
హానర్ ఇండియా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. హానర్ వి(వ్యూ) 10పేరుతోమ దీన్ని గురువారం విడుదల చేసింది. అమెజాన్ ఇండియాద్వారా జనవరి 8నుంచి విక్రయాలు మొదలుకానున్నాయి. దీనికి సంబంధించి వినియోగదారుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ఈరోజునుంచి ప్రారంభించింది. దీని ధరను రూ.29,999గా కంపెనీ నిర్ణయించింది.
భారత్ మార్కెట్లో కంపెనీ నిబద్ధతను అనుసరిస్తూ, గ్లోబల్ వేరియంట్ కన్నా తక్కువ ధరకే అందిస్తున్నామని హానర్ ఇండియా-కన్జ్యూమర్ బిజినెస్ గ్రూప్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ పి సంజీవ్ చెప్పారు.
హానర్ వి 10 ఫీచర్లు
5.99-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే(18: 9 రేషియో)
1080x2160 పిక్సెల్స్ రిజల్యూషన్
ఆండ్రాయిడ్ ఓరియో 8.0
6జీబీ ర్యామ్
128 జీబీ స్టోరేజ్
256జీబీ వరకు విస్తరించుకునే అవకాశం
16 మెగాపిక్సెల్ ఆర్‌జీబీ సెన్సా, 20 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్,
13మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా విత్ f / 1.8 ఎపర్చరు
3750 ఎంఏహెచ్ బ్యాటరీ
Comments
Please login to add a commentAdd a comment