gajendra
-
విజయవాడలో కార్స్24 హబ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆటోటెక్ కంపెనీ కార్స్24 వచ్చే నెలలో విజయవాడలో హబ్‌ను ప్రారంభిస్తోంది. 200 కార్లు పార్క్ చేయగలిగే సామర్థ్యంతో ఈ కేంద్రం రానుందని కార్స్24 కోఫౌండర్ గజేంద్ర జంగిద్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ‘దేశవ్యాప్తంగా పాత కార్ల క్రయవిక్రయాల్లో 8 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్–తెలంగాణ మార్కెట్ 8వ స్థానంలో ఉంది. కార్స్24 వ్యాపారంలో ఢిల్లీ రాజధాని ప్రాంతం, మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత తెలుగు రాష్ట్రాలు 15 శాతం వాటాతో నాల్గవ స్థానంలో ఉన్నాయి. కొత్త కార్లకు రుణం సులభంగా లభిస్తుంది. పాత కార్ల విషయంలో రుణ లభ్యత అంత సులువు కాదు. యూజ్డ్ కార్ల రంగంలో విలువ ఉందని గ్రహించాం. సులభ వాయిదాల్లో వినియోగదార్లకు రుణం అందించాలన్న ధ్యేయంతో 2019లో నాన్–బ్యాంకింగ్ ఫై నాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లైసెన్స్ దక్కించుకున్నాం. కంపెనీ కస్టమర్లలో దేశవ్యాప్తంగా 55 శాతం మంది రుణం ద్వారా కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఈ సంఖ్య 65 శాతం ఉంది’ అని వివరించారు. కంపెనీ వృద్ధి 50 శాతం.. ఏడాది వారంటీతో సరి్టఫైడ్ కార్లను మాత్రమే విక్రయిస్తున్నామని గజేంద్ర తెలిపారు. ‘కారుకు 140 క్వాలిటీ చెక్ పాయింట్ల ద్వారా మరమ్మతులు చేపడతాం. కారు నచ్చకపోతే ఏడు రోజుల్లో వెనక్కి ఇవ్వొచ్చు. అర్హత కలిగిన వినియోగదార్లకు జీరో డౌన్ పేమెంట్ సౌకర్యమూ ఉంది. కస్టమర్లలో 15% మహిళలు ఉన్నారు. పరిశ్రమ 15 శాతం వృద్ధి చెందితే, కార్స్24 ఏకంగా 50% నమోదు చేస్తోంది. వ్యవస్థీకృత రంగంలో రెండవ స్థానంలో ఉన్నాం. 2025 నాటికి తొలి స్థానం లక్ష్యంగా చేసుకున్నాం. ప్రస్తుతం యూజ్డ్ కార్స్ విపణిలో 5% వాటా సొంతం చేసుకున్నాం. వచ్చే ఏడాది రూ.30–50 లక్షల ధరల శ్రేణి విభాగంలోకి ఎంట్రీ ఇస్తాం. ఇప్పటి వరకు భారత్‌లో 8 లక్షల కార్లు విక్రయించాం. 2022–23లో ఈ సంఖ్య 2.5 లక్షల యూనిట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 30% వృద్ధి ఆశిస్తున్నాం’ అని వెల్లడించారు. -
సినిమాల్లోకి జయా బచ్చన్ రీ ఎంట్రీ!
బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ ఎంపీ జయా బచ్చన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే ఆమె కబీ కుషి కబీ ఘమ్, కల్ హోనా హో, లాగా చునారీ మేన్ దాగ్ వంటి పలు సినిమాల్లో తన నటనతో అభిమానులను కట్టిపడేసింది. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె ఏడేళ్లుగా వెండితెరపై కనిపించనేలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ఇది ఆమె తొలి మరాఠీ చిత్రమని అంటున్నారు. దీనికి గజేంద్ర అహిరే దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ఇతడు మరాఠీలో సుమారు 50కి పైగా చిత్రాలకు డైరెక్షన్ చేశాడు. ఇక ఈ వార్తలపై డైరెక్టర్ గజేంద్ర స్పందిస్తూ "మేమింకా ఏ నిర్ణయానికి రాలేదు. అప్పుడే బోలెడన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఒక్కటైతే నిజం. ఈ సినిమాలో జయాబచ్చన్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇదే మాట ఆమెతో చెప్పాను కూడా! మరి ఏమని సమాధానమిస్తుందో చూడాలి. ఈ సినిమా ద్వారా జయ రీ ఎంట్రీ ఇస్తుందని ఆశిస్తున్నా. కానీ ఇప్పటివరకైతే ఇంకా ఏదీ ఫైనలైజ్ కాలేదు. కనీసం ఏ భాషలో తీస్తున్నామనేది కూడా డిసైడ్ కాలేదు" అని చెప్పుకొచ్చాడు. జయ సినిమాల్లోకి వస్తానంటే ఆమె భర్త అమితాబ్ బచ్చన్ కూడా సంతోషిస్తాడు. మరి డైరెక్టర్ అభ్యర్థనను జయా బచ్చన్ అంగీకరిస్తుందా? ఆమె నిజంగానే రీఎంట్రీ ఇస్తుందా? అనేది క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే! చదవండి: బిగ్‌బీ కూతురిని చులకనగా చూసిన నెటిజన్! నీ కన్ను నీలి సముద్రం.. చిందేసిన హీరోహీరోయిన్లు -
గజేంద్ర కిడ్నాప్ కేసు ఛేదించిన పోలీసులు
-
వ్యాపారి గజేంద్ర కిడ్నాప్ మిస్టరీ వీడింది
సాక్షి, హైదరాబాద్: దోమలగూడకు చెందిన వ్యాపారి గజేంద్ర పరఖ్ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసమే గజేంద్రను కిడ్నాప్ చేశారని, ఆయనకు తెలిసిన వారే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గజేంద్ర మిత్రుడే ఈ కిడ్నాప్ ముఠాకు నాయకుడిగా వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. గజేంద్ర కోట్లల్లో వ్యాపారం చేస్తుంటాడని, ఆయనను కిడ్నాప్ చేయడం ద్వారా కోట్ల రూపాయలు రాబట్టవచ్చునని గజేంద్ర స్నేహితుడు అల్మా అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌కు స్కెచ్ వేశాడని, మరో ఇద్దరితో అతను కలిసి గజేంద్రను కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు. డబ్బులు తీసుకొని గజేంద్రను అల్మా గ్యాంగ్ ఇప్పటికే విడిచిపెట్టింది. అయితే, రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
ఆమిదాలగొంది విద్యార్థికి జాతీయ అవార్డు
మడకశిర రూరల్ : మడకశిర మండలం ఆమిదాలగొంది ఉన్నత పాఠశాలకు చెందిన గజేంద్ర అనే విద్యార్థి జాతీయ స్థాయి అవార్డును అందుకున్నాడు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో రాగా, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించాడు. ఢిల్లీలో ఎన్నికల విభాగం సీఈఓ వీలియం ఆర్ స్వీనీ నుంచి బుధవారం అవార్డు అందుకున్నాడు. అతన్ని ఉపాధ్యాయులు అభినందించారు. -
ఇక ఢిల్లీలోనే ఉరేసుకోవాలా..!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) 'ఆ సమయంలో నేను గానీ అక్కడుంటే.. అలా జరగనిచ్చేవాణ్నికాదు.. అసలు ఇలాంటివి జరగాలని అస్సలు కోరుకోరు' ఎవరైనా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డప్పుడు అతడిపట్ల సానుభూతితో.. వయసు, హోదాతో సంబంధం లేకుండా చేసే వ్యాఖ్యలు! కానీ ఈ మాటలు పెదవుల వరకే ఆగిపోయి.. ఆచరణలో కానరాకుంటే.. ఇదిగో.. ఇలా మళ్లీ మళ్లీ వరుస మరణాలు.. అవే అబద్ధపు సానుభూతులు! ఏళ్ల తరబడి దేశాన్ని కుదిపేస్తున్న రైతుల బలవన్మరణాల విషయంలో ప్రభుత్వాల తీరిది! సమస్య వచ్చినప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా బయటపడొచ్చని చాణక్యుడు ఏ ఉద్దేశంతో చెప్పారో గానీ అచ్చుగుద్దినట్లు అన్నివేళలా దాన్నే ఫాలో అవుతున్నారు మన నేతలు. చెమటదారపోసి.. కాయకష్టం చేసి.. తల్లితో సమానంగా భూమిని ప్రేమిస్తూ ఆరుగాలం కష్టపడి రైతు.. తెల్లారినప్పటి నుంచి నిద్రపోయేవరకు నోట్లోకి ఎంగిలిని అందించేవాడిగా ఎవరికీ గుర్తులేకపోయినా పాలకులకు మాత్రం గుర్తుండి పోవాలి. అతడు లేకుంటే జీవమే లేదు మనుగడే లేదు. కానీ నేడు అతడి ఆత్మహత్య నాయకులకు ప్రసంగ పాఠాలయ్యాయి. ఓ గంట రెండుగంటల వినోదాత్మక చర్చలుగా మారాయి. ఈ విషయాన్ని రైతుల ఆత్మహత్యల గణాంకాలే వెల్లడిస్తున్నాయి. దేశంలో రైతులు ఆత్మహత్యలు అనగానే ముందుగా గుర్తొచ్చేది మహారాష్ట్రలోని విదర్భ. కానీ, అలాంటి విదర్భ ఇప్పుడు దేశంలో ఎక్కడ రైతు చనిపోతే అక్కడ ఉన్నట్లే. ప్రతి ఏడాది వేల ఆత్మహత్యలు. మొన్నటి వరకు అప్పులు, నష్టం, కబ్జాలు రైతుల ప్రాణాలు తీస్తుంటే నేడు తాజాగా తలెత్తిన బంగారం లాంటి భూములను లాక్కొనేందుకు చేసే రాజకీయ ఒత్తిడులు, చట్టాలతో చేసే భూ ఆక్రమణలు వారి ఆత్మహత్యలను మరింత పెంచాయి. నిన్న మొన్నటి వరకు ఏ పొలానికో, ఇంటికో చెట్టుకో పుట్టకో నెలవైన రైతు మరణం తాజాగా దేశ రాజధానిలో గజేంద్ర రూపంలో మార్మోగింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఆప్యాయంగా వ్యవసాయం చేసుకునే రాజస్థాన్‌కు చెందిన గజేంద్ర సింగ్.. ఆప్ ర్యాలీలో చెట్టుపైకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే ప్రాణాలు బలితీసుకున్నాడు. ఒకప్పుడు ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడంతో అతడి భార్య కళావతి పేరును కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నోట వినడం ద్వారా ఎంతగా వెలుగులోకి వచ్చారో.. నేడు అలాగే ప్రతిపక్షాలు చేసిన రభస ద్వారా ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఇంకా ప్రముఖ నేతల ద్వారా ప్రకటనగా వచ్చిన గజేంద్ర మరణం కూడా అంత వెలుగులోకి వచ్చింది. దేశ రాజధానిలో ఓ రైతు ఆత్మహత్య రాజకీయంగా పెనుదూమారాన్ని సృష్టించింది. పార్లమెంట్లో గజేంద్ర సింగ్ ఆత్మహత్య అంశం ప్రకంపనలు సృష్టించింది. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ర్యాలీలో గజేంద్ర సింగ్ ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జాతీయ మీడియాల్లో పతాక శీర్షికలను అందుకుంది. వ్యవసాయాన్నే నమ్ముకున్న తాను పంటలు పండక చాలా నష్టపోయానని, మోదీ ప్రభుత్వం భూ సేకరణ బిల్లు అంటూ తమ భూములు లాక్కుంటే ఎలా బతకాలంటూ గజేంద్ర సింగ్ తన సూసైడ్ లేఖలో ప్రస్తావించాడు. అయితే, అది ఆత్మహత్యా, హత్యా అనే చర్చ లేవనెత్తి.. ఒక మరణాన్ని చులకన చేసే ప్రయత్నం చేయకుండా ఓ సారి రైతుల ఆత్మహత్యలపై లోతుగా చర్చించుకోవాలి. పున: పరిశీలన చేసుకోవాలి. లేదంటే రైతులు ఉరి కొయ్యలకు వేలాడే హృదయవిదారక సంఘటనలు కోకొల్లలు చూడాల్సి వస్తుంది. ఏదైనా జరిగినప్పుడు రాజకీయ నేతలు, ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలు, ఎదుటివారిపై దుమ్మెత్తి పోయటం మానుకోవాలి. ఇప్పటికే వారు ఈ విషయంలో చేసింది శూన్యం. ఇక దేశ రాజధానిలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవటం వల్లే రైతుల ఆత్మ హత్యలకు ప్రచారం బాగా జరిగింది కొందరనుకుంటున్నారు. కానీ ఇలా అనుకుంటే మాత్రం పొరపాటుపడ్డట్టే. అలా అనుకుంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా పంటపొలాల్లో సతమతం అవుతున్న రైతులంతా గజేంద్రను ఆదర్శంగా తీసుకొని పార్లమెంటు ముందు పదుల సంఖ్యలో ప్రాణాలు నిలువునా తీసుకునే ప్రమాదం ఉంది. ప్రధాని నరేంద్రమోదీ కూడా పార్లమెంటులో గజేంద్ర మరణంపై స్పందిస్తూ రైతుల ఆత్మహత్యల సమస్య వేళ్లూనుకూని పోయిందని, పురాతన కాలం నాటి నుంచే ఉందని.. దీని పరిష్కరణకై అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనిప్రకటించారు. ఇది కూడా మరొక ప్రకటనగా మిగిలిపోకుండా ఆచరణ రూపంలోకి తీసుకొస్తే గజేంద్రలాంటి రైతులెందరికో మోక్షం లభించినట్లే. (యం.నాగేశ్వరరావు) -
మీదే బాధ్యత.. కాదు మీదే!
పార్టీల నిందాపర్వం; ప్రధాని సంతాపం ఆప్ ర్యాలీలో రైతు ఆత్మహత్య ఘటనపై రాజకీయ పార్టీల నిందాపర్వం మొదలైంది. ఒకవైపు రైతు ఆత్మహత్యకు పాల్పడుతుండగా, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సహా ఆప్ నేతలంతా ప్రసంగాలపైనే దృష్టి పెట్టారంటూ బీజేపీ ఆరోపించింది. ‘మీకు ప్రాణాలు ముఖ్యమా, రాజకీయాలు ముఖ్యమా?’ అని ప్రశ్నించింది. దీన్ని హత్యగా భావించి, ర్యాలీ నిర్వాహకులపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. కాగా, ఈ ఘటనకు ఢిల్లీ పోలీసులే బాధ్యులని ఆప్ పేర్కొంది. గజేంద్ర ఆత్మహత్యకు పాల్పడుతుండగా, అక్కడే ఉన్న పోలీసులు చూస్తూ ఉండిపోయారని కేజ్రీవాల్ ఆరోపించారు. ‘ఆత్మహత్య బాధాకరం. ఆ రైతు కుటుంబాన్ని ఓదార్చేందుకు మాటలు లేవు. ఆ వ్యక్తిని చెట్టుపై నుంచి కిందకు దింపమని పోలీసులకు చెబ్తూనే ఉన్నాం. పోలీసు శాఖ మా అధీనంలో లేకపోయినా.. కనీసం మానవత్వంతోనైనా స్పందించాల్సింది’ అన్నారు. ‘మరోసారి ఎవరైనా ఇలాగే ఆత్మహత్యకు ప్రయత్నిస్తే.. చెట్టెక్కి ఆ వ్యక్తిని రక్షించమని కేజ్రీవాల్‌కు చెబుతా’ అని మరో నేత అశుతోశ్ వ్యంగ్యంగా అన్నారు. రైతు ఆత్మహత్యకు ప్రధాని మోదీ, కేజ్రీవాల్లే బాధ్యులని, వారిపై ఆత్మహత్యకు పురిగొల్పిన నేరారోపణ కింద కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ నేత సత్యవ్రత్ చతుర్వేది డిమాండ్ చేశారు. ఇలాంటి బాధాసమయంలో ఎలాంటి వ్యాఖ్యలూ చేయాలనుకోవడం లేదని రాహుల్ అన్నారు. ఒంటరివారమని అనుకోకండి.. మోదీ ఢిల్లీలో రైతు ఆత్మహత్యపై తీవ్ర ఆవేదనకు, ఆసంతృప్తికి గురయ్యానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎప్పుడు తాము ఒంటరివారిమన్న భావన తమలో రానీయవద్దని రైతాంగానికి సూచించారు. రైతులకు మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు తామంతా ఉన్నామన్నారు. రైతు గజేంద్ర కుటుంబానికి సంతాపం తెలియజేస్తూ ట్వీట్ చేశారు. దేశంలో నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం లోతును, రైతుల్లో నెలకొని ఉన్న అసంతృప్తిని ఈ ఘటన వెల్లడిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పేర్కొన్నారు. రైతు ఆత్మహత్యకు ప్రధాని మోదీ బాధ్యుడని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యుడు నారాయణ విమర్శించారు. ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో గజేంద్ర కుటుంబసభ్యులను పరామర్శించారు. గజేంద్ర ఆత్మహత్యపై రాజస్తాన్ సీఎం వసుంధర రాజే విచారం వ్యక్తం చేశారు. మృతుని కుటుంబానికి సానుభూతి తెలిపారు. -
దసరా గజేంద్రుడికి ఎందుకు తిక్కరేగింది?
మైసూరు: అంగరంగ వైభవంగా జరిగే మైసూరు ఉత్సవాల్లో గజేంద్రుల ఊరేగింపు ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తుందనే విషయం అందరికి తెల్సిందే. అయితే అశేష జనసందోహం, పిల్లల కేరింతల మధ్య ఏనుగులు మావటీలు చెప్పిన మాటవిని బుద్ధిగా నడుచుకోవడం మామూలు విషయం కాదు. వాటికి ఎంతో క్రమశిక్షణ నేర్పుతారు. గత 20 ఏళ్లుగా శ్రీరామ, గజేంద్ర అనే పేర్లుగల రెండు ఏనుగులు దసరా ఉత్సవాల్లో పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. 60 ఏళ్ల గజేంద్రుడు, 59 ఏళ్ల శ్రీరామా ఎప్పుడూ కలిసిమెలసి ఆప్యాయంగానే ఉంటాయి. గత ఆదివారం నాడు ఏమైందోగానీ గజేంద్రుడికి తిక్కరేగి గణపతి అనే మావటి సహాయకుడిని చంపడమే కాకుండా అన్నేళ్లుగా తోడుగా వుంటున్న శ్రీరామాను కూడా వెంటాడి వెంటాడి చంపేసింది. ఆ తర్వాత సమీపంలోని అడవిలోకి పారిపోయింది. రంగనాథస్వామి ఆలయానికి చెందిన జంతుసంరక్షణశాలలో చోటుచేసుకున్న ఈ హఠాత్పరిణామం పట్ల ఇటు ఆలయ నిర్వాహకులు, అటు సంరక్షణ కేంద్రం అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటక అడవుల పొలిమేరల్లో, ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో అటవి ఏనుగులు బీభత్సం సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పలు సందర్భాల్లో వాటిని దారిలో తీసుకరావడానికి శ్రీరామా ఏనుగు ఎంతో తోడ్పడిందని ఫారెస్ట్ అధికారి నాగరాజ్ తెలిపారు. ఇంతవరకు దాదాపు 75 అటవి ఏనుగులను మచ్చిక చేసుకొని దారిలోకి తీసుకరావడానికి తోడ్పడిన శ్రీరామా మిత్రుడి చేతిలోనే చనిపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇంతకాలం రంగనాథ ఆలయ గజపతిగా సేవలందించిన శ్రీరామాకు సోమవారం ఘనంగా అంత్యక్రియలు నిర్వహించారు. గజేంద్రుడి అనూహ్య ఆగ్రహానికి దారితీసిన పరిస్థితులేమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నామని వైల్డ్‌లైఫ్ ప్రిన్సిపల్ కన్జర్వేటర్ వినయ్ లూత్రా మీడియాకు తెలిపారు. -
వివాహేతర సంబంధాన్ని నిలదీసింది అని....
