సరికొత్త ఫీచర్‌తో ‘హెచ్‌టీసీ యూ’ | HTC U 'squeezable' smartphone to be unveiled on May 16 | Sakshi

సరికొత్త ఫీచర్‌తో ‘హెచ్‌టీసీ యూ’

Apr 21 2017 3:00 PM | Updated on Oct 16 2018 2:49 PM

సరికొత్త ఫీచర్‌తో  ‘హెచ్‌టీసీ యూ’ - Sakshi

సరికొత్త ఫీచర్‌తో ‘హెచ్‌టీసీ యూ’

తైవాన్ కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌టీసీ హెచ్‌టీసీ యు పేరుతో మరో డివైస్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది.

తైవాన్  కన్జ్యూమర్‌  ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌టీసీ  మరికొత్త స్మార్ట్‌ఫోన్‌ తీసుకురాబోతోంది.   ఐఫోన్ 7ను మించి   ఆకట్టుకుంటున్న  హెచ్‌టీసీ  హెచ్‌టీసీ  యు  పేరుతో మరో డివైస్‌ ను మార్కెట్లో ప్రవేశపెట్టబోతోంది. స్క్వీజ్‌ ఫర్‌ ద బ్రిలియంట్‌ యూ  అనే ట్యాగ్‌ లైన్‌తోమే 16 వ తేదీన లాంచ్‌ చేయనుంది.  హెచ్‌టీసీ యూని అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు హెచ్‌టీసీ ప్రకటించింది. తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో  స్క్వీజ్‌ ఫర్‌ ద బ్రిలియంట్‌ యూ అని ట్వీట్ చేసింది.  ధర, ఇతర ఫీచర్లను  మాత్రం  వెల్లడించలేదు.
అయితే  హెచ్‌టీసీ యు ని స్క్వీజబుల్‌ టచ్-సెన్సిటివ్ ఫ్రేమ్ తో  రూపొందించారట. సరికొత్తగా జోడించిన ‘ఎడ్జ్ సెన్స్'    ఫీచర్‌ ప్రధాన ఆకర్షణ గా నిలవనుందని ఇటీవలి నివేదికలు వెల్లడించాయి.  మరోవైపు ఇటీవల హెచ్‌టీసీ యు ఆల్ట్రా పేరుతో  కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్టు కంపెనీ ఈ నెలలో ప్రకటించింది. దీని ధరను  రూ. 59,990గా ప్రకటించిన సంగతి తెలిసిందే.

 
హెచ్‌టీసీ యు
5.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ ప్లే
స్నాప్‌ డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌,
ఆండ్రాయిడ్‌ నోగట్‌ 7.1ఆపరేటింగ్ సిస్టమ్‌
2560 x 1440 రిజల్యూషన్
‌4జీబీ ర్యామ్
64 జీబీ ఇంటర్నెల్‌  స్టోరేజ్‌
12 ఎంపీరియర్‌ కెమెరా,
16ఎంపీ ఫ్రంట్  కెమెరా
 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

 

 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement