నీటిలోనూ ఫోన్ సేఫ్
ట్రావెల్ గేర్
దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ఎండ తాపానికి ఈత కొలనులలో గంటలు గంటలు ఈదుతూ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగే అనుకోకుండా వర్షంలో తడవాల్సిన పరిస్థితులు ఎదరవ్వచ్చు. అలాంటి సమయాలలో ముఖ్యమైన ఫోన్ కాల్స్ వస్తే రిసీవ్ చేసుకోవడం సాధ్యపడదు. వేలకు వేల రూపాయలు పోసి కొన్న స్మార్ట్ ఫోన్లు నీళ్లు తగిలితే పాడైపోతాయి.
ఇప్పటికే వాటర్‌ప్రూఫ్ ఫోన్లు వచ్చినప్పటికీ, ఇవి అందరికీ అందుబాటులోకి రాలేదు. అయితే, నీళ్లలో పడితే ఫోన్ పాడవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీటిలో ఈదుతూ ఫోన్ మాట్లాడాలని కోరుకునేవారికి సౌలభ్యంగా ఈ సెల్‌ఫోన్ వాటర్‌ప్రూఫ్ పౌచ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వాటర్‌ప్రూఫ్ పౌచ్ ఉన్నప్పటికీ నీటిలో ఈదుతూ ఫొటోలూ తీసుకోవచ్చు. వాటర్‌ప్రూఫ్ ఫోన్ పౌచ్ ధర రూ.700 పైనే. షాపింగ్ మాల్స్‌లో లభిస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా తెప్పించుకోవచ్చు.