Selfie Camera
-
అనుకోకుండా అదృష్టం.. సెల్ఫీలతో కోటీశ్వరుడు అయ్యాడు
డబ్బులు సంపాదించడానికి మార్గాలు అనేకం. ఈ ఇన్స్టంట్ రోజుల్లో.. ఈజీగా మనీని, అదీ చిన్నవయసులో సంపాదించేవాళ్లను సైతం చూస్తున్నాం. వీళ్లలో చాలామంది కష్టంతో ఎదిగిన వాళ్లు ఉండొచ్చు!. కానీ, కష్టపడకుండా కేవలం ఫోటోలతో.. కోట్లు సంపాదించి మిలీయనీర్‌గా ఎదిగిన వ్యక్తి గురించి ఎప్పుడైనా మీరు విన్నారా!. సుల్తాన్ గుస్తాఫ్ అల్ ఘోజాలీ.. ఇండోనేషియా సెంట్రల్ సిటీ ఆఫ్ సెమరాంగ్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. ఘోజాలి గత ఐదేళ్లుగా దాదాపు ప్రతిరోజూ తన కంప్యూటర్ ముందు కూర్చొని సెల్ఫీలు తీసుకునేవాడు. ఇలా అతను దాదాపు వెయ్యి సెల్ఫీలను తీసుకున్నాడు. పైగా తన గ్రాడ్యుయేషన్ డే కోసం టైమ్‌లాప్స్ వీడియోను కూడా రూపొందించాలని ప్లాన్ చేశాడు. ఈలోపు సరదాగా బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ గురించి తెలుసుకుని.. అందులో తన సెల్ఫీలను ఆన్లైన్లో ఎన్ఎఫ్టీలుగా విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. తన సెల్ఫీలను ఎవరు కొంటారో చూద్దాం అని తమషాగా చేశాడు. సెల్ఫీని కేవలం మూడు డాలర్లు(రూ.223)గా కోట్ చేశాడు. కానీ, అతను కూడా ఊహించని రేంజ్లో సెల్పీలకు డిమాండ్ పెరిగింది. మరోవైపు క్రిప్టోకరెన్సీ ‘ఈథర్’ ఎఫెక్ట్‌తో ఒక్కో సెల్ఫీ రూ 60 వేలు పలికింది. ఈ క్రమంలో ఒక ప్రముఖ సెలబ్రిటీ చెఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఘోజాలీ సెల్ఫీని ప్రమోట్ చేశాడు. ఆ ప్రభావంతో ఘోజాలీ సెల్ఫీ అమ్మకాలు అమాంతం ఊపందుకున్నాయి. దీంతో ఘోజాలీ సుమారు రూ 7 కోట్లు పైనే సంపాదించగలిగాడు. ఏదిఏమైన సరదాగా తమాషాకి చేసిన పని అతన్ని కోటీశ్వరుడిగా చేయడం విశేషం. (చదవండి: ఆ పుర్రే పురాతన కాలం నాటి అడ్వాన్స్డ్ సర్జరీకి ప్రతీక!) -
మరో అద్భుతమైన వివో స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: సెల్ఫీ స్మార్ట్ఫోన్లకు పెట్టింది పేరైన వివో సెల్ఫీ లవర్స్కోసం అద్భుతమైన మొబైల్‌ను ఆవిష్కరించనుంది. భారీ సెల్ఫీ కెమెరాతో రెండు కొత్త స్మార్ట్ఫోన్లు త్వరలోనే భారతీయ మార్కెట్లను పలకరించనున్నాయి. వివో వీ15, వివో వీ15 ప్రో పేరుతో రెండు ఫోన్లను ఫిబ్రవరి 20న ఇండియాలో లాంచ్ చేస్తోంది. ముఖ్యంగా ఈ ఫోన్లలోని 32 మెగా పిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా.. మొబైల్ లవర్స్‌ను ఆకట్టుకోనుంది. రియర్‌లో 48ఎంపీతోపాటు ట్రిపుల్ కెమెరా ఉండటం దీని ప్రత్యేకత. వెనుకవైపు మూడు కెమెరాలతోపాటు ఎల్ఈడీ ఫ్లాష్ కూడా పొందుపర్చింది. వివో వీ15, వివో వీ15 ప్రో మోడల్స్ లాంఛ్ కానున్నాయి. ఆన్లైన్లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం వివో 15 ప్రో స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి. ఈ మేరకు వివో బ్రాండ్ అంబాసిడర్ బాలీవుడ్ సూపర్‌స్టార్ ఆమీర్ ఖాన్ టీజర్ వీడియో కూడా హల్ చల్ చేస్తోంది. వివో వీ15 ప్రో ఫీచర్లు 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్ప్లే స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ 48+8+5 మెగాపిక్సెల్రియర్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3700 ఎంఏహెచ్ బ్యాటరీ ధర: సుమారు రూ.30వేలు Suprised? Get ready for super low-light clicks on the all-new #VivoV15Pro Triple Rear Camera with 48 million Quad Pixel Sensors. #GoPop pic.twitter.com/f8aw6HkyY8 — Vivo India (@Vivo_India) February 8, 2019 -
మార్కెట్ లోకి వాటర్ ప్రూఫ్ సెల్పీ కెమెరా!
వాషింగ్టన్: మొబైల్ ఫోన్ల వ్యాపార రంగంలో అమ్మకాలు క్షీణిస్తున్న నేపథ్యంలో వినియోగదారులను ఆకర్షించేందుకు తైవాన్ కు చెందిన మొబైల్ తయారీ సంస్థ హెచ్ టీసీ కొత్తరకం ఫోన్లను మార్కెట్ లో ఆవిష్కరించింది. నూతన ఉత్పత్తుల జాబితాలో వాటర్ ప్రూఫ్ సెల్పీ కెమెరా, సెల్ఫీ ఫోకస్ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. 199 డాలర్ల రేటుతో స్లిమ్ గా ట్యూబ్ తరహాలో ఉండే 'రీ కెమెరా', ను విడుదల చేసింది. మొబైల్ రంగ మార్కెట్లో సెల్పీ ట్రెండ్ కొనసాగుతుండటంతో వినియోగదారుల్ని ఆకర్షించి అమ్మకాలను పెంచుకునేందుకు హెచ్ టీసీ చర్యలు తీసుకుంటోంది. గత సంవత్సరం వెల్లడించిన ప్రపంచ టాప్ 10 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల జాబితానుంచి హెచ్ టీసీ దిగిజారింది. గత త్రైమాసికంలో 12 శాతం అమ్మకాలు క్షీణించినట్టు హెచ్ టీసీ ప్రకటించింది.