స్పెషల్ అట్రాక్షన్ తో హెచ్టీసీ కొత్త ఫోన్
Published Tue, Feb 21 2017 10:38 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హెచ్టీసీ నేడు తన కొత్త స్మార్ట్ఫోన్ ను భారత మార్కెట్ ముందుకు తీసుకురాబోతుంది. న్యూఢిల్లీ వేదికగా హెచ్టీసీ యూ అల్ట్రా స్మార్ట్ ఫోన్ను మధ్యాహ్నం 3.30కు లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ లాంచ్ ఈవెంట్ను ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా గత నెలే ఈ ఫోన్ ను హెచ్ టీసీ విడుదల చేసింది. ఎల్జీ వీ20 మాదిరి రెండో డిస్ ప్లే కలిగి ఉండటం ఈ ఫోన్కు ప్రత్యేక ఆకర్షణ. అంతర్జాతీయంగా ఈ ఫోన్ ధర 749 డాలర్లు( సుమారు రూ.51వేల వరకు) ఉంది. హెచ్టీసీ కొత్తగా 'యూ' లైన్లో తీసుకొచ్చే స్మార్ట్ ఫోన్లకు డిజైన్, మల్టిమీడియా, ఏఐ సామర్థ్యంపై కంపెనీ ఎక్కువగా దృష్టిసారిస్తోంది. ప్రస్తుతం విడుదల చేస్తున్న హెచ్టీసీ యూ అల్ట్రా కంపెనీ సొంత ఏఐ పర్సనల్ అసిస్టెంట్తో వస్తోంది.
హెచ్టీసీ యూ అల్ట్రా ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం...
5.7 అంగుళాల క్యూహెచ్డీ సూపర్ ఎల్సీడీ డిస్ ప్లే, 1440 X 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 7.0 నోగట్
1040x160 పిక్సెల్స్ రెజుల్యూషన్తో 2 అంగుళాల రెండో డిస్ ప్లే
క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్
4జీబీ ర్యామ్
64జీబీ, 128 జీబీ వేరియంట్లు
2టీబీ వరకు విస్తరణ
12 అల్ట్రాపిక్సెల్ రియర్ కెమెరా
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
Advertisement
Advertisement