HTC
-
భారత్‌కు మళ్లీ వస్తాం..!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో 135 కోట్లు దాటిన జనాభా. కోట్లాది మంది యువ కస్టమర్లు. ఉద్యోగులు, వ్యాపారులకు పెరుగుతున్న వ్యయం చేయదగ్గ ఆదాయం. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే వినియోగదార్లు.. ఇంకేముంది ఈ అంశాలే తయారీ, రిటైల్ కంపెనీలకు భారత మార్కెట్ బంగారు బాతుగా నిలుస్తోంది. ముఖ్యంగా టెలివిజన్, స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థలకైతే ఇండియా ప్రధాన మార్కెట్ కూడా. దీంతో భారత్ నుంచి వెనుదిరిగిన ఈ రంగ కంపెనీలు మళ్లీ రీ–ఎంట్రీ ఇస్తున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త ఫీచర్లతో రంగంలోకి దిగుతున్నాయి. కొన్ని బ్రాండ్లు అయితే ఏకంగా ప్రైస్ వార్‌కు తెరతీస్తున్నాయి కూడా. ఐవా: దేశీయ టెలివిజన్ మార్కెట్లో ఆగస్టు 1న రీ–ఎంట్రీ ఇచ్చిన ఈ సంస్థ ఏకంగా 75 అంగుళాల 4కే స్మార్ట్ టీవీతో దర్శనమిచ్చింది. వాయిస్ కమాండ్‌తో పనిచేసే ఆరు రకాల స్మార్ట్ టీవీలను ప్రవేశపెట్టింది. టీవీల ధరల శ్రేణి రూ.7,999తో మొదలుకుని రూ.1,99,000 వరకు ఉంది. వీటితోపాటు స్మార్ట్ హోం ఆడియో సిస్టమ్స్, వైర్లెస్ హెడ్‌ఫోన్స్, బ్లూటూత్ స్పీకర్స్, పర్సనల్ ఆడియో ఉత్పత్తులను సైతం అందుబాటులోకి తెచ్చింది. వినూత్న, ఆధునిక ఫీచర్లతో ప్రొడక్టులను అన్ని ధరల శ్రేణిలో తీసుకొస్తామని ఐవా ఇండియా ఎండీ మన్మిత్ చౌదరి తెలిపారు. రానున్న రోజుల్లో రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నట్టు వెల్లడించారు. నూబియా: టెక్నాలజీ కంపెనీ జెడ్‌టీఈ అనుబంధ బ్రాండ్ అయిన నూబియా తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. రెండేళ్ల క్రితం భారత్ నుంచి నిష్క్రమించిన ఈ బ్రాండ్ రెడ్ మేజిక్–3 పేరుతో గేమింగ్ ఫోన్ ప్రవేశపెట్టింది. 8/12 జీబీ ర్యామ్, 128/256 జీబీ ఇంటర్నల్ మెమరీ, 6.65 అంగుళాల డిస్ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, సోనీ సెన్సార్‌తో 48 ఎంపీ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరాను జోడించింది. ప్రపంచంలో తొలిసారిగా ఈ స్మార్ట్‌ఫోన్‌లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో ఇంటర్నల్ టర్బో ఫ్యాన్ పొందుపరిచారు. ఇక ఆల్ఫా పేరుతో అద్దిరిపోయే స్మార్ట్‌వాచ్‌తో ఎంట్రీ అదరగొట్టింది. ఫోల్డబుల్ ఫ్లెక్సిబుల్ డిస్ప్లే ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకత. హెచ్‌టీసీ: తైవాన్‌కు చెందిన ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ భారత్‌లో రెండవ ఇన్నింగ్స్‌కి సిద్ధమైంది. వైల్డ్‌ఫైర్ ఎక్స్ పేరుతో కొత్త మోడల్‌ను రెండు వేరియంట్లలో ఆవిష్కరించింది. వెనుకవైపు 12, 8, 5 ఎంపీ కెమెరాలు, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా పొందుపరిచింది. ధర 4 జీబీ ర్యామ్ రూ.12,999 కాగా, 3 జీబీ ర్యామ్ మోడల్ రూ.9,999 ఉంది. ఆగస్టు 22 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో లభిస్తుంది. రానున్న రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో వినూత్నమైన ఫీచర్లను పరిచయం చేయనున్నట్టు కంపెనీ వర్గాల సమాచారం. 2018లో కంపెనీ భారత్‌లో తన కార్యకలాపాలను నిలిపివేసింది. ప్రీమియం లుక్, నాణ్యమైన మోడళ్లతో కస్టమర్ల మది దోచిన ఈ బ్రాండ్‌కు ఇప్పటికీ మంచి ఇమేజ్ ఉంది. ఎల్జీ: డబ్ల్యూ సిరీస్‌తో భారత్‌లో రీఎంట్రీ ఇచ్చిన ఎల్జీ మొబైల్స్ ఈ ఏడాది మరో అయిదు కొత్త స్మార్ట్ఫోన్లను ప్రవేశపెట్టనుంది. డబ్ల్యూ సిరీస్‌తోపాటు విదేశాల్లో విక్రయిస్తున్న ‘జీ’, ‘క్యూ’ సిరీస్ మోడళ్లను పరిచయం చేయనుంది. ప్రస్తుతం సంస్థ ఖాతాలో అయిదు మోడళ్లున్నాయి. 2020 ఏడాది ద్వితీయార్ధానికి దేశవ్యాప్తంగా విస్తరిస్తామని ఎల్జీ మొబైల్స్ బిజినెస్ హెడ్ అద్వైత్ వైద్య సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఏడాది తర్వాత 5జీ స్మార్ట్‌ఫోన్ ‘వి–50’ని భారత్‌లో ఆవిష్కరించనుంది. 5జీలో నాయకత్వ స్థానాన్ని దక్కించుకోవాలన్నదే కంపెనీ లక్ష్యం. దక్షిణ కొరియా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఎల్జీ.. భారత్‌లో తొలిసారిగా డబ్ల్యూ సిరీస్ ద్వారా ఫోన్ల అభివృద్ధితో పాటు తయారీ కూడా చేపట్టింది. -
హెచ్‌టీసీ డిజైర్ కొత్త స్మార్ట్‌ఫోన్
హెచ్‌టీసీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. గత ఏడాది తీసుకొచ్చిన హెచ్‌టీసీ డిజైర్ 12కి కొనసాగింపుగా హెచ్‌టీసీ డిజైర్ 12ఎస్‌ను తైవాన్ మార్కెట్లో విడుదల చేసింది. రెండు వేరియంట్లలో అక్కడి మార్కెట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభ్యం కానుంది. 3జీబీ/32జీబీ వేర్షన్ ధర సుమారు రూ.13,900గాను, 4జీబీ/63జీఈ వేరియంట్ ధర సుమారు రూ. 16,240గా ఉండనుంది. భారత మార్కెట్లలో లభ్యతపై అధికారిక సమాచారం ఏదీ అందుబాటులో లేదు. హెచ్‌టీసీ డిజైర్ 12ఎస్ ఫీచర్లు 5.7 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 720x1440 పిక్సెల్స్ రిజల్యూషన్ 13ఎంపీ రియర్ కెమెరా 13ఎంపీ సెల్ఫీ కెమెరా 3075 ఎంఏహెచ్‌బ్యాటరీ -
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు హెచ్‌టీసీ గుడ్‌బై!?
కోల్‌కతా : చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీల తాకిడిని తట్టుకోలేక భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి ఓ ప్రముఖ కంపెనీ కనుమరుగు కాబోతుంది. తైవాన్‌కు చెందిన మొబైల్ తయారీ కంపెనీ హెచ్‌టీసీ భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. హెచ్‌టీసీ టాప్ మేనేజ్మెంట్ కంట్రీ హెడ్ సిద్ధిఖీ, సేల్స్ హెడ్ విజయ్ బాలచంద్రన్, ప్రొడక్ట్ హెడ్ ఆర్.నయ్యర్ ముగ్గురూ ఒకేసారి రాజీనామా చేసినట్టు తెలిసింది. వీరితోపాటు కంపెనీ చీఫ్ ఫైనాన్షియర్ అయిన రాజీవ్ దయాల్‌ను కూడా వెళ్లిపొమ్మని కంపెనీ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక మరో 70 నుంచి 80 మంది ఉద్యోగులకు కూడా కంపెనీ సెటిల్మెంట్ చేస్తుందని వెల్లడైంది. గత మూడు, నాలుగేళ్లుగా నష్టాల్లో ఉన్న కంపెనీని ఇక గట్టెక్కించలేమని నిర్ణయానికి వచ్చిన తర్వాత.. మొత్తం కంపెనీని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించిందట. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి సేల్స్ కూడా నిలిపివేస్తుందని తెలిసింది. అయితే భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఆన్లైన్ ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ ద్వారా రీ-ఎంట్రీ ఇవ్వాలని కూడా కంపెనీ యోచిస్తోందని ఓ ఎగ్జిక్యూటివ్ చెప్పారు. కానీ పూర్తిగా అమ్మకాలను నిలిపివేసిన తర్వాతే, ఆన్లైన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుందని తెలిపారు. అది కూడా తైవాన్ నుంచే ఆపరేట్ చేస్తుందని చెప్పారు. నాణ్యతకు మారుపేరుగా ఉన్న హెచ్‌టీసీ స్మార్ట్ఫోన్ల అమ్మకాలు ఇటీవల కాలంలో భారీగా తగ్గాయి. చైనా స్మార్ట్ఫోన్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేక హెచ్‌టీసీ అమ్మకాలు భారీగా పడిపోయాయి. చాలా మార్కెట్లలో హెచ్‌టీసీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ తయారీ యూనిట్లను మూసివేస్తూ వస్తోంది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు కూడా చేపట్టింది. ఇప్పుడు ఏకంగా భారత్‌లో అమ్మకాలనే బంద్ చేయాలని నిర్ణయించిందని తెలిసింది. అయితే హెచ్‌టీసీ భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను నిలిపివేయబోతుందని వస్తున్న వార్తలపై హెచ్‌టీసీ అధికార ప్రతినిధి స్పందించారు. భారత్‌లో స్మార్ట్‌ఫోన్ అమ్మకాలను కొనసాగిస్తామని చెప్పారు. హెచ్‌టీసీకి భారత్ చాలా ముఖ్యమైన మార్కెట్ అని అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తామన్నారు. తాజాగా భారత ఆఫీసులో చేపట్టిన వర్క్‌ఫోర్స్ తగ్గించడం లాంటి వాటితో, కంపెనీని మరింత సమర్థవంతంగా తీర్చుదిద్దుతామని, వృద్ధి, ఆవిష్కరణలో ఇదో కొత్త స్టేజ్ అని చెప్పారు. కాగ, గ్లోబల్‌గా హెచ్‌టీసీ విక్రయాలు ఏడాది ఏడాదికి 68 శాతం మేర తగ్గాయి. రెండున్నర ఏళ్లలో ఇదే భారీ పతనం. గ్లోబల్‌గా 1500 మేర వర్కర్లను తీసేయబోతున్నట్టు కంపెనీ ప్రకటన కూడా చేసింది. భారత్‌లో హెచ్‌టీసీకి కేవలం 1 శాతం కంటే తక్కువ మార్కెట్ షేరే ఉంది. శాంసంగ్,ఆపిల్, చైనా వన్‌ప్లస్, షావోమిలు భారత మార్కెట్లో అగ్రగామిగా ఉన్నాయి. -
హెచ్‌టీసీలో ఉద్యోగాల కోత!
తైపీ: తైవాన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ ‘హెచ్‌టీసీ’ తాజాగా ఉద్యోగులను ఇంటికి సాగనంపడానికి రెడీ అవుతోంది. 1,500 మందిని తీసివేస్తామని ప్రకటించింది. కంపెనీ భారీ నష్టాలు దీనికి ప్రధాన కారణం. గూగుల్‌తో కొత్త డీల్ నేపథ్యంలో ఉద్యోగాల కోత ప్రకటన వెలువడటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఒక వెలుగు వెలిగిన హెచ్‌టీసీ.. ప్రస్తుతం యాపిల్, శాంసంగ్ సహా హువావే వంటి ఇతర చైనా బ్రాండ్ల నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. ఇక ఉద్యోగాల తొలగింపు నిర్ణయం సెప్టెంబర్ చివరి నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ పేర్కొంది. -
మార్కెట్లోకి హెచ్‌టీసీ డిజైర్
హైదరాబాద్: తైవాన్‌కు చెందిన కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌టీసీ కొత్తగా మార్కెట్లోకి డిజైర్ 12, డిజైర్ 12 ప్లస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. వీటి ధరలు వరుసగా రూ.15,800, రూ.19,790గా ఉన్నాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతానికి హెచ్‌టీసీ ఈ–స్టోర్‌లోనే లభ్యమవుతాయని.. ఈనెల 11 నుంచి అన్ని రిటైల్ స్టోర్లలోను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొంది. 18:9 ఫుల్‌స్క్రీన్, రెండు కెమెరాలు ఈ ఫోన్లలో ఉన్నాయి. -
హెచ్‌టీసీ డిజైర్‌లో కొత్త స్మార్ట్ఫోన్లు
సాక్షి, ముంబై: తైవాన్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ హెచ్‌టీసీ బుధవారం రెండు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. డిజైర్ సిరీస్‌లో హెచ్‌టీసీ డిజైర్ 12, హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ డివైస్‌లను ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. హెచ్‌టీసీ డిజైర్ 12 ధరను 15,800 రూపాయలుగానూ, హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ ధరను 19,790గా ను నిర్ణయించింది. గురువారం నుంచి ప్రీ ఆర్డర్లను ప్రారంభించనుంది. జూన్ 11 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విక్రయాలు మొదలుకానున్నాయి. 18.9 యాస్పెక్ట్ రేషియో, ఎడ్జ్ టూఎడ్జ్ డిస్ప్లే తమ నూతన స్మార్ట్ఫోన్ల సొంతమనికంపెనీ చెబుతోంది. హెచ్‌టీసీ డిజైర్ 12 ప్లస్ ఫీచర్లు 6అంగుళాల హెచ్డీ + ఐపీఎస్ డిస్ప్లే క్వాల్కం స్నాప్ డ్రాగన 450 ఎస్వోసీ ప్రాసెసర్ 720x1440 రిజల్యూషన్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 13+2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 2965 ఎంఏహెచ్ బ్యాటరీ హెచ్‌టీసీ డిజైర్ 12 ఫీచర్లు 5.5 అంగుళాల హెచ్డీ + ఐపీఎస్ డిస్ప్లే 720x1440 రిజల్యూషన్ మీడియా టెక్ ఎంటీ 6739 క్వాడ్ కోర్ ప్రాసెసర్ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 2టీబీ దాకా విస్తరించుకునే అవకాశం 13ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 2,730 ఎంఏహెచ్ బ్యాటరీ -
హెచ్‌టీసీ యూ12ప్లస్ లీక్: మే 23న లాంచ్
సాక్షి,న్యూఢిల్లీ: తైవాన్ మొబైల్స్ తయారీదారు హెచ్‌టీసీ మరో ఆకర్షణీయమైన ఫోన్‌ను లాంచ్ చేయనుంది. హెచ్‌టీసీ యూ12 ప్లస్ పేరుతో ఒక స్మార్ట్‌ఫోన్ ను ఈ నెల 23వ తేదీన విడుదల చేయనుంది. ఈ ఏడాదిలో తొలి ఫ్లాగ్‌షిప స్మార్ట్‌ఫోన్‌గా చెబుతున్న యూ12 ప్లస్ రెండు వేరియంట్లలో అందుబాటులోకి రానుంది. 128 జీబీ వేరియంట్ సుమారు రూ.54, 000- 56,300 మధ్య లభ్యం కానుంది. అలాగే 64జీబీ వేరియంట్ ధర 49,500-51,800రూపాయల మధ్య ఉంటుందని అంచనా. హెచ్‌టీసీ యూ12 ప్లస్ ఫీచర్లు 6 అంగుళాల క్వాడ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 2880 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 845 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12+16ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరా 8+8 ఎంపీ డ్యుయల్ సెల్ఫీ కెమెరా 3420 ఎంఏహెచ్ బ్యాటరీ -
హెచ్‌టీసీ యు11ప్లస్ లాంచ్..ధర ఎంత?
సాక్షి, న్యూఢిల్లీ: తైవాన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హెచ్‌టీసీ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ డివైస్‌ను లాంచ్ చేసింది. హెచ్‌టీసీ యు 11ప్లస్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ టు ఎడ్జ్ టు డిస్ప్లే తో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. రేపటినుంచి (ఫిబ్రవరి 7) ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి ప్రత్యేకంగా లభ్యం కానుంది. ప్రస్తుతానికి సిల్వర్కలర్ వేరియంట్‌మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలోనే సెరామిక్ బ్లాక్ కలర్లో కూడా అందుబాటులోఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇక దీని ధర 56,990 రూపాయలుగా ఉండనుంది. 4జీబీ, 6జీబీ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది. హెచ్‌టీసీ యు 11ప్లస్ ఫీచర్లు 6 అంగుళాల క్వాడ్ హెచ్డీ సూపర్ ఎల్సీడీ డిస్ప్లే 1440x2880 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్ 6జీబీ /128జీబీ స్టోరేజ్ 12 ఎంపీ అల్ట్రా మెగా పిక్సెల్ కెమెరా విత్ ఆటో ఫోకస్ 8ఎంపీ సెల్పీ కెమెరా 3930 ఎంఏహెచ్ బ్యాటరీ Even More Squeezed Into A Slimmer, Stunning Phone. HTC U11 plus Launching tomorrow exclusively on FlipKart. #HTCU11plus pic.twitter.com/FhHnjNJtQ1 — HTC India (@HTC_IN) February 6, 2018 -
భారీ స్ర్కీన్, డ్యుయల్ సెల్ఫీ కెమెరా స్మార్ట్‌ఫోన్.. త్వరలో
ప్రముఖ మొబైల్ సంస్థ హెచ్‌టీసీ 2018 సంవత్సరంలో తొలి స్మార్ట్ఫోన్త్వరలోనే లాంచ్ చేయనుంది. తాజా నివేదికల ప్రకారంయ ఐ బ్రాండ్‌లో హెచ్‌టీసీ యు11ఐ పేరుతో జనవరి 15న విడదల చేయనుంది. అమెరికా మార్కెట్‌తో పాటు ఇతర మార్కెట్లలో కూడా ఒకేసారి ప్రవేశపెడుతుందా?లేదా అనేదానికి ఇంకా క్లారిటి లేదు. భారీ స్క్రీన్, డ్యుయల్ సెల్ఫీ కెమెరాలతో లాంచ్ చేయనున్న ఈ డివైస్‌ను మిడ్ సెగ్మెంట్ బడ్జెట్ ధరలోనే (రూ.32వేలు) కస్టమర్లకుఅందుబాటులో ఉంచనుందని తెలుస్తోంది. బ్లాక్, రెడ్, సిల్వర్ రంగుల్లో లభ్యం కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ఇతర ఫీచర్లపై అంచనాలు ఇలా ఉన్నాయి. హెచ్‌టీసీ యు11ఐ ఫీచర్లు 6 అంగుళాల ఫుల్హెచ్డీ డిస్ప్లే, సూపర్ ఎల్సీడీ3 1080 x 2160 పిక్సెల్ రిజల్యూషన్ స్నాప్ డ్రాగన్ 652 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ నౌగట్ 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా 3,930ఎంఏహెచ్ బ్యాటరీ HTC U11 EYEs (Harmony): 6" FHD+ (1080 x 2160) Super LCD3, SD652 octa core, 4GB/64GB (+microSD), USB-C, 3930mAh, IP67, Android Nougat, Edge Sense. Black, silver, and red. Launches 1/15. pic.twitter.com/Ng0ateH3XR — Evan Blass (@evleaks) January 12, 2018 -
గూగుల్‌కి చేతికి హెచ్‌టీసీ
డీల్ విలువ 1.1 బిలియన్ డాలర్లు తైపీ: తైవాన్‌కి చెందిన హ్యాండ్సెట్స్ తయారీ సంస్థ హెచ్‌టీసీ తమ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలో కొంత భాగాన్ని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌కి విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. మొబైల్ హ్యాండ్సెట్స్ హార్డ్వేర్పై పట్టు సాధించేందుకు గూగుల్‌కి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. ఒప్పందం ప్రకారం హెచ్‌టీసీ పరిశోధన సిబ్బందిలో దాదాపు సగం మందిని (సుమారు 2,000) గూగుల్ చేర్చుకుంటుంది. వచ్చే ఏడాది తొలినాళ్లలో ఈ డీల్ పూర్తి కాగలదని హెచ్‌టీసీ తెలిపింది. స్మార్ట్‌ఫోన్స్ తయారీపైనా, కొంగొత్త హార్డ్‌వేర్ వ్యాపార కార్యకలాపాల్లోనూ గూగుల్ మరింతగా దృష్టి పెడుతోందనడానికి ఇది నిదర్శనమని హెచ్‌టీసీ ప్రతినిధి పీటర్ షెన్ తెలిపారు. హెచ్‌టీసీ తమ సొంత బ్రాండ్‌పైనా స్మార్ట్ఫోన్లను అభివృద్ధి చేయడం, విక్రయించడం కొనసాగిస్తుందని పీటర్ పేర్కొన్నారు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ తయారీలో ఇరు సంస్థల మధ్య దశాబ్దంపైగా ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుం దని సంయుక్త ప్రకటనలో గూగుల్ తెలిపింది. -
గూగుల్ చేతికి హెచ్‌టీసీ?
శాన్ఫ్రాన్సిస్కో : సెర్చింజన్ దిగ్గజం గూగుల్, నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఓ ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీని తన సొంతం చేసుకోబోతుంది. తైవాన్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీదారి హెచ్‌టీసీ ఫోన్ వ్యాపారాలను గూగుల్ కొనుగోలు చేయబోతున్నట్టు రిపోర్టులు వస్తున్నాయి. చైనీస్ పబ్లికేషన్ కమర్షియల్ టైమ్స్ రిపోర్టు ప్రకారం, హెచ్‌టీసీతో డీల్ కుదుర్చుకోవడానికి గూగుల్ రెండు ఆప్షన్లను రూపొందించిందని తెలిసింది. వ్యూహాత్మక భాగస్వామిగా లేదా పూర్తిగా స్మార్ట్‌ఫోన్ యూనిట్‌ను కొనుగోలు రూపంలో హెచ్‌టీసీని సొంతం చేసుకోవాలని గూగుల్ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. ఈ డీల్‌లో హెచ్‌టీసీకి చెందిన వర్చ్యువల్ రియాల్టీ బిజినెస్(హెచ్‌టీసీ వైవ్)లు భాగం కావని రిపోర్టు పేర్కొంది. అమెరికాలో ఒకానొక సమయంలో ఎక్కువగా ప్రాచుర్యం సంపాదించుకున్న హెచ్‌టీసీ, ఇటీవల నష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పడికిప్పుడు కొత్త ఫ్లాగ్షిప్ డివైజ్‌లను తీసుకొచ్చినప్పటికీ హెచ్‌టీసీ కోలుకునేలా కనిపించడం లేదు. కాగ, గూగుల్ తన సొంత బ్రాండులో విడుదల చేసిన పిక్సెల్, పిక్సెల్ ఎక్స్ఎల్ డివైజ్‌లను హెచ్టీసీనే రూపొందించింది. ప్రస్తుతం విడుదల చేయబోయే డివైజ్‌లలో కూడా ఒకదాన్ని హెచ్టీసీనే రూపొందిస్తుందని తెలుస్తోంది. అయితే ఈ రిపోర్టుపై స్పందించడానికి ఇరు కంపెనీ తిరస్కరించాయి. ప్రపంచంలో అత్యధిక రేటింగ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ కెమెరాతో హెచ్‌టీసీ తన ప్రీమియం ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ హెచ్‌టీసీ యూ11ను జూలైలో విడుదల చేసింది. -
హెచ్‌టీసీ ‘యు–11’ @ రూ.51,990
తైవాన్‌కు చెందిన ప్రముఖ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ‘హెచ్‌టీసీ’ తాజాగా ‘యు–11’ అనే ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.51,990. ఆండ్రాయిడ్ 7.1 నుగోట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే యు–11 స్మార్ట్‌ఫోన్‌లో 5.5 అంగుళాల స్క్రీన్ వంటి పలు ప్రత్యేకతలున్నాయని కంపెనీ వివరించింది. ఈ స్మార్ట్‌ఫోన్స్ జూన్ చివరి వారం నుంచి ఆన్లైన్ చానళ్లతోపాటు రిటైల్ స్టోర్లలోనూ కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. -
హెచ్‌టీసీ యూ 11 లాంచ్..ధర ఎంతంటే..
న్యూఢిల్లీ: తైవాన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌టీసీ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆపిల్ ఐఫోన్లకు ధీటుగా ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న సంస్థ తాజాగా మరో డివైస్ ను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టింది. ఇప్పటికే తైవాన్‌లో లాంచ్ చేసిన తాజా ఫ్లాగ్షిప్ ఫోన్‌ను పహెచ్టీసి యు 11 పేరుతో శుక్రవారం న్యూఢిల్లీ విడుదల చేసింది. దీని రూ. 51,990గా నిర్ణయించింది. రేపటి నుంచి ప్రీ ఆర్డర్‌కు, జూన్ చివరి నుంచి కొనుగోలు కోసం ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అమేజింగ్ సిల్వర్, నీలమణి నీలం, బ్రిలియంట్ బ్లాక్, ఐస్ వైట్, సోలార్ రెడ్ ఐదు రంగుల్లో ఇది లభ్యంకానుంది. స్క్వీజబుల్ టచ్-సెన్సిటివ్ ఫ్రేమ్, ‘ఎడ్జ్ సెన్స్, 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి. హెచ్‌టీసీ యు 11 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే 2.4 గిగాహెడ్జ్ స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ నోగట్ 7.1ఆపరేటింగ్ సిస్టమ్ 2560 x 1440 రిజల్యూషన్ 6జీబీ ర్యామ్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 2 టీబీ ఎక్స్‌పాండబుల్ ఇంటర్నల్ మొమరీ 12 ఎంపీ రియర్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ ధరపై భారీ తగ్గింపు
ప్రముఖ మొబైల్ సంస్థ హెచ్‌టీసీ తన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ధరను భారీగా తగ్గించింది. 'హెచ్‌టీసీ యూ ప్లే' స్మార్ట్‌ఫోన్ ధరపై భారత్ లో రూ. 10వేల తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఈ తగ్గింపు తర్వాత హెచ్‌టీసీ యూ ప్లే ఇప్పుడు రూ.29,990 ధరకే యూజర్లకు లభించనుంది. వైట్, ఇండిగో బ్లూ, బ్లాక్ ఆయిల్ , కాస్మిక్ పింక్ గోల్డ్ రంగులలో లభిస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ ను ప్రత్యేకంగా అమెజాన్‌లో అందుబాటులో ఉంచింది. కాగా ఫిబ్రవరి లాంచ్ చేసిన ఈ ఫోన్ లాంచింగ్ ధర రూ.39,990లు. హెచ్‌టీసీ యూ ప్లే ఫీచర్లు 5.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో 16 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4జీ ఎల్టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ 2500 ఎంఏహెచ్ బ్యాటరీ -
సరికొత్త ఫీచర్‌తో ‘హెచ్‌టీసీ యూ’
తైవాన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌టీసీ మరికొత్త స్మార్ట్‌ఫోన్ తీసుకురాబోతోంది. ఐఫోన్ 7ను మించి ఆకట్టుకుంటున్న హెచ్‌టీసీ హెచ్‌టీసీ యు పేరుతో మరో డివైస్ ను మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. స్క్వీజ్ ఫర్ ద బ్రిలియంట్ యూ అనే ట్యాగ్ లైన్తోమే 16 వ తేదీన లాంచ్ చేయనుంది. హెచ్‌టీసీ యూని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు హెచ్‌టీసీ ప్రకటించింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో స్క్వీజ్ ఫర్ ద బ్రిలియంట్ యూ అని ట్వీట్ చేసింది. ధర, ఇతర ఫీచర్లను మాత్రం వెల్లడించలేదు. అయితే హెచ్‌టీసీ యు ని స్క్వీజబుల్ టచ్-సెన్సిటివ్ ఫ్రేమ్ తో రూపొందించారట. సరికొత్తగా జోడించిన ‘ఎడ్జ్ సెన్స్' ఫీచర్ ప్రధాన ఆకర్షణ గా నిలవనుందని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి. మరోవైపు ఇటీవల హెచ్‌టీసీ యు ఆల్ట్రా పేరుతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్టు కంపెనీ ఈ నెలలో ప్రకటించింది. దీని ధరను రూ. 59,990గా ప్రకటించిన సంగతి తెలిసిందే. హెచ్‌టీసీ యు 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ నోగట్ 7.1ఆపరేటింగ్ సిస్టమ్ 2560 x 1440 రిజల్యూషన్ 4జీబీ ర్యామ్ 64 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్ 12 ఎంపీరియర్ కెమెరా, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ Squeeze for the Brilliant U. 05.16.2017 https://t.co/89OuHXbBlt pic.twitter.com/jLaeFD2wMW — HTC (@htc) April 20, 2017 -
స్పెషల్ అట్రాక్షన్ తో హెచ్‌టీసీ కొత్త ఫోన్
తైవాన్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం హెచ్‌టీసీ నేడు తన కొత్త స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కెట్ ముందుకు తీసుకురాబోతుంది. న్యూఢిల్లీ వేదికగా హెచ్‌టీసీ యూ అల్ట్రా స్మార్ట్ ఫోన్‌ను మధ్యాహ్నం 3.30కు లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఈ లాంచ్ ఈవెంట్‌ను ఫేస్బుక్లో లైవ్ స్ట్రీమ్ చేయనున్నట్టు పేర్కొంది. అంతర్జాతీయంగా గత నెలే ఈ ఫోన్ ను హెచ్ టీసీ విడుదల చేసింది. ఎల్జీ వీ20 మాదిరి రెండో డిస్ ప్లే కలిగి ఉండటం ఈ ఫోన్‌కు ప్రత్యేక ఆకర్షణ. అంతర్జాతీయంగా ఈ ఫోన్ ధర 749 డాలర్లు( సుమారు రూ.51వేల వరకు) ఉంది. హెచ్‌టీసీ కొత్తగా 'యూ' లైన్లో తీసుకొచ్చే స్మార్ట్ ఫోన్లకు డిజైన్, మల్టిమీడియా, ఏఐ సామర్థ్యంపై కంపెనీ ఎక్కువగా దృష్టిసారిస్తోంది. ప్రస్తుతం విడుదల చేస్తున్న హెచ్‌టీసీ యూ అల్ట్రా కంపెనీ సొంత ఏఐ పర్సనల్ అసిస్టెంట్‌తో వస్తోంది. హెచ్‌టీసీ యూ అల్ట్రా ఫీచర్లు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం... 5.7 అంగుళాల క్యూహెచ్డీ సూపర్ ఎల్సీడీ డిస్ ప్లే, 1440 X 2560 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 7.0 నోగట్ 1040x160 పిక్సెల్స్ రెజుల్యూషన్‌తో 2 అంగుళాల రెండో డిస్ ప్లే క్వాడ్-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్ 4జీబీ ర్యామ్ 64జీబీ, 128 జీబీ వేరియంట్లు 2టీబీ వరకు విస్తరణ 12 అల్ట్రాపిక్సెల్ రియర్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
హెచ్‌టీసీ నుంచి రెండు డిజైర్ ఫోన్లు వచ్చేశాయ్!
హెచ్‌టీసీ 10 ఏళ్ల వార్షికోత్సవ సెలబ్రేషన్లో భాగంగా మరో రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లను భారత్ మార్కెట్లోకిలో లాంచ్ చేసింది. హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో, హెచ్‌టీసీ డిజైర్ 10 ఎవో పేర్లతో ఈ ఫోన్లను గురువారం వినియోగదారులు ముందుకు తీసుకొచ్చింది. హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో ధర రూ.26,490గా కంపెనీ పేర్కొంది. హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో డిసెంబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ అవుట్‌లెట్స్‌లో అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. అయితే డిజైర్ 10 ఎవో ధర, ఎప్పటినుంచి అందుబాటులో ఉంటుందో మాత్రం కంపెనీ తెలుపలేదు. న్యూఢిల్లీ ఈవెంట్‌గా ఈ ఫోన్లను హెచ్‌టీసీ ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫోన్లు మొత్తం మెటల్ బాడీతో డిజైన్ చేసి, వాటర్, డస్ట్ రెసిస్టెంట్ పవర్‌ను కలిగిఉన్నాయి. హెచ్‌టీసీ డిజైర్ 10 ప్రో ఫోన్ ఫీచర్లు... 5.5 అంగుళాల డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 20 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 4జీబీ ర్యామ్ 64జీబీ స్టోరేజ్ మైక్రోఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు విస్తరణ ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ హెచ్‌టీసీ 10 ఎవో స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు... 5.5 అంగుళాల క్వాడ్-హెచ్డీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 810 ఆక్టా-కోర్ ప్రాసెసర్ 3జీబీ ర్యామ్ 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 2టీబీ వరకు విస్తరణ 16ఎంపీ రియర్ కెమెరా 8ఎంపీ ఫ్రంట్ కెమెరా ఆండ్రాయిడ్ 7 ఆపరేటింగ్ సిస్టమ్ 3200 ఎంఏహెచ్ బ్యాటరీ -
హెచ్‌టీసీ మరో కొత్త ఫోన్ విడుదల
న్యూఢిల్లీ: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ హెచ్‌టీసీ భారత మార్కెట్లో తన జోరును కొనసాగిస్తోంది. ఇటీవలే 10 ప్రోను లాంచ్ చేసిన కంపెనీ తాజాగా మరో కొత్త స్మార్ట ఫోన్‌ను లాంచ్ చేసింది.'హెచ్‌టీసీ డిజైర్ 10 లైఫ్‌స్టైల్ ' పేరుతో భారత మార్కెట్లో విడుదల చేసిన ఈ ఫోన్ ధరను రూ.15,990గా కంపెనీ నిర్ణయించింది. ప్రత్యేకంగా అమెజాన్ ఇండియా, హెచ్‌టీసీకి చెందిన ఈ-స్టోర్ ద్వారా అందుబాటులో ఉంచినట్టు పేర్కొంది. భారత మార్కట్లలో స్టోన్ బ్లాక్, పోలార్ వైట్ రంగుల్లో డిజైర్ 10 లైఫ్‌స్టైల్ లభ్యం కానుండగా ఇతర మార్కెట్లలో రాయల్ బ్లూ, వాలంటైన్ లక్స్ రంగుల్లో లాంచ్ చేసినట్టు తెలిపింది. హెచ్‌టీసీ డిజైర్ 10 లైఫ్‌స్టైల్ ఫీచర్లు 5.5 ఇంచెస్ స్క్రీన్ 1.6 గిగాహెడ్జ్ ప్రాసెసర్, 720x1280 ఎంపీ రిజల్యూషన్ 2జీబీ ర్యామ్, 16జీబీ అంతర్గత మెమొరీ 13ఎంపీ వెనుక కెమెరా 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఆండ్రాయిడ్ 6.0 2700 ఎంఏహెచ్ బ్యాటరీ -
హెచ్‌టీసీ కన్ఫాం చేసింది
న్యూఢిల్లీ: గూగుల్ ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ 7.0 నోగట్ తో హెచ్ టీసీ స్మార్ట్ ఫోన్ల తయారీకి రంగం సిద్ధమైంది. తమ అప్ కమింగ్ మోడ్సల్ ను గూగుల్ అండ్రాయిడ్ వెర్షన్ నోగట్ తో అప్ డేట్ చేయనున్నట్టు వెల్లడించింది. ఈ ఏడాది చివరికి ఆండ్రాయిడ్ 7.0 వెర్షన్ తో అప్ డేట్ చేస్తామని ట్టిట్టర్ ద్వారా తెలిపింది. ఈ అప్ డేట్ తేదీని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పింది ఈ ఏడాది ఫోర్త్ క్వార్టర్ లో హెచ్ టీసీ10ను నౌగట్ వెర్షన్ తో అప్ డేట్ చేసే మొదటి స్మార్ట్ ఫోన్ కానుంది. .వన్ ఎం 9, వన్ ఎ 9 డివైజ్ లను నౌగట్ తో లాంచ్ చేయనున్నట్టు తెలిపింది. అయితే ఈ ఏడాది చివరికా, లేక 2017 ఫస్ట్ క్వార్టర్ లోనా అనేది స్పష్టంగా పేర్కొనలేదు. కాగా గూగుల్ నెక్సస్ స్మార్ట్ ఫోన్ల తయారీలో హెచ్‌టీసీ భాగస్వామ్య వార్తలను ఇటీవల హెచ్‌టీసీ ధృవీకరించిన సంగతి తెలిసిందే. ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ 7.0 నోగట్ తో పనిచేసేలా రెండు కొత్త నెక్సస్ స్మార్ట్ ఫోన్లను తయారీచేస్తున్నామని హెచ్ టీసీ రిపోర్టు చేసింది. We’re excited to receive final shipping Android 7.0 Nougat software from Google! pic.twitter.com/BNbQBpgddK — HTC (@htc) August 24, 2016 -
గూగుల్ కొత్త ఫోన్లు
గూగుల్ నెక్సస్ స్మార్ట్ఫోన్ల తయారీలో ప్రస్తుతం హెచ్‌టీసీ నిమగ్నమై ఉన్నట్టు కొత్త ఎఫ్‌సీసీ డాక్యుమెంట్లో కంపెనీ ధృవీకరించింది. ప్రొడక్ట్ ఫైనల్ వెర్షన్‌ను ఆవిష్కరించిన తర్వాత ఆ ప్రొడక్ట్ కమర్షియల్‌గా గూగుల్ వెబ్సైట్లోనే అందుబాటులో ఉంటుందని హెచ్‌టీసీ కార్పొరేషన్ ప్రాజెక్టు మేనేజర్ సీన్ షిహ్ తెలిపారు. గూగుల్ తన నెక్సస్ స్మార్ట్ఫోన్ల తయారీకి హెచ్‌టీసీతో భాగస్వామ్యం ఏర్పరుచుకుందని ముందస్తు రిపోర్టులు వెల్లడించాయి. ఈ రిపోర్టులను ధృవీకరిస్తూ హెచ్‌టీసీ సైతం గూగుల్ ఫోన్ల తయారీలో సహకారం చేస్తున్నట్టు వెల్లడించింది. ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ 7.0 నోగట్తో పనిచేసేలా రెండు కొత్త నెక్సస్ స్మార్ట్ఫోన్లను తయారీచేస్తున్నామని హెచ్‌టీసీ రిపోర్టు చేసింది. ఆ డివైజ్‌ల కోడ్ నేమ్‌గా మార్లిన్, సెయిల్ఫిష్గా పేర్కొంది. ఈ రిపోర్టులతో గూగుల్ త్వరలోనే తన సొంత స్మార్ట్ఫోన్లను భారత్‌తో పాటు, ఇతర మార్కెట్లలో ఆవిష్కరించబోతుందని తెలుస్తోంది. అయితే ఈ డివైజ్‌ల వివరాలు పూర్తిగా తెలియరాలేదు. ఇప్పటికే వెలువడిన రిపోర్టుల ప్రకారం యాపిల్ ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ వంటి టాప్ ఎండ్ సీరిస్‌ల మాదిరిగా గూగుల్ ఫోన్ కూడా మార్కెట్లను ఏలేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. గూగుల్ నెక్సస్ డివైజ్‌లు సెయిల్ఫిష్, మార్లిన్లు సెప్టెంబర్-అక్టోబర్‌లో వినియోగదారుల ముందుకు రాబోతున్నాయట. ఈ ఫోన్లలోని రింగ్టోన్స్, నోటిఫికేషన్ సౌండ్లు తాజాగా ఆన్లైన్లో విడుదల చేశారు. మార్లిన్.. రెండు నెక్సస్ డివైజ్‌ల ఫ్లాగ్షిప్. 5.5 అంగుళాల క్వాడ్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 821 చిప్సెట్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ విస్తరణ మెమరీ, హెచ్‌టీసీ డిజైన్‌తో సమానమైన డిజైన్, 3450 ఎంఏహెచ్, ఫింగర్‌ప్రింట్ స్కానర్ విత్ నెక్సస్ ఇంప్రింట్ సపోర్టు వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. సెయిల్ఫిష్ డివైజ్... స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్‌తో రాబోతుందని తెలుస్తోంది. జీఎఫ్ఎక్స్ బెంచ్ మార్క్స్ రిపోర్టు ప్రకారం ఈ డివైజ్‌కు 11 ఎంపీ వెనుక కెమెరా, 4 కే వీడియో రిపోర్టింగ్, 7 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుందని వెల్లడవుతోంది. కానీ మరో రిపోర్టు అంటుటు మాత్రం సెయిల్ఫిష్కు 13 ఎంపీ వెనుక కెమెరా, 8 ఎంపీ ముందు కెమెరా ఉంటుందని చెబుతోంది. -
బాబోయ్.. మాటగాళ్లు
వర్గల్: సెల్‌ఫోన్ ద్వారా ఆ యువకునితో మాటలు కలిపారు. కారు చవకకే ఖరీదైన సెల్‌ఫోన్ అంటూ ముగ్గులో దింపారు. మాటల గారడీతో నమ్మించారు. పోస్టులో పార్సిల్ ద్వారా ఫోన్ పంపుతున్నాం..డబ్బులు కట్టి విడిపించుకో అని సూచించారు. తీరా పార్సిల్ విప్పితే అందులో ఫోన్ లేదు..పనికిరాని కాగితాలు, ఓ స్టీల్ గొలుసు, లాకెట్ తప్ప.. ఈ మోసపూరిత సంఘటన శనివారం వర్గల్ మండల కేంద్రంలో వెలుగు చూసింది. బాధితుడు వర్గల్‌కు చెందిన కిష్టనోల్ల షాదుల్లా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం షాదుల్లా సెల్‌ఫోన్‌కు హెచ్‌టీసీ కంపెనీ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు కాల్ చేశారు. తమ కంపెనీకి చెందిన రూ.12,500 విలువైన సెల్‌ఫోన్‌ను లాటరీ ద్వారా నీకు రూ. 3,500 లకే లభిస్తుందని చెప్పారు. మాటల గారడీతో అతనిలో ఆశలు కలిగించారు. ఆ వ్యక్తులు పోస్టు ద్వారా సెల్‌ఫోన్‌ను పార్సిల్‌గా పంపుతామని అడ్రసు తీసుకున్నారు. పార్సిల్ రాగానే రూ. 3,500 చెల్లించి విడిపించుకోవాలని సూచించారు. ఈ మేరకు షాదుల్లా పేరిట ఓ పార్సిల్ వచ్చింది. వర్గల్ పోస్టాఫీసుకు శుక్రవారం వెల్లిన షాదుల్లా డబ్బు కట్టేసి పార్సిల్‌ను అక్కడే తెరచి చూశాడు. ఖరీదైన ఫోన్‌కు బదులు అందులో నుంచి పనికిరాని కాగితాలు, ఓ స్టీల్ లాకెట్, గొలుసు బయటపడ్డాయి. దీంతో తాను మోసపోయినట్లు గుర్తించాడు. ఈ మేరకు శనివారం గౌరారం పోలీసులకు బాధితుడు షాదుల్లా ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ మోసగాళ్లే కాదు..మాటగాళ్లూ ఉంటారు.. తస్మాత్ జాగ్రత్త. -
మార్కెట్ లోకి వాటర్ ప్రూఫ్ సెల్పీ కెమెరా!
వాషింగ్టన్: మొబైల్ ఫోన్ల వ్యాపార రంగంలో అమ్మకాలు క్షీణిస్తున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు తైవాన్ కు చెందిన మొబైల్ తయారీ సంస్థ హెచ్ టీసీ కొత్తరకం ఫోన్లను మార్కెట్ లో ఆవిష్కరించింది. నూతన ఉత్పత్తుల జాబితాలో వాటర్ ప్రూఫ్ సెల్పీ కెమెరా, సెల్ఫీ ఫోకస్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. 199 డాలర్ల రేటుతో స్లిమ్ గా ట్యూబ్ తరహాలో ఉండే 'రీ కెమెరా', ను విడుదల చేసింది. మొబైల్ రంగ మార్కెట్లో సెల్పీ ట్రెండ్ కొనసాగుతుండటంతో వినియోగదారుల్ని ఆకర్షించి అమ్మకాలను పెంచుకునేందుకు హెచ్ టీసీ చర్యలు తీసుకుంటోంది. గత సంవత్సరం వెల్లడించిన ప్రపంచ టాప్ 10 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల జాబితానుంచి హెచ్ టీసీ దిగిజారింది. గత త్రైమాసికంలో 12 శాతం అమ్మకాలు క్షీణించినట్టు హెచ్ టీసీ ప్రకటించింది. -
హెచ్‌టీసీ..కొత్త స్మార్ట్ఫోన్లు
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన హెచ్‌టీసీ కంపెనీ శుక్రవారం రెండు కొత్త స్మార్ట్ఫోన్లు- డిజైర్ 616, హెచ్‌టీసీ వన్ ఈ8లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే హెచ్‌టీసీ వన్ ఈ8లో 5 అంగుళాల స్క్రీన్, డ్యుయల్ సిమ్(నానో), 2.5 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని , ధర రూ. 34,990 అని పేర్కొన్నారు. ఇక డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ డిజైర్ 616లో 5 అంగుళాల స్క్రీన్, 1.4 గిగాహెట్జ్ ఆక్టకోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని, ధర రూ.16,900 అని పేర్కొన్నారు. మూడు రెట్లవుతున్న అమ్మకాలు దక్షిణాసియా దేశాల్లో భారత్ తమకు రెండో ముఖ్యమైన దేశమని హెచ్‌టీసీ సౌత్ ఏషియా ప్రెసిడెంట్ జాక్ యంగ్ చెప్పారు. ఏ నెలకా నెల తమ అమ్మకాలు మూడు రెట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. భారత మార్కెట్లో అపార అవకాశాలున్నాయని, అందుకని ఇతర దేశాల కంటే ముందుగానే కొత్త మొబైళ్లను ఇక్కడే విడుదల చేస్తున్నామని వివరించారు. భారత్‌లో తమకు 4-6 శాతం మార్కెట్ వాటా ఉందని పరిశ్రమ నివేదికలు వెల్లడిస్తున్నాయని, దీనిని 15 శాతానికి పెంచుకోవడం లక్ష్యమని హెచ్‌టీసీ ఇండియా హెడ్ ఫైసల్ సిద్దిఖి చెప్పారు. సేల్స్ పాయింట్లను, సర్వీస్ సెంటర్లను పెంచామని, అమ్మకాలు పెరిగాయని వివరించారు. -
హెచ్‌టీసీ తొలి ఫ్యాబ్లెట్ ‘వన్ మ్యాక్స్’ వచ్చేస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌టీసీ తొలి ఫ్యాబ్లెట్ ‘వన్ మ్యాక్స్’ వారం రోజుల్లో భారత్‌లో విడుదల కానుంది. 5.9 అంగుళాల ఫుల్ హెచ్డీ స్క్రీన్, 1.7 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, హెచ్‌టీసీ అల్ట్రా పిక్సెల్ కెమెరా, 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లున్నాయి. 16, 32 జీబీ ఇంటర్నల్ మెమరీతో రెండు వేరియంట్లలో ఇది లభిస్తుంది. 4జీ సపోర్ట్ చేస్తుంది. ధర రూ.56 వేలుగా నిర్ణయించామని హెచ్‌టీసీ కంట్రీ మేనేజర్ ఫైసల్ సిద్ధిఖి చెప్పారు. సోమవారమిక్కడ మీడియాకు ఈ కొత్త ఫ్యాబ్లెట్‌ను ప్రదర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది భారత్‌లో 10 స్మార్ట్ఫోన్లు ఆవిష్కరించామని, డిసెంబరుకల్లా మరో నాలుగు మోడళ్లు రానున్నాయని చెప్పారు. కాగా, హెచ్‌టీసీ వన్, హెచ్‌టీసీ వన్ మినీ మోడళ్లపై బై బ్యాక్ ఆఫర్‌ను కంపెనీ ప్రకటించింది. పాత స్మార్ట్‌ఫోన్‌ను తీసుకువస్తే ఈ మోడళ్లపై రూ. 5 వే ల దాకా డిస్కౌంట్ ఇస్తారు. మైక్రోసాఫ్ట్ విండోస్ ప్లాట్‌ఫాంపై మరిన్ని మొబైల్ ఫోన్లను కంపెనీ ఆవిష్కరించనుంది. ఫోన్‌కు చిన్న ఫోన్.. హెచ్‌టీసీ వన్ మినీ ప్లస్ పేరుతో రిమోట్లాంటి పరికరాన్ని వారం రోజుల్లో మార్కెట్లోకి తెస్తోంది. దీని నుంచి ఇ-మెయిల్, ఎస్‌ఎంఎస్‌తోపాటు కాల్స్ అందుకోవచ్చు. అలాగే చేయవచ్చు కూడా. ప్రపంచంలో ఇటువంటి ఉత్పాదన మరొకటి లేదని హెచ్‌టీసీ అంటోంది. ధర రూ.7,500. అలాగే ఫెచ్ పేరుతో చేతిలో ఇమిడే చిన్న పరికరాన్ని సైతం కంపెనీ రూపొందించింది. ఇది చేతిలో ఉంటే చాలు ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ధర రూ.2,500.