హెచ్‌టీసీ యూ అల్ట్రా విక్రయాలు ప్రారంభం | HTC U Ultra on sale in India, priced at Rs 59990: Specifications, features | Sakshi

హెచ్‌టీసీ యూ అల్ట్రా విక్రయాలు ప్రారంభం

Published Tue, Mar 7 2017 2:14 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM

హెచ్‌టీసీ యూ అల్ట్రా విక్రయాలు ప్రారంభం

హెచ్‌టీసీ యూ అల్ట్రా విక్రయాలు ప్రారంభం

ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌టీసీ రూపొం దించిన యూ అల్ట్రా మోడల్‌ విక్రయాలు ప్రారంభం అయ్యాయి.

ధర రూ.59,990
హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌టీసీ రూపొం దించిన యూ అల్ట్రా మోడల్‌ విక్రయాలు ప్రారంభం అయ్యాయి. మొబైల్స్‌ రిటైల్‌ విక్రయంలో ఉన్న టెక్నోవిజన్‌ సోమవారమిక్కడ ప్రత్యేక కార్యక్రమంలో హెచ్‌టీసీ ప్రతి నిధుల సమక్షంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 5.7 అంగుళాల క్యూహెచ్‌డీ సూపర్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేతోపాటు అలర్ట్స్, నోటిఫికేషన్లు చూపించేందుకు 2 అంగుళాల టిక్కర్‌ స్టైల్‌ సెకండరీ డిస్‌ప్లే దీని ప్రత్యేకత. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్‌ మెమరీ, గొరిల్లా గ్లాస్, 12 అల్ట్రా పిక్సెల్‌ కెమెరా, 16 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా, 3000 ఎంఏహెచ్‌ బ్యాటరీ దీనికి పొందుపరిచారు. ధర రూ.59,990 ఉంది.

విస్తరణలో టెక్నోవిజన్‌..
టెక్నోవిజన్‌కు ప్రస్తుతం హైదరాబాద్‌లో 7 స్టోర్లు ఉన్నాయి. 2018 డిసెంబరుకల్లా మరో 13 ఔట్‌లెట్లు ప్రారంభిస్తామని కంపెనీ మేనేజింగ్‌ పార్టనర్‌ మొహమ్మద్‌ సికిందర్‌ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘ధర విషయంలో ఆన్‌లైన్‌ కంపెనీల దూకుడుతో విస్తరణ ప్రణాళికను రెండేళ్లుగా వాయిదా వేశాం. ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే ధరలెక్కువగా ఉన్నాయి. రిటైల్‌ దుకాణాలకు కస్టమర్ల రాక గణనీయంగా పెరిగింది. 4జీ రాకతో బేసిక్‌ ఫోన్‌ వినియోగదార్లు ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ల వైపుకు మళ్లుతున్నారు. రానున్న రోజుల్లో ఈ రంగంలో అనూహ్య మార్పులుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇతర నగరాలకూ విస్తరిస్తాం’ అని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement