హెచ్‌టీసీ..కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన హెచ్‌టీసీ కంపెనీ శుక్రవారం రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు- డిజైర్ 616, హెచ్‌టీసీ వన్ ఈ8లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే హెచ్‌టీసీ వన్ ఈ8లో 5 అంగుళాల స్క్రీన్, డ్యుయల్ సిమ్(నానో), 2.5 గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,600 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని , ధర రూ. 34,990 అని పేర్కొన్నారు.
ఇక డ్యుయల్ సిమ్ హెచ్‌టీసీ డిజైర్ 616లో 5 అంగుళాల స్క్రీన్, 1.4 గిగాహెట్జ్ ఆక్టకోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని, ధర రూ.16,900 అని పేర్కొన్నారు.
మూడు రెట్లవుతున్న అమ్మకాలు
దక్షిణాసియా దేశాల్లో భారత్ తమకు రెండో ముఖ్యమైన దేశమని హెచ్‌టీసీ సౌత్ ఏషియా ప్రెసిడెంట్ జాక్ యంగ్ చెప్పారు. ఏ నెలకా నెల తమ అమ్మకాలు మూడు రెట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. భారత మార్కెట్లో అపార అవకాశాలున్నాయని, అందుకని ఇతర దేశాల కంటే ముందుగానే కొత్త మొబైళ్లను ఇక్కడే విడుదల చేస్తున్నామని వివరించారు. భారత్‌లో తమకు 4-6 శాతం మార్కెట్ వాటా ఉందని పరిశ్రమ నివేదికలు వెల్లడిస్తున్నాయని, దీనిని 15 శాతానికి పెంచుకోవడం లక్ష్యమని హెచ్‌టీసీ ఇండియా హెడ్ ఫైసల్ సిద్దిఖి చెప్పారు. సేల్స్ పాయింట్లను, సర్వీస్ సెంటర్లను పెంచామని, అమ్మకాలు పెరిగాయని వివరించారు.