santamma
-
వనస్థలిపురంలో చైన్‌స్నాచింగ్
వనస్థలిపురం బీఎన్‌రెడ్డినగర్‌లో బుధవారం ఉదయం చైన్‌స్నాచింగ్ జరిగింది. రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న శాంతమ్మ మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసును వెనుక నుంచి బైక్‌పై వేగంగా వచ్చిన దుండగులు తెంపుకుని పోయారు. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవటంతో ఆమె కేకలు వేసినా ఫలితం లేకపోయింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. -
రోడ్డు ప్రమాదంలో బెంగళూరు వాసి మృతి
మంత్రాలంయ శ్రీ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణమైన బెంగళూరు వాసుల వాహనం ప్రమాదానికి గురై ఓ మహిళ మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కర్నూలు జిల్లా పెద్దకడబూరు మండలం బసలదొడ్డి గ్రామ శివారులో శనివారం చోటుచేసుకుంది. బెంగళూరుకు చెందిన శాంతమ్మ(55) కుటుంబం ఈ రోజు ఉదయం మారుతి కార్లో మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకొని వెళ్తుండగా.. కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో వాహనంలో ఉన్న శాంతమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
వివాహేతర సంబంధాన్ని నిలదీసింది అని....
కిరాతకం.. వివాహేతర సంబంధాన్ని నిలదీసిందన్న అక్కసుతో.. భార్య, కుమారుడిని హతమార్చిన కర్కోటకుడు పోలీసులకు భయపడి ఆత్మహత్య చేసుకున్న వైనం అనాథగా మారిన మూడు నెలల చిన్నారి కోలారు : వివాహేతర సంబంధం వద్దన్న భార్యను కిరాతకంగా నరికి వేశాడు ఓ కర్కోటకుడు. అంతటితో ఆగకుండా ఘటనను కళ్లార చూసిన కన్న కుమారుడిని సైతం అదే కొడవలికి బలి చేశాడు. శ్రీనివాసపుర పోలీసుల సమాచారం మేరకు వివరాలు ఇలా... శ్రీనివాసపురం తాలూకాలోని మీనగానహళ్లికి చెందిన గంగాధర్(35)కు ఐదేళ్ల క్రితం చిక్కబళ్లాపురం జిల్లా గుడిబండకు చెందిన శాంతమ్మ(29)తో వివాహమైంది. వీరికి గజేంద్ర(3) కుమారుడు ఉన్నాడు. ఇటీవల కాన్పు కోసం పుట్టింటికి వెళ్లిన శాంతమ్మ తొమ్మిది నెలల పసిగుడ్డుతో పదిరోజుల క్రితం భర్త వద్దకు చేరుకుంది. తాను కాన్పు కోసం వెళ్లిన సమయంలో తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించిన శాంతమ్మ, అలాంటి వ్యవహారాలను వద్దని భర్తకు నచ్చచెప్పింది. అయినా ఆమె మాటలను అతను పట్టించుకోలేదు. నిత్యం మరో మహిళతో గడిపి ఆలస్యంగా ఇంటికి చేరుకునేవాడు. దీంతో సహనం కోల్పోయిన శాంతమ్మ మంగళవారం రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుకున్న భర్తను నిలదీసింది. వివాహేతర సంబంధం మానుకోవాలని ప్రాధేయపడింది. అయినా అతనిలో మార్పు రాలేదు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా నిలుస్తోందన్న అక్కసుతో కొడవలి తీసుకుని భార్యను నరికి వేశాడు. తల్లిదండ్రులు ఘర్షణ పడుతుండగా మేల్కొన్న గజేంద్ర, ఘటనను చూసి ఒక్కసారిగా గట్టిగా ఏడుపు మొదలుపెట్టాడు. కొడుకును ఊరడించాల్సిన చేతులు కొడవలిని ఝుళిపించాయి. గొంతు తెగడంతో చిన్నారి ఏడుపు ఆగిపోయింది. రక్తపు మడుగులో తల్లీకొడుకులు విలవిల్లాడుతూ ప్రాణాలు వదిలారు. ఘటనకు సంబంధించి పోలీసులు... కేసులు కళ్లముందు కదలాడడంతో ఇంటి బయట ఉన్న చింత చెట్టుకు గంగాధర్ ఉరి వేసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున విషయాన్ని గుర్తించిన స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనాథగా మిగిలిన చిన్నారిని ఇరుగుపోరుగు వారు ఆదుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు -
జిల్లాలో తొలి స్వైన్‌ఫ్లూ మరణం నమోదు
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మహిళ మృతి నర్సంపేట ప్రవీణ్‌కు స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ మరో ఇద్దరి రిపోర్టుల కోసం ఎదురుచూపు హసన్‌పర్తి : నగరంలోని చింతగట్టు క్యాంపు ప్రాంతానికి చెందిన బి.శాంతమ్మ(51) అనే మహిళ హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందినట్లు ఆర్డీ నాగేశ్వర్రావు వెల్లడించారు. సోమవారం ఆయన మృతురాలి ఇంటికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. చింతగట్టు క్యాంపు ప్రాంతానికి చెందిన బి. శాంతమ్మ ఈ నెల 12వ తేదీన కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్లలోని బంధువుల ఇంటికి వెళ్లింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆమె జ్వరంతో బాధపడుతూ స్థానిక వైద్యుడిని ఆశ్రయించింది. జ్వరం నయం కాకపోవడంతో నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. చికిత్స చేస్తుండగా ఆమెకు ఫిట్స్ రావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సైన్‌ఫ్లూగా నిర్ధారించారు. ఈ క్రమంలోనే ఆమె చికిత్స పొందుతూ ఆమె ఆదివారం రాత్రి మృతిచెందింది. కాగా యశోదా ఆస్పత్రి అధికారులు ఇచ్చిన సమాచారంతో ఆర్డీ నాగేశ్వర్రావు, డాక్టర్ కృష్ణారావు, డాక్టర్ గణేష్, డాక్టర్ రాజిరెడ్డి చింతగట్టు క్యాంప్‌లో పర్యటించారు. వంద ఇళ్ల పరిధి వరకు వ్యాధి సోకే అవకాశం.. సైన్‌ఫ్లూ సోకిన బాధితుడి పరిసరాల్లో వంద ఇళ్ల వరకు ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని ఆర్డీ నాగేశ్వర్రావు తెలిపారు. ఈ ప్రాంతాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. వ్యాధి నిర్ధారణ అయిన చింతగట్టుక్యాంప్, నర్సంపేటతోపాటు పెద్ద మ్మ గడ్డ ప్రాంతంలో వైద్య సిబ్బంది సర్వే చేస్తున్నట్లు వివరించారు. అక్కడ ఇంటింటికి వెళ్లి సైన్‌ఫ్లూ వ్యాధి వ్యాప్తి, నివారణపై కరపత్రాల ద్వారా ప్రచారం చేస్తున్నారని చెప్పారు. సైన్‌ఫ్లూ వ్యాధి సోకిన బాధితురాలి చుట్టుపక్కల ఉన్న గుండెనొప్పి, కిడ్నీ బాధితులు, చిన్న పిల్లలు తమ ఇళ్ల నుంచి బయటికి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లక్షణాలు... నాలుగు రోజులపాటు జ్వరం తగ్గకుండా ఉండడం, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒల్లు నొప్పి, విరేచనాలు, శ్వాస తీసుకోలేకపోవడం, మెదడు వద్ద వాపు రావడం వ్యాధి లక్షణాలని పేర్కొన్నారు. ఇవి కనిపించిన వెంటనే స్థానిక వైద్యాధికారిని సంప్రదించి ప్రాథమిక వైద్యం తీసుకోవాలన్నారు. బాధితుల కోసం 18004250095 టోల్‌ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. నర్సంపేట ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ వార్డు.. నర్సంపేట : పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో సోవువారం స్వైన్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు. ఈ వార్డును వైద్య, ఆరోగ్య శాఖ ఆర్డీ నాగేశ్వర్రావు సందర్శించారు. ఆర్డీఓ రావుకృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ ఉదయ్‌సింగ్, ఎస్పీహెచ్ఓ వెంకటరవుణ పాల్గొన్నారు. ఎంజీఎంలో మరో స్వైన్ ఫ్లూ అనుమానిత కేసు ఎంజీఎం : ఎంజీఎం ఆస్పత్రిలో కరీంనగర్ జిల్లా రామగుండంకు చెందిన అమీనా అనే రోగికి స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనబడటంతో ఆమె ను వైద్యులు ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డుకు తరలించారు. జలుబు, జ్వరంతో బాధపడుతూ శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుండగా ఆమె తెమడ నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని ఇనిస్టిట్యూట్ ప్రివెంట్ మెడిసిన్‌కు పంపించారు. నాలుగురోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన నర్సంపేటకు చెందిన ప్రవీణ్ అనే వ్యక్తికి స్వైన్‌ఫ్లూ సోకినట్టు నిర్ధారించారు. కాగా హన్మకొండ పెద్దమ్మగడ్డకు చెందిన స్వైన్ ఫ్లూ అనుమానిత రోగి తనూజకు చెందిన రోగ నిర్ధారణ పరీక్షల కోసం వైద్యులు ఎదురుచూస్తున్నారు. తెమడ నమూనాలు పంపినా 72 గంటలు గడిచినా నివేదికలు అందకపోవడంతో వైద్యులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
చట్టం చట్రంలో.. పిచ్చి..ప్రేమ!
తల్లినయ్యాననే విషయమే తెలియని పిచ్చితల్లి ఒకామె.. కొద్ది గంటల లాలనలోనే పుత్రప్రేమామృతాన్ని ఆస్వాదించిన తల్లి ఇంకొకామె.. ఇంతలో చట్టం అడ్డొచ్చింది.. తన పని తాను చేసుకుపోయింది. జన్మనిచ్చిన పిచ్చితల్లి వద్ద వదిలేయలేక.. అలా అనీ పెంచుకుంటానని మమకారం చూపించిన తల్లికి అప్పగించడానికి రూల్స్ అంగీకరించక.. ఆ బిడ్డను శిశుగృహ చట్రంలో ఇరికించింది. శ్రీకాకుళం పీఎన్ కాలనీలో జరిగిన ఈ ఘటన స్థానికుల హృదయాలను కదిలించేసింది. చట్టం ఆ శిశువును ఏ గూటికి చేరుస్తోందనన్న చర్చకు తావిచ్చింది. శ్రీకాకుళం క్రైం:మంగళవారం.. అప్పుడే తెల్లవారుతోంది.. ఈ లోకంలోకి మరో శిశువు అడుగుపెట్టింది. పీఎన్ కాలనీ లోని వేంకటేశ్వర స్వామి గుడి సమీపంలో మతిస్థిమితం లేని ఓ మహిళ ఆ మగ శిశువుకు జన్మనిచ్చింది. అయితే తాను తల్లినయ్యాననే విషయం ఆ పిచ్చితల్లికి తెలియదు. నడిరోడ్డు మీద పడి ఉన్న తల్లీబిడ్డలను గమనించిన శాంతమ్మ అనే స్థానికురాలు అయ్యో.. అంటూ దగ్గరకెళ్లి శిశువును శుభ్రం చేసింది. అనంతరం తనకు వరుసకు కూతురు అయ్యే ఎం.లలితకు ఆ శిశువును అప్పగించింది. లలిత సోదరి ఎల్.ధనలక్ష్మికి ఒక పాప ఉండగా.. ఇద్దరు కొడుకులు పుట్టి చనిపోయారు. కొడుకుల్లేని తన చెల్లెలి కోసం శిశువును తీసుకున్న లలిత ఇచ్చిన సమాచారం మేరకు కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న ధనలక్ష్మి శిశువున అక్కున చేర్చుకొని శుభ్రం చేసి.. పాలు పట్టి లాలించింది. ఈ విషయం ఆనోటా.. ఈనోటా పాకి.. చివరికి బాలల సంరక్షణ అధికారులకు తెలిసింది. దాంతో వారు రంగంలోకి దిగారు. మతిస్థిమితం లేని బాలింతతోపాటు.. ఆమె ప్రసవించిన శిశువునూ ధనలక్ష్మి నుంచి తీసుకొని రిమ్స్‌కు తరలిం చారు. అక్కడ శిశువుకు వైద్య పరీక్షలు చేయించిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో శిశుగృహకు తరలించారు. బాబును మాకప్పగించండి మగపిల్లలు లేనందున ఆ శిశువును పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని.. బిడ్డను తమకు ఇచ్చేయాలని ధనలక్ష్మి భోరున విలపిస్తూ ప్రాధేయపడినా అధికారులు, చైల్డ్‌లైన్ సభ్యులు అంగీకరించలేదు. మతిస్థిమితం లేని కన్నతల్లి ఎలాగూ పెంచలేదు.. శిశుగృహకు తరలించి.. ఇంకెవరికో ఇచ్చే బదులు తమకే ఇస్తే మగపిల్లలు లేని లోటు తీరుతుందని.. అల్లారుముద్దుగా పెంచుకుంటామని ఆమె చేసిన విన్నపాలు ఫలించలేదు. ఆ పిచ్చితల్లికి ఇది రెండో కాన్పు కాగా మతిస్థిమితం లేని మహిళకు ఇది రెండో కాన్పు అని బాలల సంరక్షణాధికారి ఐ.లక్ష్మీనాయుడు చెప్పారు. ఆయన కథనం ప్రకారం.. పొందూరు మండలం రాపాక గ్రామానికి చెందిన కొంచాడ పార్వతి మతిస్థిమితం కోల్పోయి కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వచ్చేసింది. వారు వీరు ఇచ్చినది తింటూ కాలం వెళ్లదీస్తోంది. ఆమెపై కామాంధులెవరో కన్నేసి కోరిక తీర్చుకున్నారు. దీంతో ఆమె గర్భం దాల్చి మంగళవారం ప్రసవించింది. ఇదే రీతి లో గతంలో నవభారత్ జంక్షన్ వద్ద కూడా ఒక శిశువుకు జన్మనిచ్చింది. అప్పుడు కూడా స్థానికులెవరో తీసుకెళ్లడానికి ప్రయత్నించగా తాము వెళ్లి చట్టప్రకారం శిశువును స్వాధీనం చేసుకున్నామని లక్ష్మీనాయుడు వివరించారు. ఇప్పుడూ అదే పని చేశామని, పిల్లలు లేని వారికి చట్ట ప్రకారం దత్తత ఇస్తామని వివరించారు. ఆయన వెంట చైల్డ్‌లైన్ కో-అర్డినేటర్ కె.నరేష్, టీమ్ సభ్యురాలు శ్రీలక్ష్మి ఉన్నారు. కాగా ప్రసవించిన శిశువును ఆ పిచ్చితల్లే అమ్మేసిందన్న ఆరోపణలు విని పించాయి. దీనిపై పిచ్చితల్లి పార్వతిని అడగ్గా.. ఏదేదో పిచ్చిపిచ్చిగా మాట్లాడింది. ఈ ఆరోపణను ధనలక్ష్మి ఖండించింది. -
‘ఫైలిన్’మరింత ఉధృతం: వాగుల్లో ఇద్దరి మృతి
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఫైలిన్ తుపాను తీరం చేరకముందే జిల్లాలో ఇద్దరిని బలిగొంది. మరో బాలిక వాగులో కొట్టుకుపోయి గల్లంతైంది. తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు జిల్లాలోని కుంపిణీవాగు, కొండవాగు, బుడమేరు, పోతులవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆగిరిపల్లి మండలం సింహాద్రి అప్పారావుపేటకు చెందిన కరేటి శైలజ (15), నక్కనబోయిన పావని (14) గురువారం కుంపిణీ వాగులో గల్లంతవగా శైలజ శవమై తేలింది. ముసునూరు మండలం యల్లాపురానికి పుట్టింటికి వచ్చేందుకు పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో తమ్మిలేరు దాటేందుకు ప్రయత్నించిన కంభంపాటి శాంతమ్మ (46) నీటి ఉధృతికి కొట్టుకుపోగా ఆమె మృతదేహం బలివే వద్ద దొరికింది. నేటినుంచి మరింత ఉధృతం బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తుపానుగా మారి విశాఖపట్నానికి తూర్పు ఆగ్నేయ దిశగా 800 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి తుపాను ప్రభావం మరింత ఉధృతమవుతుందని వారు తెలిపారు. కోస్తా ప్రాంతంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వివరించారు. తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 40 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం తుపాను ప్రభావంతో బుధ, గురువారాల్లో జిల్లా వ్యాప్తంగా 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వీరులపాడులో 126, అత్యల్పంగా నాగాయలంకలో 0.8 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలతో నందిగామ, మైలవరం తదితర ప్రాంతాల్లో పూత, పిందె దశలో ఉన్న పత్తి పైరు దెబ్బతిందని రైతులు చెబుతున్నారు. తుపాను విపత్తును తట్టుకునేందుకు జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మచిలీపట్నం, నాగాయలంక, కోడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి, అవనిగడ్డ, మోపిదేవి మండలాలకు ప్రత్యేకాధికారులను నియమించారు. వీరితో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, జిల్లా ప్రత్యేకాధికారి బీఆర్ మీనా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి సూచనలు, సలహాలు అందజేశారు. తుపాను ప్రభావంతో మంగినపూడి బీచ్‌లోకి పర్యాటకులను గురువారం నుంచి అనుమతించటం లేదు. సముద్రంలోనే 40 బోట్లు... నాలుగైదు రోజుల క్రితం సముద్రంలోకి గిలకలదిండి హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన 40 బోట్లను వెంటనే తిరిగి వచ్చేయాలని మత్స్యశాఖ డీడీ టి.