HTC 10
-
ఇటీవల ధర తగ్గిన స్మార్ట్ఫోన్లివే!
ఓ కొత్త స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. చాలామంది కొత్త కొత్త ఫోన్లు ఏం మార్కెట్లోకి వస్తున్నాయి? ఫీచర్లేమున్నాయి, ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? ధర తగ్గించే ప్లాన్స్ ఏమన్న ఉన్నాయా? అని తెగ సెర్చ్ చేస్తుంటారు. స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా అదరగొట్టే ఫీచర్లతో, బడ్జెట్ ధరలతో మార్కెట్లోకి వస్తున్నాయి. ఇటీవలే కొన్ని కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లపై రేట్లను కూడా తగ్గించేశాయి. ఇటీవల రేట్లు తగ్గించిన స్మార్ట్ ఫోన్ కంపెనీలేమిటి? ప్రస్తుతం ఆ స్మార్ట్ ఫోన్లు ఎంతధరకు మార్కెట్లో లభిస్తున్నాయో ఓసారి చూద్దాం... హెచ్‌టీసీ యూ ఆల్ట్రా(రూ.7000 తగ్గింపు) లాంచ్ అయిన నెలల్లోపే తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధరను హెచ్‌టీసీ తగ్గించేసింది. ఐఫోన్ 7 కంటే మించిన ధరల్లో గత నెల హెచ్‌టీసీ యు ఆల్ట్రా స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. లాంచింగ్ సమయంలో 59,990గా దీని ధరను, కేవలం ఒకే ఒక్క నెలల్లోనే 7వేల రూపాయలు తగ్గించేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ 52,990లకే అందుబాటులో ఉంది. సోని ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్(రూ.10వేలు తగ్గింపు) సోని ఇటీవలే తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ డివైజ్ ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్ ధరను భారీగా తగ్గించింది. లాంచింగ్ సమయంలో రూ.51,990గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం 41వేల రూపాయలకే అందుబాటులో ఉంచింది. అంటే 10వేల రూపాయల తగ్గించేసిందన్నమాట. హెచ్‌టీసీ 10( రూ.10వేలు తగ్గింపు) హెచ్‌టీసీ మరో స్మార్ట్ ఫోన్‌పై 10వేల రూపాయల ధర తగ్గించింది. 52,990 రూపాయలకు అందుబాటులో ఉన్న హెచ్‌టీసీ 10ను 10వేల రూపాయలు తగ్గించి, 42,990 రూపాయలకు అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ ఏ9 ప్రొ(రూ.2590 తగ్గింపు) శాంసంగ్ కూడా గతేడాది సెప్టెంబర్ లో తీసుకొచ్చిన ఏ9 ప్రొపై ధరను కొంతమేర తగ్గించింది. రూ.32,490కు లాంచ్ చేసిన ఫోన్ ధరను రూ.2590 తగ్గిస్తూ 29,900 రూపాయలకు అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. ఈ ఫోన్ స్పెషల్ అట్రాక్షన్ 5000 ఏంఏహెచ్ బ్యాటరీ. మోటో జీ4 ప్లస్(16జీబీ వేరియంట్ పై 2000 ధర తగ్గింపు) అతిపెద్ద స్ట్రీన్ వేరియంట్ మోటో జీ4 ప్లస్ తన రెండు స్టోరేజ్ వేరియంట్లపై ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 2000 రూపాయల మేర ధర తగ్గించి ఆ ఫోన్ 16జీబీ వేరియంట్ ను 11, 999కే అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. ఈ వేరియంట్ అసలు ధర 13,999 రూపాయలు. 32జీబీ వెర్షన్ పై కూడా 1000 కట్ చేసి, 13,999కే అందుబాటులోకి తెచ్చింది. అలాగే మోటో జీ4 ధర కూడా రెండు వేల రూపాయల తగ్గి, 10,499కు వినియోగదారుల ముందుకొచ్చింది. లెనోవో జెడ్2 ప్లస్(రూ.3000 ధర తగ్గింపు) లెనోవో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2016 సెప్టెంబర్ లో లాంచ్ చేసింది. 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్ ధరను కంపెనీ 3000 రూపాయల మేర తగ్గించింది. 3జీబీ వేరియంట్ పై 3000రూపాయలు, 4జీబీ వేరియంట్ పై 2500 రూపాయలు ధర కోత పెడుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 3జీబీ వేరియంట్ ధర రూ.14,999కు, 4జీబీ వేరియంట్ ధర రూ.17,499కు అందుబాటులో ఉన్నాయి. వివో వై51ఎల్ 4జీ(రూ.2990 ధర తగ్గింపు) 11980 రూపాయలకు లాంచ్ అయిన వివో వై51ఎల్ 4జీ స్మార్ట్ ఫోన్ ధర కూడా 2990 రూపాయలు తగ్గి, 8990కు అందుబాటులో ఉంది. -
హెచ్‌టీసీ10 స్మార్ట్‌ఫోన్ ధర తగ్గింది..!
ముంబై: తైవాన్ కు చెందిన ప్రముఖ మొబైల్ మేకర్ హెచ్‌టీసీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ హెచ్‌టీసీ 10 ధర తగ్గించింది. పండుగ సీజన్ సందర్భంగా ఆ స్మార్ట్ ఫోన్ ధరను సుమారు 5వేలుతగ్గించినట్టు ప్రకటించింది. సాంసంగ్ గెలాక్సీ సిరీస్ గా పోటీగా ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ. 52,990 వద్ద లాంచ్ చేసింది. ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ అప్ డేట్ తో విడుదలై ఈ హెచ్‌టీసీ 10 ఈ ప్రత్యేక తగ్గింపు ఆఫర్ తో ప్రస్తుతం రూ.47,990లకే లభించనుంది. ఈ తగ్గింపు తక్షణమే అమల్లోకి వస్తుందని ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్‌టీసీ10 ఫీచర్లు 5.5 అంగుళాల క్యూహెచ్డీ డిస్ ప్లే 1440x2560 పిక్సెల్స్ రిజల్యూషన్, 4జీబీ రామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 చిప్ సెట్ 128 జీబీ ఇంర్ననల్ స్టోరేజ్ 12 ఎంపీ రియర్ కెమెరా, విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఆల్ట్రాఫిక్స్లల్ కెమెరా 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా. 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ పవర్ బటన్ తో పాటు సౌండ్స్ పెంచే వాల్యుమ్ రాకర్స్ కుడివైపు అమర్చడంతోపాటూ, చాంఫర్ అంచులతో, హెచ్ టీసీ లోగోను కెమెరా బంప్ తో హెచ్ టీసీ బూమ్ సౌండ్ టెక్నాలజీని సొంతమైన ఈ హై ఎండ్ మోడల్ ఫోన్ ను ఈ ఏడాది ఏప్రిల్ లో గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్స్ లో లాంచ్ చేసింది. అలాగే రూ.15,990గా రేంజ్ లో 'హెచ్‌టీసీ డిజైర్ 10 లైఫ్‌స్టైల్ ' పేరుతో సెప్టెంబర్ లో మరో నయా ఫోన్ ను భారత మార్కెట్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
హెచ్‌టీసీ కన్ఫాం చేసింది
న్యూఢిల్లీ: గూగుల్ ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ 7.0 నోగట్ తో హెచ్ టీసీ స్మార్ట్ ఫోన్ల తయారీకి రంగం సిద్ధమైంది. తమ అప్ కమింగ్ మోడ్సల్ ను గూగుల్ అండ్రాయిడ్ వెర్షన్ నోగట్ తో అప్ డేట్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది చివరికి ఆండ్రాయిడ్ 7.0 వెర్షన్ తో అప్ డేట్ చేస్తామని ట్టిట్టర్ ద్వారా తెలిపింది. ఈ అప్ డేట్ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పింది ఈ ఏడాది ఫోర్త్ క్వార్టర్ లో హెచ్ టీసీ10ను నౌగట్ వెర్షన్ తో అప్ డేట్ చేసే మొదటి స్మార్ట్ ఫోన్ కానుంది. .వన్ ఎం 9, వన్ ఎ 9 డివైజ్ లను నౌగట్ తో లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. అయితే ఈ ఏడాది చివరికా, లేక 2017 ఫస్ట్ క్వార్టర్ లోనా అనేది స్పష్టంగా పేర్కొనలేదు. కాగా గూగుల్ నెక్సస్ స్మార్ట్ ఫోన్ల తయారీలో హెచ్‌టీసీ భాగస్వామ్య వార్తలను ఇటీవల హెచ్‌టీసీ ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ 7.0 నోగట్ తో పనిచేసేలా రెండు కొత్త నెక్సస్ స్మార్ట్ ఫోన్లను తయారీచేస్తున్నామని హెచ్ టీసీ రిపోర్టు చేసింది. We’re excited to receive final shipping Android 7.0 Nougat software from Google! pic.twitter.com/BNbQBpgddK — HTC (@htc) August 24, 2016 -
హెచ్‌టీసీ 10 లాంచింగ్ నేడే
హెచ్ టీసీ 10 స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లో గురువారం లాంచ్ కానుంది. మెరుగైన హెచ్ టీసీ సెన్స్ 8 స్కిన్ , ఆండ్రాయిడ్ 6 వెర్షన్ లో వస్తున్న సరికొత్త స్మార్ట్ ఫోన్ ఈ రోజు మన ముందుకు రాబోతోంది. ఇప్పటికే మార్కెట్లోకి లీకైన సంచలనంగా మారి, ఇపుడు విడుదల కాబోతున్న హెచ్ టీసీ 10 ఫీచర్స్ లో బూమ్ సౌండ్ టెక్నాలజీ ఆసక్తికరంగా మారింది. స్పెసిఫికేషన్స్ 5.2 అంగుళాల 2కె డిస్ ప్లే 820 క్వాల్కం స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ 1440x2560 ఫిక్సల్స్ 4జీబీ రామ్ . 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. 12 మెగాఫిక్సెల్, అల్ట్రా మెగా ఫిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 5 మెగాఫిక్సె ల్ ఫ్రంట్ కెమెరా 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ టైప్ సీ యూఎస్బీ పోర్టు దీని ప్రత్యేకతగా నిలుస్తోంది. ఛార్జింగ్ ను, డేటా ఎక్సేంజ్ మార్పిడి లాంటి కొత్త ఫీచర్లతోపాటు ఫింగర్ ప్రింట్ స్కానర్ దీనిలో ఉంది. అటు అరగంటలో అతి త్వరగా దాదాపుసగం చార్జ్ పూర్తవుతుందని, 27 గంటలు పాటు నిలుస్తుందని కంపెనీ చెబుతోంది. అయితే దీని ధర అమెరికాలో సుమారు రూ.46,400లు మరి భారత మార్కెట్లో దీనిఎంతకు నిర్ణయిస్తుందని అనేది మాత్రం సస్సెన్స్. కాగా ఈ ఫ్లాగ్ షిప్ ఫోన్ కు సంబంధించి గతంలో వీడియో, ఫోటోలు లీకవ్వడంతో దీనిపై టెక్ ప్రియుల్లో ఉన్న ఆసక్తి నెలకొంది. -
హెచ్ టీసీ '10' ప్రత్యేకతలు
హెచ్ టీసీ 10 స్మార్ట్ ఫోన్ ఈరోజు(మంగళవారం) సాయంత్రం మన ముందుకు రాబోతుంది. ఆన్ లైన్ ఈవెంట్ గా ఈ ఫోన్ ఆవిష్కరణ చేయాలని కంపెనీ భావిస్తోంది. ఆన్ లైన్ ఈ ఫోన్ ఆవిష్కరణ తర్వాత ఏప్రిల్ 12 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని కంపెనీ వర్గాల చెబుతున్నాయి. ఈ ఫోన్ ఆవిష్కరణకు ముందే హెచ్ టీసీ 10 ఫీచర్స్ తెలుపుతూ 50 సెకండ్ల వీడియో, ఫోటోలు లీకయ్యాయి. ఈ లీక్ లు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేశాయి. అయితే మార్కెట్లోకి విడుదల కాబోతున్న హెచ్ టీసీ 10 ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 1. గతేడాది విడుదలైన ఏ9ను పోలిన విధంగా మొత్తం మెటల్ డిజైన్ తో హెచ్ టీసీ 10 రూపొందింది. చాంఫర్ అంచులతో, హెచ్ టీసీ లోగోను కెమెరా బంప్ కలిగిఉంది. 2. పవర్ బటన్ తో పాటు సౌండ్స్ పెంచే వాల్యుమ్ రాకర్స్ కుడివైపు ఉన్నాయి. 3. 5.5 అంగుళాల క్యూహెచ్డీ డిస్ ప్లే కలిగి ఉన్న హెచ్ టీసీ 10 ఫోన్ 1440x2560 ఫిక్సల్స్ ను ఆఫర్ చేస్తుంది. 4. ఈ ఫ్లాగ్ షిప్, 4జీబీ రామ్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 820 చిప్ సెట్ ను కలిగి ఉంది. ఇంటర్ నల్ స్టోరేజ్ 128 జీబీ వరకూ ఉంటుంది. 5. హెచ్ టీసీ బూమ్ సౌండ్ టెక్నాలజీని ఇది కలిగి ఉంది. 6. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 12 మెగాఫిక్సల్, ఆల్ట్రాఫిక్స్లల్ కెమెరా ఈ ఫోన్ కు ఉంది. డ్యూయల్ టోన్ ఫ్లాస్ ఈ కెమెరా ఉండబోతుందని తెలుస్తోంది. ఫ్రంట్ కెమెరా కూడా 5 మెగాఫిక్సల్ ఉందని సమాచారం. 7. 3,000 ఎమ్ఏహెచ్ పవర్ ఫుల్ బ్యాటరీ సామర్థ్యాన్ని ఈ ఫోన్ కలిగి ఉంది. 8. ఛార్జింగ్ ను, డేటా ఎక్సేంజ్ మార్పిడి వంటివి దీనిలో కొత్త ఫీచర్లు 9. ఈ ఫోన్ ను మెరుగైన హెచ్ టీసీ సెన్స్ 8 స్కిన్ తో రూపొందించారు. 10. గోల్డ్, సిల్వర్, బ్లాక్ కలర్స్ లో హెచ్ టీసీ10 వినియోగదారుల ముందుకు రాబోతుంది.