హెచ్టీసీ నుంచి రెండు డిజైర్ ఫోన్లు వచ్చేశాయ్!
హెచ్టీసీ నుంచి రెండు డిజైర్ ఫోన్లు వచ్చేశాయ్!
Published Thu, Nov 24 2016 7:16 PM | Last Updated on Mon, Sep 4 2017 9:01 PM
హెచ్టీసీ 10 ఏళ్ల వార్షికోత్సవ సెలబ్రేషన్లో భాగంగా మరో రెండు సరికొత్త స్మార్ట్ఫోన్లను భారత్ మార్కెట్లోకిలో లాంచ్ చేసింది. హెచ్టీసీ డిజైర్ 10 ప్రో, హెచ్టీసీ డిజైర్ 10 ఎవో పేర్లతో ఈ ఫోన్లను గురువారం వినియోగదారులు ముందుకు తీసుకొచ్చింది. హెచ్టీసీ డిజైర్ 10 ప్రో ధర రూ.26,490గా కంపెనీ పేర్కొంది. హెచ్టీసీ డిజైర్ 10 ప్రో డిసెంబర్ 15 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రిటైల్ అవుట్లెట్స్లో అందుబాటులో ఉండనున్నట్టు పేర్కొంది. అయితే డిజైర్ 10 ఎవో ధర, ఎప్పటినుంచి అందుబాటులో ఉంటుందో మాత్రం కంపెనీ తెలుపలేదు. న్యూఢిల్లీ ఈవెంట్గా ఈ ఫోన్లను హెచ్టీసీ ప్రవేశపెట్టింది. ఈ రెండు ఫోన్లు మొత్తం మెటల్ బాడీతో డిజైన్ చేసి, వాటర్, డస్ట్ రెసిస్టెంట్ పవర్ను కలిగిఉన్నాయి.
హెచ్టీసీ డిజైర్ 10 ప్రో ఫోన్ ఫీచర్లు...
5.5 అంగుళాల డిస్ప్లే
ఫింగర్ ప్రింట్ స్కానర్
ఆక్టా-కోర్ ప్రాసెసర్
13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
20 మెగాపిక్సెల్ రియర్ కెమెరా
4జీబీ ర్యామ్
64జీబీ స్టోరేజ్
మైక్రోఎస్డీ కార్డు ద్వారా 2టీబీ వరకు విస్తరణ
ఆండ్రాయిడ్ 6.0 ఓఎస్
3000 ఎంఏహెచ్ బ్యాటరీ కెపాసిటీ
హెచ్టీసీ 10 ఎవో స్మార్ట్ఫోన్ ఫీచర్లు...
5.5 అంగుళాల క్వాడ్-హెచ్డీ డిస్ప్లే
క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 810 ఆక్టా-కోర్ ప్రాసెసర్
3జీబీ ర్యామ్
32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
2టీబీ వరకు విస్తరణ
16ఎంపీ రియర్ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
ఆండ్రాయిడ్ 7 ఆపరేటింగ్ సిస్టమ్
3200 ఎంఏహెచ్ బ్యాటరీ
Advertisement
Advertisement