హెచ్‌టీసీ యూ 11 లాంచ్..ధర ఎంతంటే..
న్యూఢిల్లీ: తైవాన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌టీసీ తన సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఆపిల్ ఐఫోన్లకు ధీటుగా ఫోన్ లవర్స్‌ను ఆకట్టుకుంటున్న సంస్థ తాజాగా మరో డివైస్ ను భారత మార్కెట్లో ప్రవేశ పెట్టింది. ఇప్పటికే తైవాన్లో లాంచ్ చేసిన తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను పహెచ్‌టీసి యు 11 పేరుతో శుక్రవారం న్యూఢిల్లీ విడుదల చేసింది. దీని రూ. 51,990గా నిర్ణయించింది.
రేపటి నుంచి ప్రీ ఆర్డర్‌కు, జూన్ చివరి నుంచి కొనుగోలు కోసం ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అమేజింగ్ సిల్వర్, నీలమణి నీలం, బ్రిలియంట్ బ్లాక్, ఐస్ వైట్, సోలార్ రెడ్ ఐదు రంగుల్లో ఇది లభ్యంకానుంది. స్క్వీజబుల్ టచ్-సెన్సిటివ్ ఫ్రేమ్, ‘ఎడ్జ్ సెన్స్, 3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఫీచర్ ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణలుగా ఉన్నాయి.
హెచ్‌టీసీ యు 11
5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే
2.4 గిగాహెడ్జ్
స్నాప్ డ్రాగన్ 835 ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ నోగట్ 7.1ఆపరేటింగ్ సిస్టమ్
2560 x 1440 రిజల్యూషన్
6జీబీ ర్యామ్
128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
2 టీబీ ఎక్స్‌పాండబుల్ ఇంటర్నల్ మొమరీ
12 ఎంపీ రియర్ కెమెరా,
16ఎంపీ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