
సాక్షి, న్యూఢిల్లీ: తైవాన్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ హెచ్‌టీసీ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ డివైస్‌ను లాంచ్ చేసింది. హెచ్‌టీసీ యు 11ప్లస్ పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్ ఎడ్జ్ టు ఎడ్జ్ టు డిస్‌ప్లే తో తన తొలి స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రేపటినుంచి (ఫిబ్రవరి 7) ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి ప్రత్యేకంగా లభ్యం కానుంది. ప్రస్తుతానికి సిల్వర్‌కలర్ వేరియంట్‌మాత్రమే అందుబాటులో ఉంటుంది. త్వరలోనే సెరామిక్ బ్లాక్ కలర్‌లో కూడా అందుబాటులోఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇక దీని ధర 56,990 రూపాయలుగా ఉండనుంది. 4జీబీ, 6జీబీ వేరియంట్లలో దీన్ని లాంచ్ చేసింది.
హెచ్‌టీసీ యు 11ప్లస్ ఫీచర్లు
6 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ సూపర్ ఎల్‌సీడీ డిస్‌ప్లే
1440x2880 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ 8.0 ఓరియో
4జీబీ ర్యామ్/64జీబీ స్టోరేజ్
6జీబీ /128జీబీ స్టోరేజ్
12 ఎంపీ అల్ట్రా మెగా పిక్సెల్ కెమెరా విత్ ఆటో ఫోకస్
8ఎంపీ సెల్పీ కెమెరా
3930 ఎంఏహెచ్ బ్యాటరీ
Even More Squeezed Into A Slimmer, Stunning Phone. HTC U11 plus Launching tomorrow exclusively on FlipKart. #HTCU11plus pic.twitter.com/FhHnjNJtQ1
— HTC India (@HTC_IN) February 6, 2018