వ్యాపారి గజేంద్ర కిడ్నాప్‌ మిస్టరీ వీడింది | Gajendra Kidnapped By Friend For Money | Sakshi
Sakshi News home page

వ్యాపారి గజేంద్ర కిడ్నాప్‌ మిస్టరీ వీడింది

Published Tue, Jul 30 2019 12:27 PM | Last Updated on Tue, Jul 30 2019 1:23 PM

Gajendra Kidnapped By Friend For Money - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దోమలగూడకు చెందిన వ్యాపారి గజేంద్ర పరఖ్‌ కిడ్నాప్‌ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు కిడ్నాపర్లను పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసమే గజేంద్రను కిడ్నాప్‌ చేశారని, ఆయనకు తెలిసిన వారే ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. గజేంద్ర మిత్రుడే ఈ కిడ్నాప్‌ ముఠాకు నాయకుడిగా వ్యవహరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. గజేంద్ర కోట్లల్లో వ్యాపారం చేస్తుంటాడని, ఆయనను కిడ్నాప్‌ చేయడం ద్వారా కోట్ల రూపాయలు రాబట్టవచ్చునని గజేంద్ర స్నేహితుడు అల్మా అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌కు స్కెచ్ వేశాడని, మరో ఇద్దరితో అతను కలిసి గజేంద్రను కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు. డబ్బులు తీసుకొని గజేంద్రను అల్మా గ్యాంగ్ ఇప్పటికే విడిచిపెట్టింది. అయితే, రంగంలోకి దిగిన పోలీసులు తాజాగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement