మార్కెట్ లోకి వాటర్ ప్రూఫ్ సెల్పీ కెమెరా!
మార్కెట్ లోకి వాటర్ ప్రూఫ్ సెల్పీ కెమెరా!
Published Thu, Oct 9 2014 3:13 PM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM
వాషింగ్టన్: మొబైల్ ఫోన్ల వ్యాపార రంగంలో అమ్మకాలు క్షీణిస్తున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు తైవాన్ కు చెందిన మొబైల్ తయారీ సంస్థ హెచ్ టీసీ కొత్తరకం ఫోన్లను మార్కెట్ లో ఆవిష్కరించింది. నూతన ఉత్పత్తుల జాబితాలో వాటర్ ప్రూఫ్ సెల్పీ కెమెరా, సెల్ఫీ ఫోకస్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.
199 డాలర్ల రేటుతో స్లిమ్ గా ట్యూబ్ తరహాలో ఉండే 'రీ కెమెరా', ను విడుదల చేసింది. మొబైల్ రంగ మార్కెట్లో సెల్పీ ట్రెండ్ కొనసాగుతుండటంతో వినియోగదారుల్ని ఆకర్షించి అమ్మకాలను పెంచుకునేందుకు హెచ్ టీసీ చర్యలు తీసుకుంటోంది. గత సంవత్సరం వెల్లడించిన ప్రపంచ టాప్ 10 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల జాబితానుంచి హెచ్ టీసీ దిగిజారింది. గత త్రైమాసికంలో 12 శాతం అమ్మకాలు క్షీణించినట్టు హెచ్ టీసీ ప్రకటించింది.
Advertisement
Advertisement