Jaya Bachchan, After 7 Yeras Re Entry With Marathi Movie - Sakshi
Sakshi News home page

7 ఏళ్ల తర్వాత జయా బచ్చన్‌ రీ ఎంట్రీ!

Published Thu, Feb 18 2021 2:55 PM | Last Updated on Thu, Feb 18 2021 3:47 PM

Jaya Bachchan Re Entry With Marathi Movie - Sakshi

బాలీవుడ్‌ సీనియర్‌ నటి, సమాజ్‌వాదీ ఎంపీ జయా బచ్చన్‌ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే ఆమె కబీ కుషి కబీ ఘమ్‌, కల్‌ హోనా హో, లాగా చునారీ మేన్‌ దాగ్‌ వంటి పలు సినిమాల్లో తన నటనతో అభిమానులను కట్టిపడేసింది. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత సినిమాలు తగ్గించేసిన ఆమె ఏడేళ్లుగా వెండితెరపై కనిపించనేలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ సినిమా అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. పైగా ఇది ఆమె తొలి మరాఠీ చిత్రమని అంటున్నారు. దీనికి గజేంద్ర అహిరే దర్శకత్వం వహించనున్నట్లు టాక్‌. ఇతడు మరాఠీలో సుమారు 50కి పైగా చిత్రాలకు డైరెక్షన్‌ చేశాడు.

ఇక ఈ వార్తలపై డైరెక్టర్‌ గజేంద్ర స్పందిస్తూ "మేమింకా ఏ నిర్ణయానికి రాలేదు. అప్పుడే బోలెడన్ని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఒక్కటైతే నిజం. ఈ సినిమాలో జయాబచ్చన్‌ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఇదే మాట ఆమెతో చెప్పాను కూడా! మరి ఏమని సమాధానమిస్తుందో చూడాలి. ఈ సినిమా ద్వారా జయ రీ ఎంట్రీ ఇస్తుందని ఆశిస్తున్నా. కానీ ఇప్పటివరకైతే ఇంకా ఏదీ ఫైనలైజ్‌ కాలేదు. కనీసం ఏ భాషలో తీస్తున్నామనేది కూడా డిసైడ్‌ కాలేదు" అని చెప్పుకొచ్చాడు. జయ సినిమాల్లోకి వస్తానంటే ఆమె భర్త అమితాబ్ బచ్చన్‌‌ కూడా సంతోషిస్తాడు. మరి డైరెక్టర్‌ అభ్యర్థనను జయా బచ్చన్‌ అంగీకరిస్తుందా? ఆమె నిజంగానే రీఎంట్రీ ఇస్తుందా? అనేది క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే! 

చదవండి: బిగ్‌బీ కూతురిని చులకనగా చూసిన నెటిజన్‌!

నీ కన్ను నీలి సముద్రం.. చిందేసిన హీరోహీరోయిన్లు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement