గూగుల్ నెక్సస్ స్మార్ట్ఫోన్ల తయారీలో ప్రస్తుతం హెచ్టీసీ నిమగ్నమై ఉన్నట్టు కొత్త ఎఫ్సీసీ డాక్యుమెంట్లో కంపెనీ ధృవీకరించింది. ప్రొడక్ట్ ఫైనల్ వెర్షన్ను ఆవిష్కరించిన తర్వాత ఆ ప్రొడక్ట్ కమర్షియల్గా గూగుల్ వెబ్సైట్లోనే అందుబాటులో ఉంటుందని హెచ్టీసీ కార్పొరేషన్ ప్రాజెక్టు మేనేజర్ సీన్ షిహ్ తెలిపారు. గూగుల్ తన నెక్సస్ స్మార్ట్ఫోన్ల తయారీకి హెచ్టీసీతో భాగస్వామ్యం ఏర్పరుచుకుందని ముందస్తు రిపోర్టులు వెల్లడించాయి. ఈ రిపోర్టులను ధృవీకరిస్తూ హెచ్టీసీ సైతం గూగుల్ ఫోన్ల తయారీలో సహకారం చేస్తున్నట్టు వెల్లడించింది.
ఆండ్రాయిడ్ తాజా వెర్షన్ 7.0 నోగట్తో పనిచేసేలా రెండు కొత్త నెక్సస్ స్మార్ట్ఫోన్లను తయారీచేస్తున్నామని హెచ్టీసీ రిపోర్టు చేసింది. ఆ డివైజ్ల కోడ్ నేమ్గా మార్లిన్, సెయిల్ఫిష్గా పేర్కొంది. ఈ రిపోర్టులతో గూగుల్ త్వరలోనే తన సొంత స్మార్ట్ఫోన్లను భారత్తో పాటు, ఇతర మార్కెట్లలో ఆవిష్కరించబోతుందని తెలుస్తోంది. అయితే ఈ డివైజ్ల వివరాలు పూర్తిగా తెలియరాలేదు. ఇప్పటికే వెలువడిన రిపోర్టుల ప్రకారం యాపిల్ ఐఫోన్, శాంసంగ్ గెలాక్సీ వంటి టాప్ ఎండ్ సీరిస్ల మాదిరిగా గూగుల్ ఫోన్ కూడా మార్కెట్లను ఏలేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది.
గూగుల్ నెక్సస్ డివైజ్లు సెయిల్ఫిష్, మార్లిన్లు సెప్టెంబర్-అక్టోబర్లో వినియోగదారుల ముందుకు రాబోతున్నాయట. ఈ ఫోన్లలోని రింగ్టోన్స్, నోటిఫికేషన్ సౌండ్లు తాజాగా ఆన్లైన్లో విడుదల చేశారు. మార్లిన్.. రెండు నెక్సస్ డివైజ్ల ఫ్లాగ్షిప్. 5.5 అంగుళాల క్వాడ్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 821 చిప్సెట్, 4 జీబీ ర్యామ్, 128 జీబీ విస్తరణ మెమరీ, హెచ్టీసీ డిజైన్తో సమానమైన డిజైన్, 3450 ఎంఏహెచ్, ఫింగర్ప్రింట్ స్కానర్ విత్ నెక్సస్ ఇంప్రింట్ సపోర్టు వంటి ప్రత్యేకతలను కలిగి ఉన్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
సెయిల్ఫిష్ డివైజ్... స్నాప్డ్రాగన్ 820 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నెల్ స్టోరేజ్తో రాబోతుందని తెలుస్తోంది. జీఎఫ్ఎక్స్ బెంచ్ మార్క్స్ రిపోర్టు ప్రకారం ఈ డివైజ్కు 11 ఎంపీ వెనుక కెమెరా, 4 కే వీడియో రిపోర్టింగ్, 7 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుందని వెల్లడవుతోంది. కానీ మరో రిపోర్టు అంటుటు మాత్రం సెయిల్ఫిష్కు 13 ఎంపీ వెనుక కెమెరా, 8 ఎంపీ ముందు కెమెరా ఉంటుందని చెబుతోంది.