waterproof
-
వాటర్‌ప్రూఫ్ పవర్‌స్టేషన్
ఆరుబయట విహారయాత్రలకు వెళ్లేటప్పుడు వెంట తీసుకుపోవడానికి వీలుగా పోర్టబుల్ పవర్ స్టేషన్లు రకరకాలకు చెందినవి ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. వాతావరణం పొడిగా ఉన్నప్పుడు వీటితో ఇబ్బందేమీ ఉండదు గాని, అకస్మాత్తుగా వాన కురిసి, వాన నీటి వల్ల వీటి లోపలి భాగాలు తడిస్తే మాత్రం ప్రమాదాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. నీరు పడినా ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండేలా ఆస్ట్రేలియన్ కంపెనీ ‘ఆర్క్ప్యాక్’ ప్రపంచంలోనే మొట్టమొదటి వాటర్‌ప్రూఫ్ పోర్టబుల్ పవర్‌స్టేషన్‌ను ‘ఆర్క్ ఐపీ67’ బ్రాండ్ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. ఇది 1500 డబ్ల్యూహెచ్ సామర్థ్యంతో పనిచేస్తుంది. ఏకకాలంలో పదకొండు ఎలక్ట్రానిక్ పరికరాలను దీని ద్వారా చార్జింగ్ చేసుకోవడానికి తగిన వెసులుబాటు ఉండటం విశేషం. ఆరుబయట విహారయాత్రలకు వెళ్లేటప్పుడు, బోటు షికార్లకు వెళ్లేటప్పుడు వెంట తీసుకుపోయి, ఎక్కడ కావాలనుకున్నా ఉపయోగించుకోవడానికి అనువుగా దీనిని తీర్చిదిద్దారు. దీని ధర 1,999 డాలర్లు (రూ.1.66 లక్షలు). -
ఫోన్ నీటిలో పడిందా..? ఇలా చేయండి..
ప్రతి ఒక్కరి జీవితంలోను ఫోన్ భాగమైపోయింది. స్మార్ట్ఫోనో..ఫీచర్ఫోనో ఏదో ఒకటి తప్పకుండా ఉపయోగిస్తున్నారు. అయితే మనదో..మనకు తెలిసిన వారి ఫోన్ ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదవశాత్తు నీటిలో పడిపోవడం చూస్తుంటారు. అలాంటి సమయంలో ఫోన్‌ను వెంటనే ఆరబెట్టే ప్రయత్నంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. అయితే ఇలా ఫోన్ నీళ్లలో పడినప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలా చేయడం వల్ల ఫోన్‌ను సురక్షితంగా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చేయకూడనివి.. నీటిలో తడిచిన వెంటనే ఫోన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆన్ చేయవద్దు. బటన్లను ప్రెస్ చేయటం కానీ, ఫోన్‌ను షేక్ చేయటం కాని చేయవద్దు. మీకు ఫోన్ గురించి తెలిసినా ఓపెన్ చేయవద్దు. ఇష్టమొచ్చినట్లు ఓపెన్ చేయటం వల్ల వారంటీ కోల్పోవలసి వస్తుంది. తడిసిన ఫోన్‌పై గాలిని ఊదే ప్రయత్నం చేయకూడదు. దాంతో నీరు లోపలి భాగాల్లోకి వెళ్లే ప్రమాదముంది. అవగాహన లేకుండా ఎలాంటి హీట్ డ్రైయర్‌ను ఉపయోగించకూడదు. ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువగా నీరు చేరే అవకాశం ఉంటుంది. లేదంటే ఒకే చోట వేడెక్కి మిగతా భాగాలను దెబ్బతీస్తాయి. చేయాల్సినవి.. వారెంటీ, ఇన్సూరెన్స్ ఉంటే వెంటనే సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఇన్సూరెన్స్ అయిపోతే ముందుగా ఫోన్‌ను ఓపెన్ చేసి సిమ్‌తోపాటు మైక్రో ఓఎస్డీకార్డ్ను తొలగించాలి. రిములబుల్ బ్యాటరీ ఫోన్ అయితే బ్యాటరీని ఫోన్ నుంచి వేరు చేయాలి. క్లాత్ లేదా పేపర్ తీసుకుని చాలా సున్నితంగా ఫోన్లోని తడి భాగాలను తుడవాలి. తడిబారిన ప్రదేశం సాధారణ స్థాయికి వచ్చిన తరువాత సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. అయితే జిప్‌లాక్ బ్యాగ్‌లో బియ్యాన్ని వేసి అందులో ఫోన్‌ను ఉంచి కప్పివేయాలని, అందువల్ల తేమశాతం తగ్గుతుందని కొందరు సూచిస్తుంటారు. అయితే దాంతో పూర్తిగా ప్రయోజనం ఉండదు. తాత్కాలికంగా అలా చేసినా మళ్లీ సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. -
4జీ కనెక్టివితో పేటీఎం 3.0 సౌండ్‌బాక్స్
ముంబై: చెల్లింపుల ప్రక్రియను మరింత సురక్షితం, వేగవంతం చేసేందుకు పేమెంట్స్, ఆర్థిక సేవల కంపెనీ పేటీఎం 4జీ ఆధారిత సౌండ్‌బాక్స్ 3.0 ని ఆవిష్కరించింది. రియల్ టైమ్ పేమెంట్ పరిశ్రమలో అలర్టుల కోసం స్థిరమైన కనెక్టివిటీ ఉపయోగించి తయారుచేసిన మొట్టమొదటి 4జీ సౌండ్‌బాక్స్ ఇది. వాటర్ ప్రూఫ్ ఫీచర్ కలిగిన ఈ మేడిన్ ఇండియా ప్రాడెక్ట్ బ్యాటరీ జీవిత కాలం ఏడురోజులుగా ఉంది. పరిసర ప్రాంతాల్లో 4జీ నెట్వర్క్ పనిచేయకపోతే, చెల్లింపులకు ఎలాంటి అంతరాతయం కలగకుండా ఆటోమేటిక్‌గా 2జీకి కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. ఇందులో మొత్తం 11 భాషలు అందుబాటులో ఉన్నాయి. వ్యాపారులు స్వీకరించిన పేమెంట్స్‌పై కచ్చితమైన క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అలాగే 24 గంటల హెల్ప్‌లైన్, ఒక గంట కాల్ బ్యాక్ పాలసీ అందిస్తుంది. పేటీఎం మెర్క్యూ లెండింగ్ భాగస్వాముల ద్వారా తక్షణ రుణ సదుపాయం పొందవచ్చు. -
సౌండ్‌కోర్ నుంచి సరికొత్త వాటర్‌ప్రూఫ్ స్పీకర్.! ధర ఎంతంటే..!
ప్రపంచవ్యాప్తంగా ఆడియో టెక్నాలజీలో పేరొందిన సౌండ్‌కోర్ భారత మార్కెట్లలోకి సరికొత్త సబ్మెర్సిబుల్ సెలక్ట్ప్రో స్పీకర్‌ను అక్టోబర్ 27న లాంచ్ చేసింది. సెలక్ట్ ప్రో పోర్టబుల్ స్పీకర్ 6700ఎమ్ఏహెచ్ సామర్థ్యంతో...16 గంటలపాటు బ్యాకప్‌ను అందిస్తోంది.మ్యూజిక్‌తో పాటు వచ్చే ఎల్ఈడీ లైట్స్ సెలక్ట్ ప్రో స్పీకర్‌కు మరింత ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఎల్ఈడీలైట్స్ పోల్టబుల్ స్పీకర్‌తో సంగీతానికి అనుగుణంగా వస్తాయి. రెండు కస్టమ్ డ్రైవర్లను, నాలుగు పాసివ్ రేడియేటర్స్ ఈ స్పీకర్ సొంతం. ఈ స్పీకర్ 30W అవుట్‌పుట్‌ను కల్గి ఉంది. సెలక్ట్ ప్రో స్పీకర్ IPX7 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉండడంతో వాటర్ ప్రూఫ్ స్పీకర్‌గా నిలుస్తోంది. సౌండ్‌కోర్ పోర్టబుల్ స్పీకర్ బ్లూటూత్ v5 ద్వారా ఏదైనా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చును. యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తోంది. పవర్‌ఐక్యూ ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారులు తమ స్మార్ట్ఫోన్లను ఛార్జ్ చేయవచ్చు. సౌండ్‌కోర్ సెలెక్ట్ ప్రో ధర రూ. 7,999. ఈ స్పీకర్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిఫ్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయవచ్చును. బ్లాక్ కలర్ ఆప్షన్‌తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఈ స్పీకర్‌పై 18 నెలల వారంటీను కంపెనీ అందిస్తోంది. చదవండి: జియోఫోన్ నెక్ట్స్ లాంచ్...! సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు..! -
నీళ్లలో పడి రూపం కోల్పోయిన రూ. 500 నోటు
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల నాణ్యతను పరీక్షించే పనిలో కొందరు బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే రూ.2000 నోటుపై వివిధ రకాలుగా పరీక్షలు చేసిన వీడియోలు ఆన్ లైన్ లో సంచలనం చేశాయి. కొత్త నోటు నలుగుతుందా, వాటర్ ప్రూఫా, కాదా అని పరీక్షించారు. రూ. 2000 నోటును నీటిలో ముంచి పరీక్షించారు. తడిసిన నోటు రంగు వెలిసిపోలేదు. దీంతో నోటు తడిసిన ఇబ్బందులు లేవని తేల్చారు. యూట్యూబ్ లో ఈ వీడియోలను కోట్లాది మంది వీక్షించిన విషయం తెలిసిందే. ఇక పరీక్షలకు కొత్త రూ.500 నోటు వంతు వచ్చింది. కానీ ఈ సారి పరీక్ష కావాలని చేయకపోయిన ప్రమాదవశాత్తు జరిగింది. శంకరమఠం ఏరియా వాసి, హైకోర్టు న్యాయవాది సాయికృష్ణ ఆజాద్ గురువారం ఏటీఎం నుంచి డ్రా చేసిన రూ. 500 నోటు చేతిలోంచి జారి నీళ్లలో పడిపోయింది. వెంటనే ఆ నోటును నీళ్లలోంచి తీసి..తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టారు. ఐదు నిమిషాలు తరువాత చూడగా ఆ నోటు రంగు వెలిసి నోటు ఆనవాళ్లు కోల్పోయింది. నోటులోని జాతిపిత గాంధీ బొమ్మతో పాటు ఇతర అక్షరాలు రూపం కోల్పోపోయాయి. దీంతో ఖంగుతిన్న అతను నోటు అసలా. నకిలీదా అని ఆందోళన చెందాడు. కానీ, కొన్ని చోట్ల వేడి నీటిలో పరీక్షించినా నోటుకు ఏమీ కాలేదు. కొత్త రూ.500 నోటును పరీక్షించకుండా ఉంటే మంచిదని తెలుస్తోంది. -
రూ.2000 నోటు వాటర్ ప్రూఫా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్లను దక్కించుకునేందుకు సామాన్య జనం నరకయాతన పడుతుంటే కొందరు మాత్రం వాటి నాణ్యతను పరీక్షించే పనిలో పడ్డారు. రూ.2000 నోట్లు దక్కించుకున్న వారు వాటిని మార్చుకునేందుకు నానా కష్టాలు పడుతుండగా, కొందరు వీటిని వివిధ రకాలుగా పరీక్షిస్తున్నారు. ఈ వీడియోలు ఆన్ లైన్ లో సంచలనంగా మారాయి. కొత్త నోటు నలుగుతుందా, లేదా అని పరీక్షించారు. రూ. 2000 నోటును రెండు చేతుల్లోకి తీసుకుని నలిపేసి, మళ్లీ సరిచేశారు. అంతేకాదు వాటర్ ప్రూఫా, కాదా అనేది కూడా టెస్ట్ చేశారు. రూ. 2000 నోటును నీటిలో ముంచేసి, టాప్ వాటర్ తో దాన్ని తడిపి కూడా పరీక్షించారు. పాత నోట్లతో పోలిస్తే ఇది ఎంతవరకు ఎఫెక్టివ్ అని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకు ఇలా చేశారు. తడిసిన రూ. 2000 నోటు రంగు వెలిసిపోలేదు. అంతేకాదు మామూలు కాగితం, పాత నోట్లతో పోలిస్తే త్వరగా పొడిగా మారింది. పాత నోట్లతో పోలిస్తే రూ. 2000 మెరుగ్గా ఉందని ఈ వీడియోల ద్వారా ప్రయోత్మకంగా నిరూపించారు. యూట్యూబ్ లో ఈ వీడియోలను కోట్లాది మంది వీక్షించడం విశేషం. -
శాంసంగ్ ఫోన్లు వాటర్ రెసిస్టెంట్ కాదట?
వాటర్ ప్రూఫ్ స్పెషల్ ఫీచర్ అంటూ ప్రకటన ద్వారా ఊదర గొట్టిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారుదారు శాంసంగ్ కంపెనీకి షాక్ తగిలింది. ఫ్లాగ్ షిప్ ఫోన్ల మొబైల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన హై ఎండ్ కేటగిరీ గెలాక్సీ ఎస్ 7, ఎస్ 7 ఎడ్జ్ , యాక్టివ్ లలో సంస్థ చెబుతున్నట్టుగా వాటర్ ప్రూఫ్ సౌకర్యం లేదని తేలిపోయింది. ఉత్పత్తుల టెస్టింగ్స్ లో పేరు గడించిన సంస్థ కన్జ్యూమర్స్ అనే స్వచ్ఛంద సంస్థ తమ పరీక్షలలో వాటి ప్రామాణికత నిలబడలేదని స్పష్టం చేసింది. అందుకే తాము ఈ ఫోన్టను రికమెండ్ చేయలేమని పేర్కొంది. అమెరికాలో ఎటి అండ్ టీలో మాత్రమే అందుబాటులోఉన్న ఎస్ 7యాక్టివ్ వాటర్ రిసిస్టెంట్ కాదని (జలనిరోధితం) చెప్పింది. అలాగే ఎస్7 ఎడ్జ్, యాక్టివ్ పై చేసిన పరీక్షల్లో కూడా వాటర్ ప్రూఫ్ నిరూపితం కాలేదని తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఒక అరగంట నీళ్లలో ఉంచినపుడు యాక్టివ్ ఫోన్ స్క్రీన్ గ్రీన్ , పసుపు రంగుల్లో మారిపోయిందనీ, టచ్ పనిచేయలేదని తమ రిపోర్టులో తేలిందన్నారు. అంతేకాదు కెమెరా లెన్సెస్ మీద బుడగలుకూడా కనిపించాయని... రెండు ఫోన్ల పరీక్షల్లోనూ ఇదే ఫలితం వచ్చిందని సంస్థ డైరెక్టర్ మారియా రెక్రిక్ తెలిపారు. శాంసంగ్ చెబుతున్న క్వాలిటీ ని ఈ ఫోన్లు రీచ్ కాలేకపోతున్నాయని.. ఆన్ లైన్ లో కొనుగోలు చేసిన రెండు ఫోన్లను ఈ పరీక్షల్లో ఫెయిలైనట్టు వెల్లడించారు. శాంసంగ్ యాక్టివ్ ఫెయిల్ కావడం తనకు చాలా ఆశ్చర్యం కలిగించిదన్నారు. సాధారణంగా శాంసంగ్ ఫోన్లు నాణ్యతకు మారుపేరుగా నిలుస్తాయని వ్యాఖ్యానించారు. ఎస్ 7,ఎస్ 7ఎడ్జ్, బ్యాటరీ లైఫ్, కెమెరా, డిస్ ప్లే లో అద్భుతంగా ఉన్నాయని కన్జ్యూమర్స్ పేర్కొంది. దీనిపై స్పందించిన శాంసంగ్ చాలా తక్కువ ఫిర్యాదులు మాత్రమే తమకు అందాయని తెలిపింది. ఈ విషయంలో కన్జ్యూమర్ రిపోర్ట్స్ ను పరిశీలిస్తున్నామని, దానితో టచ్ లో ఉన్నట్టు చెప్పింది. కాగా 5 అడుగుల నీటిలో అరగంట సేపు ఉన్నా తట్టుకునే సామర్థ్యం తమ ఫోన్లకు ఉందని శాంసంగ్ యూజర్లకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. -
మార్కెట్ లోకి వాటర్ ప్రూఫ్ సెల్పీ కెమెరా!
వాషింగ్టన్: మొబైల్ ఫోన్ల వ్యాపార రంగంలో అమ్మకాలు క్షీణిస్తున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు తైవాన్ కు చెందిన మొబైల్ తయారీ సంస్థ హెచ్ టీసీ కొత్తరకం ఫోన్లను మార్కెట్ లో ఆవిష్కరించింది. నూతన ఉత్పత్తుల జాబితాలో వాటర్ ప్రూఫ్ సెల్పీ కెమెరా, సెల్ఫీ ఫోకస్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. 199 డాలర్ల రేటుతో స్లిమ్ గా ట్యూబ్ తరహాలో ఉండే 'రీ కెమెరా', ను విడుదల చేసింది. మొబైల్ రంగ మార్కెట్లో సెల్పీ ట్రెండ్ కొనసాగుతుండటంతో వినియోగదారుల్ని ఆకర్షించి అమ్మకాలను పెంచుకునేందుకు హెచ్ టీసీ చర్యలు తీసుకుంటోంది. గత సంవత్సరం వెల్లడించిన ప్రపంచ టాప్ 10 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల జాబితానుంచి హెచ్ టీసీ దిగిజారింది. గత త్రైమాసికంలో 12 శాతం అమ్మకాలు క్షీణించినట్టు హెచ్ టీసీ ప్రకటించింది. -
నీటిలోనూ ఫోన్ సేఫ్
ట్రావెల్ గేర్ దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ఎండ తాపానికి ఈత కొలనులలో గంటలు గంటలు ఈదుతూ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగే అనుకోకుండా వర్షంలో తడవాల్సిన పరిస్థితులు ఎదరవ్వచ్చు. అలాంటి సమయాలలో ముఖ్యమైన ఫోన్ కాల్స్ వస్తే రిసీవ్ చేసుకోవడం సాధ్యపడదు. వేలకు వేల రూపాయలు పోసి కొన్న స్మార్ట్ ఫోన్లు నీళ్లు తగిలితే పాడైపోతాయి. ఇప్పటికే వాటర్‌ప్రూఫ్ ఫోన్లు వచ్చినప్పటికీ, ఇవి అందరికీ అందుబాటులోకి రాలేదు. అయితే, నీళ్లలో పడితే ఫోన్ పాడవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీటిలో ఈదుతూ ఫోన్ మాట్లాడాలని కోరుకునేవారికి సౌలభ్యంగా ఈ సెల్‌ఫోన్ వాటర్‌ప్రూఫ్ పౌచ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వాటర్‌ప్రూఫ్ పౌచ్ ఉన్నప్పటికీ నీటిలో ఈదుతూ ఫొటోలూ తీసుకోవచ్చు. వాటర్‌ప్రూఫ్ ఫోన్ పౌచ్ ధర రూ.700 పైనే. షాపింగ్ మాల్స్‌లో లభిస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్ ద్వారా తెప్పించుకోవచ్చు.