టాప్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ‘ఐఫోన్‌ 5ఎస్‌’ | Apple iPhone 5S tops the list of premium smartphones in India | Sakshi
Sakshi News home page

టాప్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ‘ఐఫోన్‌ 5ఎస్‌’

Published Thu, May 11 2017 3:17 AM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM

టాప్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ‘ఐఫోన్‌ 5ఎస్‌’

టాప్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌.. ‘ఐఫోన్‌ 5ఎస్‌’

న్యూఢిల్లీ: భారత్‌లో టాప్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్‌ ‘ఐఫోన్‌ 5ఎస్‌’ అవతరించింది. ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, మహరాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఐఫోన్‌–5ఎస్‌ టాప్‌ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా కొనసాగుతోంది. దీని తర్వాతి స్థానాన్ని ఐఫోన్‌ 6 కైవసం చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌ను మినహాయిస్తే శాంసంగ్‌ ఎస్‌4 మిని ఫోన్‌ ప్రీమియం కేటగిరిలో రెండో అత్యంత ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌గా ఉంది.

ఢిల్లీ, గుజరాత్‌లో ఐఫోన్‌ 7 ఐదో స్థానాన్ని దక్కించుకుంది. కర్నాటకలో వన్‌ప్లస్‌ 3టీ 4వ స్థానంలో నిలిచింది. మొబిలిటిక్స్‌ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్‌ 3టీ అతి తక్కువ కాలంలో టాప్‌–5లో స్థానం దక్కించుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని నివేదిక పేర్కొంటోంది. ఓపో, వివో బ్రాండ్‌ విక్రయాలు కూడా బాగున్నాయని కానీ జాబితాలో స్థానంలో పొందలేకపోయాయని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement