లకు రుణం సులభంగా లభిస్తుంది. పాత కార్ల విషయంలో రుణ లభ్యత అంత సులువు కాదు. యూజ్డ్ కార్ల రంగంలో విలువ ఉందని గ్రహించాం. సులభ వాయిదాల్లో వినియోగదార్లకు రుణం అందించాలన్న ధ్యేయంతో 2019లో నాన్–బ్యాంకింగ్ ఫై నాన్షియల్ కంపెనీ (ఎన్‌బీఎఫ్‌సీ) లైసెన్స్ దక్కించుకున్నాం. కంపెనీ కస్టమర్లలో దేశవ్యాప్తంగా 55 శాతం మంది రుణం ద్వారా కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఈ సంఖ్య 65 శాతం ఉంది’ అని
వివరించారు.
కంపెనీ వృద్ధి 50 శాతం..
ఏడాది వారంటీతో సరి్టఫైడ్ కార్లను మాత్రమే విక్రయిస్తున్నామని గజేంద్ర తెలిపారు. ‘కారుకు 140 క్వాలిటీ చెక్ పాయింట్ల ద్వారా మరమ్మతులు చేపడతాం. కారు నచ్చకపోతే ఏడు రోజుల్లో వెనక్కి ఇవ్వొచ్చు. అర్హత కలిగిన వినియోగదార్లకు జీరో డౌన్ పేమెంట్ సౌకర్యమూ ఉంది. కస్టమర్లలో 15% మహిళలు ఉన్నారు. పరిశ్రమ 15 శాతం వృద్ధి చెందితే, కార్స్24 ఏకంగా 50% నమోదు చేస్తోంది. వ్యవస్థీకృత రంగంలో రెండవ స్థానంలో ఉన్నాం. 2025 నాటికి తొలి స్థానం లక్ష్యంగా చేసుకున్నాం. ప్రస్తుతం యూజ్డ్ కార్స్ విపణిలో 5% వాటా సొంతం చేసుకున్నాం. వచ్చే ఏడాది రూ.30–50 లక్షల ధరల శ్రేణి విభాగంలోకి ఎంట్రీ ఇస్తాం. ఇప్పటి వరకు భారత్‌లో 8 లక్షల కార్లు విక్రయించాం. 2022–23లో ఈ సంఖ్య 2.5 లక్షల యూనిట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30% వృద్ధి ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment