సౌండ్‌కోర్‌ నుంచి సరికొత్త వాటర్‌ప్రూఫ్‌ స్పీకర్‌.! ధర ఎంతంటే..! | Soundcore Select Pro Submersible Party Speaker Launched In India | Sakshi
Sakshi News home page

Soundcore: సౌండ్‌కోర్‌ నుంచి సరికొత్త వాటర్‌ప్రూఫ్‌ స్పీకర్‌.! ధర ఎంతంటే..!

Published Wed, Oct 27 2021 5:27 PM | Last Updated on Wed, Oct 27 2021 5:29 PM

Soundcore Select Pro Submersible Party Speaker Launched In India - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఆడియో టెక్నాలజీలో పేరొందిన సౌండ్‌కోర్‌ భారత మార్కెట్లలోకి సరికొత్త సబ్‌మెర్సిబుల్‌ సెలక్ట్‌ప్రో స్పీకర్‌ను అక్టోబర్‌ 27న లాంచ్‌ చేసింది. సెలక్ట్‌ ప్రో పోర్టబుల్ స్పీకర్ 6700ఎమ్‌ఏహెచ్‌ సామర్థ్యంతో...16 గంటలపాటు బ్యాకప్‌ను అందిస్తోంది.మ్యూజిక్‌తో పాటు వచ్చే ఎల్‌ఈడీ లైట్స్‌ సెలక్ట్‌ ప్రో స్పీకర్‌కు మరింత ఆకర్షణీయంగా నిలుస్తోంది. ఎల్‌ఈడీలైట్స్‌ పోల్టబుల్‌ స్పీకర్‌తో సంగీతానికి అనుగుణంగా వస్తాయి.  

రెండు కస్టమ్ డ్రైవర్లను, నాలుగు పాసివ్ రేడియేటర్స్‌ ఈ స్పీకర్‌ సొంతం. ఈ స్పీకర్‌ 30W అవుట్‌పుట్‌ను కల్గి ఉంది. సెలక్ట్‌ ప్రో స్పీకర్‌ IPX7 వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌ను కలిగి ఉండడంతో వాటర్‌ ప్రూఫ్‌ స్పీకర్‌గా నిలుస్తోంది. సౌండ్‌కోర్ పోర్టబుల్ స్పీకర్ బ్లూటూత్ v5 ద్వారా ఏదైనా స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవచ్చును. యూఎస్‌బీ టైప్‌-సీ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తోంది. పవర్‌ఐక్యూ ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌లను ఛార్జ్ చేయవచ్చు.  

సౌండ్‌కోర్ సెలెక్ట్ ప్రో ధర రూ. 7,999. ఈ స్పీకర్‌ను ప్రముఖ ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిఫ్‌కార్ట్‌ నుంచి కొనుగోలు చేయవచ్చును. బ్లాక్‌ కలర్‌ ఆప్షన్‌తో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది. ఈ స్పీకర్‌పై 18 నెలల వారంటీను కంపెనీ అందిస్తోంది.
చదవండి: జియోఫోన్‌ నెక్ట్స్ లాంచ్‌...! సుందర్‌ పిచాయ్‌ కీలక వ్యాఖ్యలు..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement