ఇటీవల ధర తగ్గిన స్మార్ట్ఫోన్లివే! | 8 Android smartphones that got price cuts recently | Sakshi
Sakshi News home page

ఇటీవల ధర తగ్గిన స్మార్ట్ఫోన్లివే!

Published Mon, Apr 17 2017 10:45 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

ఇటీవల ధర తగ్గిన స్మార్ట్ఫోన్లివే! - Sakshi

ఇటీవల ధర తగ్గిన స్మార్ట్ఫోన్లివే!

ఓ కొత్త స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. చాలామంది కొత్త కొత్త ఫోన్లు ఏం మార్కెట్లోకి వస్తున్నాయి? ఫీచర్లేమున్నాయి, ఏ ఫోన్పై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? ధర తగ్గించే ప్లాన్స్ ఏమన్న ఉన్నాయా? అని తెగ సెర్చ్ చేస్తుంటారు. స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా అదరగొట్టే ఫీచర్లతో, బడ్జెట్ ధరలతో మార్కెట్లోకి వస్తున్నాయి. ఇటీవలే కొన్ని కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లపై రేట్లను కూడా తగ్గించేశాయి. ఇటీవల రేట్లు తగ్గించిన స్మార్ట్ ఫోన్ కంపెనీలేమిటి? ప్రస్తుతం ఆ స్మార్ట్ ఫోన్లు ఎంతధరకు మార్కెట్లో లభిస్తున్నాయో ఓసారి చూద్దాం...
 
హెచ్టీసీ యూ ఆల్ట్రా(రూ.7000 తగ్గింపు)
లాంచ్ అయిన నెలల్లోపే తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధరను హెచ్టీసీ తగ్గించేసింది. ఐఫోన్ 7 కంటే మించిన ధరల్లో గత నెల హెచ్టీసీ యు ఆల్ట్రా స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. లాంచింగ్ సమయంలో 59,990గా దీని ధరను, కేవలం ఒకే ఒక్క నెలల్లోనే  7వేల రూపాయలు తగ్గించేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ 52,990లకే అందుబాటులో ఉంది.
 
సోని ఎక్స్పీరియా ఎక్స్జెడ్(రూ.10వేలు తగ్గింపు)
సోని ఇటీవలే తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ డివైజ్ ఎక్స్పీరియా ఎక్స్జెడ్ ధరను భారీగా తగ్గించింది. లాంచింగ్ సమయంలో రూ.51,990గా ఉన్న ఈ స్మార్ట్ఫోన్ను ప్రస్తుతం 41వేల రూపాయలకే అందుబాటులో ఉంచింది. అంటే 10వేల రూపాయల తగ్గించేసిందన్నమాట.   
 
హెచ్టీసీ 10( రూ.10వేలు తగ్గింపు)
హెచ్టీసీ మరో స్మార్ట్ ఫోన్పై 10వేల రూపాయల ధర తగ్గించింది. 52,990 రూపాయలకు అందుబాటులో ఉన్న హెచ్టీసీ 10ను 10వేల రూపాయలు తగ్గించి, 42,990 రూపాయలకు అందుబాటులోకి తెచ్చింది.  
 
శాంసంగ్ ఏ9 ప్రొ(రూ.2590 తగ్గింపు)
శాంసంగ్ కూడా గతేడాది సెప్టెంబర్ లో తీసుకొచ్చిన ఏ9 ప్రొపై ధరను కొంతమేర తగ్గించింది. రూ.32,490కు లాంచ్ చేసిన ఫోన్ ధరను రూ.2590 తగ్గిస్తూ 29,900 రూపాయలకు అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. ఈ ఫోన్ స్పెషల్ అట్రాక్షన్ 5000 ఏంఏహెచ్ బ్యాటరీ. 
 
మోటో జీ4 ప్లస్(16జీబీ వేరియంట్ పై 2000 ధర తగ్గింపు)
అతిపెద్ద స్ట్రీన్ వేరియంట్ మోటో జీ4 ప్లస్ తన రెండు స్టోరేజ్ వేరియంట్లపై ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 2000 రూపాయల మేర ధర తగ్గించి ఆ ఫోన్ 16జీబీ వేరియంట్ ను 11, 999కే అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. ఈ వేరియంట్ అసలు ధర 13,999 రూపాయలు. 32జీబీ వెర్షన్ పై కూడా 1000 కట్ చేసి, 13,999కే అందుబాటులోకి తెచ్చింది. అలాగే మోటో జీ4 ధర కూడా రెండు వేల రూపాయల తగ్గి, 10,499కు వినియోగదారుల ముందుకొచ్చింది. 
 
లెనోవో జెడ్2 ప్లస్(రూ.3000 ధర తగ్గింపు)
లెనోవో ఈ స్మార్ట్ఫోన్ను 2016 సెప్టెంబర్ లో లాంచ్ చేసింది. 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్ ధరను కంపెనీ 3000 రూపాయల మేర తగ్గించింది. 3జీబీ వేరియంట్ పై 3000రూపాయలు, 4జీబీ వేరియంట్ పై 2500 రూపాయలు ధర కోత పెడుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 3జీబీ వేరియంట్ ధర రూ.14,999కు, 4జీబీ వేరియంట్ ధర రూ.17,499కు అందుబాటులో ఉన్నాయి. 
 
వివో వై51ఎల్ 4జీ(రూ.2990 ధర తగ్గింపు)
11980 రూపాయలకు లాంచ్ అయిన వివో వై51ఎల్ 4జీ స్మార్ట్ ఫోన్ ధర కూడా 2990 రూపాయలు తగ్గి, 8990కు అందుబాటులో ఉంది.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement