Travel gear
-
చేతులను వేడి చేస్తుంది...
ట్రావెల్ గేర్ బాగా చలి ఉంటే ఇంట్లో ఉన్నా వేళ్లు కొంకర్లు పోతుంటాయి. ఇక ప్రయాణంలో సరేసరి. ఇలాంటప్పుడు అరచేతులకు వెచ్చదనాన్ని కలిగించే ఒక పరికరం ఉంటే.. మూడు విధాల ఉపయోగపడే ఈ హ్యాండ్ వార్మింగ్ పరికరం వెచ్చదనాన్ని అందించేదిగానూ, ఫోన్ చార్జర్‌గానూ, టార్చ్లైట్గానూ పనికొస్తుంది. చలిప్రాంతాలకు వెళ్లేవారికోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ పరికరం చెంత ఉంటే బెస్ట్ ఫ్రెండ్ వెంట ఉన్నట్టే! ఈ వార్మింగ్ పరికరం బటన్ నొక్కితే 5 నిమిషాల్లో చేతులను వెచ్చబరుస్తుంది. చీకటి వేళలో బయటకు వెళ్లేసమయంలో టార్చ్లైట్లా పనిచేస్తుంది. అమేజాన్ డాట్ కామ్‌లో రూ.2,100 నుంచి లభిస్తోంది. -
క్యాంప్ స్టౌ
ట్రావెల్ గేర్ ఎండావాన, రాత్రి పగలు.. ఏ సమయంలోనైనా ఎక్కడైనా వంట చేసేకునేందుకు వీలుగా తయారుచేసిన స్టౌ ఇది. అత్యంత చల్లని వాతావరణంలోనూ ఈ స్టౌల్లోని ఫ్యూయల్ సాయంతో దీనిని వెలిగించవచ్చు. కేవలం 25 ఔన్స్‌ల బరువుతో ఉండే ఈ స్టౌ అటవీ ప్రాంతాలకు, గ్రూప్‌గా పిక్నిక్లకు, విహారయాత్రలకు వెళ్లేవారికి అత్యంత అనువుగా ఉంటుంది. ఈ క్యాంప్ స్టౌ ధర రూ.5,500/- www.jetboil.com ద్వారా బుక్ చేసి తెప్పించుకోవచ్చు. -
నీటిలోనూ ఫోన్ సేఫ్
ట్రావెల్ గేర్ దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి ఎండ తాపానికి ఈత కొలనులలో గంటలు గంటలు ఈదుతూ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అలాగే అనుకోకుండా వర్షంలో తడవాల్సిన పరిస్థితులు ఎదరవ్వచ్చు. అలాంటి సమయాలలో ముఖ్యమైన ఫోన్ కాల్స్ వస్తే రిసీవ్ చేసుకోవడం సాధ్యపడదు. వేలకు వేల రూపాయలు పోసి కొన్న స్మార్ట్ ఫోన్లు నీళ్లు తగిలితే పాడైపోతాయి. ఇప్పటికే వాటర్‌ప్రూఫ్ ఫోన్లు వచ్చినప్పటికీ, ఇవి అందరికీ అందుబాటులోకి రాలేదు. అయితే, నీళ్లలో పడితే ఫోన్ పాడవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీటిలో ఈదుతూ ఫోన్ మాట్లాడాలని కోరుకునేవారికి సౌలభ్యంగా ఈ సెల్‌ఫోన్ వాటర్‌ప్రూఫ్ పౌచ్‌లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఈ వాటర్‌ప్రూఫ్ పౌచ్ ఉన్నప్పటికీ నీటిలో ఈదుతూ ఫొటోలూ తీసుకోవచ్చు. వాటర్‌ప్రూఫ్ ఫోన్ పౌచ్ ధర రూ.700 పైనే. షాపింగ్ మాల్స్‌లో లభిస్తున్నాయి. ఆన్లైన్ షాపింగ్ ద్వారా తెప్పించుకోవచ్చు.