కళ్యాణం గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్క బోటులో ఎనిమిది మంది చొప్పున ఉన్నారని వివరించారు. శుక్రవారానికి ఈ బోట్లు గిలకలదిండి హార్బర్‌కు చేరే అవకాశముంది. పొంగి ప్రవహిస్తున్న వాగులు... బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పశ్చిమకృష్ణాలో కొండవాగు, బుడమేరు, పోతులవాగు పొంగి ప్రవహిస్తున్నాయి. జి.కొండూరు సమీపంలోని వెలగలేరు వద్ద బుడమేరులో ఇవి కలుస్తాయి. ఇటీవల కాలంలో ఇక్కడి హెడ్ రెగ్యులరేటర్లకు గేట్లు అమర్చారు. పది అడుగుల మేర నీటి మట్టం ఇక్కడకు చేరితే ప్రమాద స్థాయికి చేరినట్లని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎనిమిది అడుగుల మేర నీటి మట్టం ఉందని, మరిన్ని వర్షాలు కురిసి వరద ఉధృతి పెరిగితే రెగ్యులేటర్ గేట్లు తెరవాల్సి ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ గేట్లు తెరిస్తే వెలగలేరు సమీపంలో రైలు కట్టకు దిగువన ఉన్న కొత్తూరు తాడేపల్లి, సింగ్‌నగర్, పాయకాపురంలలోకి వరదనీరు ప్రవేశించే అవకాశం ఉంది. ముసునూరు మండలంలో ఉన్న రామిలేరువాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నందిగామ ప్రాంతంలో ఉన్న మున్నేరువాగులోకి వరదనీటి రాక అధికమైంది. తుపాను ప్రభావంతో మరింత వర్షం కురిస్తే ఈ వాగులు ప్రమాదస్థాయిని మించి ప్రవహించే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ప్రత్యేక అధికారుల నియామకం... జిల్లాలో తుపాను ప్రబావిత ప్రాంతాలకు ప్రత్యేకాధికారులను కలెక్టర్ బుద్ధప్రకాష్ ఎం.జ్యోతి నియమించారు. మచిలీపట్నానికి జెడ్పీ సీఈవో, మత్స్యశాఖ ఏడీలను, నాగాయలంకకు మత్స్యశాఖ డీడీ, జిల్లా బీసీ సంక్షేమశాఖాధికారిలను, కోడూరుకు సాంఘిక సంక్షేమశాఖ జేడీ, డీఆర్డీఏ పీడీలను, కృత్తివెన్నుకు డ్వామా పీడీ, విజయవాడ మత్స్యశాఖ ఏడీలను, బంటుమిల్లికి ఎస్సీ సొసైటీ ఈడీని, అవనిగడ్డకు జిల్లా సహకార శాఖాధికారిని, మోపిదేవికి రాజీవ్ విద్యామిషన్ పీవో నియమితులయ్యారు. వీరితో పాటు భారీ వర్షాలు కురిసి విపత్కర పరిస్థితులు ఏర్పడితే ప్రజలను కాపాడేందుకు జగ్గయ్యపేటకు మెప్మా పీడీని, చందర్లపాడుకు ఏపీఎంఐపీ ప్రాజెక్టు డెరైక్టర్‌ను, కంచికచర్లకు వ్యవసాయశాఖ జేడీని, ఇబ్రహీంపట్నానికి డీపీవోను, విజయవాడ అర్బన్‌కు అటవీ అధికారిని, విజయవాడ రూరల్‌కు వీజీటీఎం ఉడా అధికారిని, పెనమలూరుకు జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారిని, కంకిపాడుకు పరిశ్రమల శాఖ జీఎంను, తోట్లవల్లూరుకు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ప్రత్యేకాధికారిని, పమిడిముక్కలకు కార్మిక శాఖ డెప్యూటీ కమిషనర్‌ను, ఘంటసాలకు చేనేత, జౌళిశాఖ ఏడీని, చల్లపల్లికి గృహనిర్మాణ సంస్థ పీడీని నియమించారు.