కిరాతకం.. వివాహేతర సంబంధాన్ని నిలదీసిందన్న అక్కసుతో.. భార్య, కుమారుడిని హతమార్చిన కర్కోటకుడు పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న వైనం అనాథగా మారిన మూడు నెలల చిన్నారి కోలారు : వివాహేతర సంబంధం వద్దన్న భార్యను కిరాతకంగా నరికి వేశాడు ఓ కర్కోటకుడు. అంతటితో ఆగకుండా ఘటనను కళ్లార చూసిన కన్న కుమారుడిని సైతం అదే కొడవలికి బలి చేశాడు. శ్రీనివాసపుర పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఇలా... శ్రీనివాసపురం తాలూకాలోని మీనగానహళ్లికి చెందిన గంగాధర్(35)కు ఐదేళ్ల క్రితం చిక్కబళ్లాపురం జిల్లా గుడిబండకు చెందిన శాంతమ్మ(29)తో వివాహమైంది. వీరికి గజేంద్ర(3) కుమారుడు ఉన్నాడు. ఇటీవల కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన శాంతమ్మ తొమ్మిది నెలల పసిగుడ్డుతో పదిరోజుల క్రితం భర్త వద్దకు చేరుకుంది. తాను కాన్పు కోసం వెళ్లిన సమయంలో తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించిన శాంతమ్మ, అలాంటి వ్యవహారాలను వద్దని భర్తకు నచ్చచెప్పింది. అయినా ఆమె మాటలను అతను పట్టించుకోలేదు. నిత్యం మరో మహిళతో గడిపి ఆలస్యంగా ఇంటికి చేరుకునేవాడు. దీంతో సహనం కోల్పోయిన శాంతమ్మ మంగళవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్న భర్తను నిలదీసింది. వివాహేతర సంబంధం మానుకోవాలని ప్రాధేయపడింది. అయినా అతనిలో మార్పు రాలేదు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలుస్తోందన్న అక్కసుతో కొడవలి తీసుకుని భార్యను నరికి వేశాడు. తల్లిదండ్రులు ఘర్షణ పడుతుండగా మేల్కొన్న గజేంద్ర, ఘటనను చూసి ఒక్కసారిగా గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు. కొడుకును ఊరడించాల్సిన చేతులు కొడవలిని ఝుళిపించాయి. గొంతు తెగడంతో చిన్నారి ఏడుపు ఆగిపోయింది. రక్తపు మడుగులో తల్లీకొడుకులు విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలారు. ఘటనకు సంబంధించి పోలీసులు... కేసులు కళ్లముందు కదలాడడంతో ఇంటి బయట ఉన్న చింత చెట్టుకు గంగాధర్ ఉరి వేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనాథగా మిగిలిన చిన్నారిని ఇరుగుపోరుగు వారు ఆదుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు