హెచ్‌టీసీ భారీ డిస్కౌంట్‌... ఈ ఒక్కరోజే..! | HTC U Ultra Price Slashed in India Thanks to Limited Period 'Dhanteras' Offer | Sakshi
Sakshi News home page

హెచ్‌టీసీ భారీ డిస్కౌంట్‌... ఈ ఒక్కరోజే..!

Published Tue, Oct 17 2017 3:27 PM | Last Updated on Tue, Oct 17 2017 3:31 PM

 HTC U Ultra Price Slashed in India Thanks to Limited Period 'Dhanteras' Offer

ప్రముఖ మొబైల్‌ మేకర్‌ హెచ్‌టీసీ  తన ఫ్లాగ్‌ షిప్‌ స్మార్ట్‌ఫోన్‌  ధరను భారీగా తగ్గించింది. ధంతేరస్‌  కానుకగా వినియోగదారులకు ఈ   బంపర్‌ ఆఫర్‌ అందిస్తోంది. హెచ్‌టీసీ యూ అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ ధరపై ఏకంగా రూ. 22,991ల  డిస్కౌంట్‌ అందిస్తోంది. అయితే ఈ ఆఫర్‌  ధంతేరస్‌  రోజు (అక్టోబర్‌ 17) మాత్రమే అందుబాటులోఉంటుంది.  గత ఏడాది మార్చిలో విడుదలైన ఈ ఫోన్ అసలు ధర రూ.52,990 ఉండగా, రూ.22,991 తగ్గింపుతో ప్రస్తుతం రూ.29,999 ధరకు లభిస్తోంది.  కొనుగోలుదారులకు పరిమిత కాలం ఆఫర్‌గా ఈ ఆఫర్ ఇవాళ ఒక్క రోజే ఉంటుందని హెచ్‌టీసీ వెల్లడించింది. దీపావళి సందర్భంగా ఈ భారీ ఆఫర్‌ను అందిస్తున్నట్టు  తెలిపింది.

హెచ్‌టీసీ యూ అల్ట్రా ఫీచర్లు
5.7 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ సూపర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
1440 x 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,
2 ఇంచ్ సెకండరీ డిస్‌ప్లే
1040 x 160 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
 క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 821 ప్రాసెసర్
 ఆండ్రాయిడ్ 7.0 నౌగట్
 4 జీబీ ర్యామ్
 64 జీబీ స్టోరేజ్
 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
12 అల్ట్రా పిక్సెల్‌ రియర్‌ కెమెరా
 16 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement