ఆ ఐఫోన్ ధర కేవలం రూ.1,699
ఆ ఐఫోన్ ధర కేవలం రూ.1,699
Published Sat, Sep 16 2017 7:55 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
కొత్త ఐఫోన్ల లాంచింగ్‌తో పాటు పాత ఐఫోన్ల ధరలన్నీ కిందకి దిగొచ్చిన సంగతి తెలిసిందే. పాత ఐఫోన్లపై ఆపిల్ భారీగా ధరలు తగ్గించింది. ఆపిల్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ కూడా పాత ఐఫోన్లపై బాగానే ధరల తగ్గింపును చేపట్టింది. అయితే ఈ తగ్గింపును ఎక్స్చేంజ్‌లో అందిస్తోంది. తాజాగా ఐఫోన్ 5ఎస్‌ను కేవలం రూ.1,699కే అందుబాటులోకి తీసుకొచ్చింది. అసలు ఈ ఐఫోన్ 5ఎస్ ధర 25వేల రూపాయలు. 32 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ 16,999 రూపాయలకు లిస్టు అయింది. అంతేకాక ఈ ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో కొనుగోలు చేస్తే, 15,300 రూపాయల వరకు తగ్గింపు అందిస్తోంది. అంటే చివరకు ఈ ఫోన్ రూ.1,699కు అందుబాటులో ఉంది.
అయితే ఈ ఫోన్‌నూ ఏదైనా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌తో ఎక్స్చేంజ్ చేసుకోవాలట. అచ్చం ఇలాంటి ఆఫర్‌నే ఐఫోన్ 6, ఐఫోన్ 6 ఎస్ స్మార్ట్‌ఫోన్లపై కూడా ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. రూ.25,999 రూపాయలు కలిగిన ఐఫోన్ 6ను ఎక్స్చేంజ్‌లో కొనుగోలు చేస్తే, 20వేల రూపాయల వరకు తగ్గింపును ఇస్తోంది. దీంతో ఈ ఫోన్ కూడా రూ.5,999కే అందుబాటులోకి వచ్చింది. కానీ ఏదైనా ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌తో వీటిని ఎక్స్చేంజ్ చేసుకోవడమే కాస్త హాస్యాస్పందంగా ఉందని పలువురంటున్నారు.
Advertisement
Advertisement