గూగుల్‌కి చేతికి హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ వ్యాపారం
డీల్ విలువ 1.1 బిలియన్ డాలర్లు
తైపీ: తైవాన్‌కి చెందిన హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ హెచ్‌టీసీ తమ స్మార్ట్‌ఫోన్ వ్యాపారంలో కొంత భాగాన్ని ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్‌కి విక్రయించనున్నట్లు వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు 1.1 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. మొబైల్ హ్యాండ్‌సెట్స్ హార్డ్‌వేర్‌పై పట్టు సాధించేందుకు గూగుల్‌కి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. ఒప్పందం ప్రకారం హెచ్‌టీసీ పరిశోధన సిబ్బందిలో దాదాపు సగం మందిని (సుమారు 2,000) గూగుల్ చేర్చుకుంటుంది.
వచ్చే ఏడాది తొలినాళ్లలో ఈ డీల్ పూర్తి కాగలదని హెచ్‌టీసీ తెలిపింది. స్మార్ట్‌ఫోన్స్ తయారీపైనా, కొంగొత్త హార్డ్‌వేర్ వ్యాపార కార్యకలాపాల్లోనూ గూగుల్ మరింతగా దృష్టి పెడుతోందనడానికి ఇది నిదర్శనమని హెచ్‌టీసీ ప్రతినిధి పీటర్ షెన్ తెలిపారు. హెచ్‌టీసీ తమ సొంత బ్రాండ్‌పైనా స్మార్ట్‌ఫోన్లను అభివృద్ధి చేయడం, విక్రయించడం కొనసాగిస్తుందని పీటర్ పేర్కొన్నారు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్స్ తయారీలో ఇరు సంస్థల మధ్య దశాబ్దంపైగా ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతుం దని సంయుక్త ప్రకటనలో గూగుల్ తెలిపింది.