వివాహేతర సంబంధాన్ని నిలదీసింది అని.... | Fornication | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధాన్ని నిలదీసింది అని....

Published Thu, Mar 12 2015 12:27 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

వివాహేతర సంబంధాన్ని నిలదీసింది అని.... - Sakshi

వివాహేతర సంబంధాన్ని నిలదీసింది అని....

కిరాతకం..
 
వివాహేతర సంబంధాన్ని నిలదీసిందన్న అక్కసుతో..
భార్య, కుమారుడిని హతమార్చిన కర్కోటకుడు
పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న వైనం
అనాథగా మారిన మూడు నెలల చిన్నారి

 
కోలారు :  వివాహేతర సంబంధం వద్దన్న భార్యను కిరాతకంగా నరికి వేశాడు ఓ కర్కోటకుడు. అంతటితో ఆగకుండా ఘటనను కళ్లార చూసిన కన్న కుమారుడిని సైతం అదే కొడవలికి బలి చేశాడు. శ్రీనివాసపుర పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఇలా... శ్రీనివాసపురం తాలూకాలోని మీనగానహళ్లికి చెందిన గంగాధర్(35)కు ఐదేళ్ల క్రితం చిక్కబళ్లాపురం జిల్లా గుడిబండకు చెందిన శాంతమ్మ(29)తో వివాహమైంది. వీరికి గజేంద్ర(3) కుమారుడు ఉన్నాడు. ఇటీవల కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన శాంతమ్మ తొమ్మిది నెలల పసిగుడ్డుతో పదిరోజుల క్రితం భర్త వద్దకు చేరుకుంది. తాను కాన్పు కోసం వెళ్లిన సమయంలో తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించిన శాంతమ్మ, అలాంటి వ్యవహారాలను వద్దని భర్తకు నచ్చచెప్పింది. అయినా ఆమె మాటలను అతను పట్టించుకోలేదు. నిత్యం మరో మహిళతో గడిపి ఆలస్యంగా ఇంటికి చేరుకునేవాడు. దీంతో సహనం కోల్పోయిన శాంతమ్మ మంగళవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్న భర్తను నిలదీసింది. వివాహేతర సంబంధం మానుకోవాలని ప్రాధేయపడింది. అయినా అతనిలో మార్పు రాలేదు.

తన వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలుస్తోందన్న అక్కసుతో కొడవలి తీసుకుని భార్యను నరికి వేశాడు. తల్లిదండ్రులు ఘర్షణ పడుతుండగా మేల్కొన్న గజేంద్ర, ఘటనను చూసి ఒక్కసారిగా గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు. కొడుకును ఊరడించాల్సిన చేతులు కొడవలిని ఝుళిపించాయి. గొంతు తెగడంతో చిన్నారి ఏడుపు ఆగిపోయింది. రక్తపు మడుగులో తల్లీకొడుకులు విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలారు. ఘటనకు సంబంధించి పోలీసులు... కేసులు కళ్లముందు కదలాడడంతో ఇంటి బయట ఉన్న చింత చెట్టుకు గంగాధర్ ఉరి వేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనాథగా మిగిలిన చిన్నారిని ఇరుగుపోరుగు వారు ఆదుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement