![Vivo Y12S Launched With MediaTek Helio P35 Chipset Processor - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/19/vivoY12s.jpg.webp?itok=VitU5AT3)
మొబైల్ ప్రపంచంలో చైనా మొబైల్ సంస్థల హవా కొనసాగుతూనే ఉంది. తాజాగా వివో తమ వినియోగదారుల కోసం బడ్జెట్ ధరలో మరో మొబైల్ ని తీసుకువచ్చింది. "వివో వై12ఎస్" పేరుతో హాంకాంగ్ మరియు వియత్నాం మార్కెట్ లోకి ప్రవేశ పెట్టింది. ఈ మొబైల్ లో మీడియాటెక్ హీలియో పీ35 ప్రాసెసర్‌ను అందించింది. వివో వై 12 ఎస్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ వి 10 (క్యూ) ఆపరేటింగ్ సిస్టమ్‌పై నడుస్తుంది. దీనిలో 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ ఫాంటం బ్లాక్, గ్లేసియర్ బ్లూ రంగుల్లో లభించనున్నాయి.
వివో వై 12 ఎస్ స్మార్ట్‌ఫోన్‌లో ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే ఉంది. స్క్రీన్ 720 x 1600 పిక్సెల్స్ మరియు 270 పిపిఐ పిక్సెల్ డెన్సిటీ రిజల్యూషన్ కలిగి ఉంది. కెమెరా ముందు భాగంలో 8 ఎంపీ కెమెరా, అలాగే ప్రధాన కెమెరా విషయానికి వస్తే 16 ఎంపీ ప్రైమరీ కెమెరా, 5 ఎంపీ వైడ్ యాంగిల్, అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ డెప్త్ కెమెరా ఉన్నాయి. ఇది 5000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ తో వస్తుంది. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్ లాక్ ఫీచర్లు కూడా ఉన్నాయి. డ్యూయల్ 4జీ వోల్టే, 2.4 గిగాహెర్ట్జ్ వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్, మైక్రో యూఎస్‌బీ 2.0, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. భారతదేశంలో వివో వై 12 ఎస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ .11,999గా ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment