హెచ్టీసీ ఫోన్పై 7 వేలు ధర తగ్గింపు | HTC U Ultra, Desire 10 Pro Price Cut in India | Sakshi
Sakshi News home page

హెచ్టీసీ ఫోన్పై 7 వేలు ధర తగ్గింపు

Published Tue, Apr 11 2017 8:33 AM | Last Updated on Sat, Jul 6 2019 3:18 PM

హెచ్టీసీ ఫోన్పై 7 వేలు ధర తగ్గింపు - Sakshi

హెచ్టీసీ ఫోన్పై 7 వేలు ధర తగ్గింపు

న్యూఢిల్లీ : లాంచ్ అయిన నెలల్లోపే తన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ధరను హెచ్టీసీ తగ్గించేసింది. ఐఫోన్ 7 కంటే మించిన ధరల్లో గత నెల హెచ్టీసీ యు ఆల్ట్రా స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. లాంచింగ్ సమయంలో 59,990గా దీని ధరను, కేవలం ఒకే ఒక్క నెలల్లోనే  7వేల రూపాయలు తగ్గించేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ 52,990లకే అందుబాటులో ఉండనున్నట్టు తెలిపింది.  అదేవిధంగా గతేడాది నవంబర్ లో తీసుకొచ్చిన మరో స్మార్ట్ ఫోన్ హెచ్టీసీ డిజైర్ 10 ప్రొ ధరను కూడా తగ్గించినట్టు కంపెనీ ప్రకటించింది. ఈ ఫోన్ పై 2500 ధరను తగ్గిస్తూ 23,990కే అందుబాటులో ఉంచుతున్నామని కంపెనీ తెలిపింది.  ఈ ఫోన్ ధర కూడా లాంచింగ్ సమయంలో 26,490గా ఉంది. ఈ రెండు డివైజ్ లు ప్రస్తుతం హెచ్టీసీ ఇండియా స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి. 
 
కాగ హెచ్టీసీ యు ఆల్ట్రాలో ప్రత్యేక ఆకర్షణ దాని సెన్సు కంపానియన్ ఫీచర్. ఎంతో ముఖ్యమైన అలర్ట్ లను, నోటిఫికేషన్లు రెండో ''టిక్కర్ స్టైల్'' డిస్ ప్లేలో చూసుకునేందుకు ఇది ఉపయోగపడుతోంది. అంటే ఎల్జీ వీ20 మాదిరిగా ఈ ఫోన్ కు కూడా రెండు డిస్ ప్లేలు ఉంటాయన్నమాట. ఆండ్రాయిడ్ 7.0 నోగట్ తో పనిచేసే ఈ స్మార్ట్ ఫోన్ 5.7 అంగుళాల క్యూహెచ్డీ సూపర్ ఎల్సీడీ డిస్ ప్లేను కలిగి ఉంటుంది. దీనికి ఉండే రెండో డిస్ ప్లే 2 అంగుళాలు. క్వాడ్ కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 821 చిప్ సెట్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్, 2టీబీ వరకు విస్తరణ మెమరీ, 12 ఆల్ట్రా పిక్సెల్ రియర్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 4జీ ఎల్టీఈ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4మైక్రోఫోన్లతో 3డీ ఆడియో రికార్డింగ్ సపోర్టు దీనిలో మిగతా ఫీచర్స్.   
 
ఇక హెచ్టీసీ డిజైర్ 10 ప్రొ విషయానికి వస్తే, డ్యూయల్ సిమ్ సపోర్టు కలిగి ఉన్న ఈ ఫోన్ , ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో రన్ అవుతుంది. 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 1.8గిగాహెడ్జ్ ఆక్టా-కోర్ మీడియా టెక్ హిలియో పీ10 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్బిల్ట్ స్టోరేజ్, 2టీబీ వరకు విస్తరణ మెమరీ, 20ఎంపీ రియర్ కెమెరా, 13ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ ఎల్టీఈ,3000ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్ లను ఈ ఫోన్ కలిగి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement