HTC U Ultra
-
హెచ్‌టీసీ భారీ డిస్కౌంట్... ఈ ఒక్కరోజే..!
ప్రముఖ మొబైల్ మేకర్ హెచ్‌టీసీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్‌ఫోన్ ధరను భారీగా తగ్గించింది. ధంతేరస్ కానుకగా వినియోగదారులకు ఈ బంపర్ ఆఫర్ అందిస్తోంది. హెచ్‌టీసీ యూ అల్ట్రా స్మార్ట్‌ఫోన్ ధరపై ఏకంగా రూ. 22,991ల డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ ధంతేరస్ రోజు (అక్టోబర్ 17) మాత్రమే అందుబాటులోఉంటుంది. గత ఏడాది మార్చిలో విడుదలైన ఈ ఫోన్ అసలు ధర రూ.52,990 ఉండగా, రూ.22,991 తగ్గింపుతో ప్రస్తుతం రూ.29,999 ధరకు లభిస్తోంది. కొనుగోలుదారులకు పరిమిత కాలం ఆఫర్‌గా ఈ ఆఫర్ ఇవాళ ఒక్క రోజే ఉంటుందని హెచ్‌టీసీ వెల్లడించింది. దీపావళి సందర్భంగా ఈ భారీ ఆఫర్‌ను అందిస్తున్నట్టు తెలిపింది. హెచ్‌టీసీ యూ అల్ట్రా ఫీచర్లు 5.7 ఇంచ్ క్వాడ్ హెచ్డీ సూపర్ ఎల్సీడీ డిస్ప్లే 1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 2 ఇంచ్ సెకండరీ డిస్ప్లే 1040 x 160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12 అల్ట్రా పిక్సెల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఇటీవల ధర తగ్గిన స్మార్ట్ఫోన్లివే!
ఓ కొత్త స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. చాలామంది కొత్త కొత్త ఫోన్లు ఏం మార్కెట్లోకి వస్తున్నాయి? ఫీచర్లేమున్నాయి, ఏ ఫోన్‌పై ఎంత డిస్కౌంట్ ఇస్తున్నారు? ధర తగ్గించే ప్లాన్స్ ఏమన్న ఉన్నాయా? అని తెగ సెర్చ్ చేస్తుంటారు. స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం వినియోగదారులకు అభిరుచులకు అనుగుణంగా అదరగొట్టే ఫీచర్లతో, బడ్జెట్ ధరలతో మార్కెట్లోకి వస్తున్నాయి. ఇటీవలే కొన్ని కంపెనీలు తమ స్మార్ట్ ఫోన్లపై రేట్లను కూడా తగ్గించేశాయి. ఇటీవల రేట్లు తగ్గించిన స్మార్ట్ ఫోన్ కంపెనీలేమిటి? ప్రస్తుతం ఆ స్మార్ట్ ఫోన్లు ఎంతధరకు మార్కెట్లో లభిస్తున్నాయో ఓసారి చూద్దాం... హెచ్‌టీసీ యూ ఆల్ట్రా(రూ.7000 తగ్గింపు) లాంచ్ అయిన నెలల్లోపే తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధరను హెచ్‌టీసీ తగ్గించేసింది. ఐఫోన్ 7 కంటే మించిన ధరల్లో గత నెల హెచ్‌టీసీ యు ఆల్ట్రా స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. లాంచింగ్ సమయంలో 59,990గా దీని ధరను, కేవలం ఒకే ఒక్క నెలల్లోనే 7వేల రూపాయలు తగ్గించేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ 52,990లకే అందుబాటులో ఉంది. సోని ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్(రూ.10వేలు తగ్గింపు) సోని ఇటీవలే తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ డివైజ్ ఎక్స్‌పీరియా ఎక్స్జెడ్ ధరను భారీగా తగ్గించింది. లాంచింగ్ సమయంలో రూ.51,990గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రస్తుతం 41వేల రూపాయలకే అందుబాటులో ఉంచింది. అంటే 10వేల రూపాయల తగ్గించేసిందన్నమాట. హెచ్‌టీసీ 10( రూ.10వేలు తగ్గింపు) హెచ్‌టీసీ మరో స్మార్ట్ ఫోన్‌పై 10వేల రూపాయల ధర తగ్గించింది. 52,990 రూపాయలకు అందుబాటులో ఉన్న హెచ్‌టీసీ 10ను 10వేల రూపాయలు తగ్గించి, 42,990 రూపాయలకు అందుబాటులోకి తెచ్చింది. శాంసంగ్ ఏ9 ప్రొ(రూ.2590 తగ్గింపు) శాంసంగ్ కూడా గతేడాది సెప్టెంబర్ లో తీసుకొచ్చిన ఏ9 ప్రొపై ధరను కొంతమేర తగ్గించింది. రూ.32,490కు లాంచ్ చేసిన ఫోన్ ధరను రూ.2590 తగ్గిస్తూ 29,900 రూపాయలకు అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. ఈ ఫోన్ స్పెషల్ అట్రాక్షన్ 5000 ఏంఏహెచ్ బ్యాటరీ. మోటో జీ4 ప్లస్(16జీబీ వేరియంట్ పై 2000 ధర తగ్గింపు) అతిపెద్ద స్ట్రీన్ వేరియంట్ మోటో జీ4 ప్లస్ తన రెండు స్టోరేజ్ వేరియంట్లపై ధరను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 2000 రూపాయల మేర ధర తగ్గించి ఆ ఫోన్ 16జీబీ వేరియంట్ ను 11, 999కే అందుబాటులో ఉంచుతున్నట్టు పేర్కొంది. ఈ వేరియంట్ అసలు ధర 13,999 రూపాయలు. 32జీబీ వెర్షన్ పై కూడా 1000 కట్ చేసి, 13,999కే అందుబాటులోకి తెచ్చింది. అలాగే మోటో జీ4 ధర కూడా రెండు వేల రూపాయల తగ్గి, 10,499కు వినియోగదారుల ముందుకొచ్చింది. లెనోవో జెడ్2 ప్లస్(రూ.3000 ధర తగ్గింపు) లెనోవో ఈ స్మార్ట్‌ఫోన్‌ను 2016 సెప్టెంబర్ లో లాంచ్ చేసింది. 3జీబీ ర్యామ్, 4జీబీ ర్యామ్ వేరియంట్లలో విడుదలైన ఈ ఫోన్ ధరను కంపెనీ 3000 రూపాయల మేర తగ్గించింది. 3జీబీ వేరియంట్ పై 3000రూపాయలు, 4జీబీ వేరియంట్ పై 2500 రూపాయలు ధర కోత పెడుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం 3జీబీ వేరియంట్ ధర రూ.14,999కు, 4జీబీ వేరియంట్ ధర రూ.17,499కు అందుబాటులో ఉన్నాయి. వివో వై51ఎల్ 4జీ(రూ.2990 ధర తగ్గింపు) 11980 రూపాయలకు లాంచ్ అయిన వివో వై51ఎల్ 4జీ స్మార్ట్ ఫోన్ ధర కూడా 2990 రూపాయలు తగ్గి, 8990కు అందుబాటులో ఉంది. -
హెచ్‌టీసీ ఫోన్‌పై 7 వేలు ధర తగ్గింపు
న్యూఢిల్లీ : లాంచ్ అయిన నెలల్లోపే తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధరను హెచ్‌టీసీ తగ్గించేసింది. ఐఫోన్ 7 కంటే మించిన ధరల్లో గత నెల హెచ్‌టీసీ యు ఆల్ట్రా స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. లాంచింగ్ సమయంలో 59,990గా దీని ధరను, కేవలం ఒకే ఒక్క నెలల్లోనే 7వేల రూపాయలు తగ్గించేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ 52,990లకే అందుబాటులో ఉండనున్నట్టు తెలిపింది. అదేవిధంగా గతేడాది నవంబర్ లో తీసుకొచ్చిన మరో స్మార్ట్ ఫోన్ హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రొ ధరను కూడా తగ్గించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ పై 2500 ధరను తగ్గిస్తూ 23,990కే అందుబాటులో ఉంచుతున్నామని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్ ధర కూడా లాంచింగ్ సమయంలో 26,490గా ఉంది. ఈ రెండు డివైజ్ లు ప్రస్తుతం హెచ్‌టీసీ ఇండియా స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. కాగ హెచ్‌టీసీ యు ఆల్ట్రాలో ప్రత్యేక ఆకర్షణ దాని సెన్సు కంపానియన్ ఫీచర్. ఎంతో ముఖ్యమైన అలర్ట్ లను, నోటిఫికేషన్లు రెండో ''టిక్కర్ స్టైల్'' డిస్ ప్లేలో చూసుకునేందుకు ఇది ఉపయోగపడుతోంది. అంటే ఎల్జీ వీ20 మాదిరిగా ఈ ఫోన్ కు కూడా రెండు డిస్ ప్లేలు ఉంటాయన్నమాట. ఆండ్రాయిడ్ 7.0 నోగట్ తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 5.7 అంగుళాల క్యూహెచ్డీ సూపర్ ఎల్సీడీ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. దీనికి ఉండే రెండో డిస్ ప్లే 2 అంగుళాలు. క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 2టీబీ వరకు విస్తరణ మెమరీ, 12 ఆల్ట్రా పిక్సెల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4మైక్రోఫోన్లతో 3డీ ఆడియో రికార్డింగ్ సపోర్టు దీనిలో మిగతా ఫీచర్స్. ఇక హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రొ విషయానికి వస్తే, డ్యూయల్ సిమ్ సపోర్టు కలిగి ఉన్న ఈ ఫోన్ , ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో రన్ అవుతుంది. 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ మీడియా టెక్ హిలియో పీ10 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్, 2టీబీ వరకు విస్తరణ మెమరీ, 20ఎంపీ రియర్ కెమెరా, 13ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ,3000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను ఈ ఫోన్ కలిగి ఉంది. -
హెచ్‌టీసీ యూ అల్ట్రా విక్రయాలు ప్రారంభం
-
హెచ్‌టీసీ యూ అల్ట్రా విక్రయాలు ప్రారంభం
ధర రూ.59,990 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌టీసీ రూపొం దించిన యూ అల్ట్రా మోడల్ విక్రయాలు ప్రారంభం అయ్యాయి. మొబైల్స్ రిటైల్ విక్రయంలో ఉన్న టెక్నోవిజన్ సోమవారమిక్కడ ప్రత్యేక కార్యక్రమంలో హెచ్‌టీసీ ప్రతి నిధుల సమక్షంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 5.7 అంగుళాల క్యూహెచ్డీ సూపర్ ఎల్సీడీ డిస్‌ప్లేతోపాటు అలర్ట్స్, నోటిఫికేషన్లు చూపించేందుకు 2 అంగుళాల టిక్కర్ స్టైల్ సెకండరీ డిస్ప్లే దీని ప్రత్యేకత. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, గొరిల్లా గ్లాస్, 12 అల్ట్రా పిక్సెల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ దీనికి పొందుపరిచారు. ధర రూ.59,990 ఉంది. విస్తరణలో టెక్నోవిజన్.. టెక్నోవిజన్కు ప్రస్తుతం హైదరాబాద్‌లో 7 స్టోర్లు ఉన్నాయి. 2018 డిసెంబరుకల్లా మరో 13 ఔట్లెట్లు ప్రారంభిస్తామని కంపెనీ మేనేజింగ్ పార్టనర్ మొహమ్మద్ సికిందర్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘ధర విషయంలో ఆన్లైన్ కంపెనీల దూకుడుతో విస్తరణ ప్రణాళికను రెండేళ్లుగా వాయిదా వేశాం. ఇప్పుడు ఆన్లైన్లోనే ధరలెక్కువగా ఉన్నాయి. రిటైల్ దుకాణాలకు కస్టమర్ల రాక గణనీయంగా పెరిగింది. 4జీ రాకతో బేసిక్ ఫోన్ వినియోగదార్లు ఇప్పుడు స్మార్ట్ఫోన్ల వైపుకు మళ్లుతున్నారు. రానున్న రోజుల్లో ఈ రంగంలో అనూహ్య మార్పులుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇతర నగరాలకూ విస్తరిస్తాం’ అని వివరించారు. -
స్పెషల్ అట్రాక్షన్ తో హెచ్‌టీసీ కొత్త ఫోన్
తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హెచ్‌టీసీ నేడు తన కొత్త స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కెట్ ముందుకు తీసుకురాబోతుంది. న్యూఢిల్లీ వేదికగా హెచ్‌టీసీ యూ అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ను మధ్యాహ్నం 3.30కు లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ లాంచ్ ఈవెంట్‌ను ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా గత నెలే ఈ ఫోన్ ను హెచ్ టీసీ విడుదల చేసింది. ఎల్జీ వీ20 మాదిరి రెండో డిస్ ప్లే కలిగి ఉండటం ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణ. అంతర్జాతీయంగా ఈ ఫోన్ ధర 749 డాలర్లు( సుమారు రూ.51వేల వరకు) ఉంది. హెచ్‌టీసీ కొత్తగా 'యూ' లైన్లో తీసుకొచ్చే స్మార్ట్ ఫోన్లకు డిజైన్, మల్టిమీడియా, ఏఐ సామర్థ్యంపై కంపెనీ ఎక్కువగా దృష్టిసారిస్తోంది. ప్రస్తుతం విడుదల చేస్తున్న హెచ్‌టీసీ యూ అల్ట్రా కంపెనీ సొంత ఏఐ పర్సనల్ అసిస్టెంట్‌తో వస్తోంది. హెచ్‌టీసీ యూ అల్ట్రా ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం... 5.7 అంగుళాల క్యూహెచ్డీ సూపర్ ఎల్సీడీ డిస్ ప్లే, 1440 X 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ 1040x160 పిక్సెల్స్ రెజుల్యూషన్‌తో 2 అంగుళాల రెండో డిస్ ప్లే క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్ 4జీబీ ర్యామ్ 64జీబీ, 128 జీబీ వేరియంట్లు 2టీబీ వరకు విస్తరణ 12 అల్ట్రాపిక్సెల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