![Massive offer Apple most popular iPhone11 Flipkart check details - Sakshi](/styles/webp/s3/article_images/2022/11/7/Iphone11.jpg.webp?itok=RoPi6ycM)
సాక్షి,ముంబై: యాపిల్ పాపులర్ ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలనేవారికి మంచి అవకాశం. యాపిల్ ఐఫోన్ 11 ఇపుడు భారీ తగ్గింపులో అందుబాటులో ఉంది. అత్యంత జనాదరణ పొందిన, ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11పై 40వేల రూపాయల దాగా డిస్కౌంట్ లభిస్తోంది. ముఖ్యంగా ఎక్స్చేంజ్ ఆఫర్ 17,500 వరకు తగ్గింపుతో రూ. 23,490లకే కొనుగోలు చేయవచ్చు. దీనితో పాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై 5శాతం తగ్గింపును అదనం.
ఫ్లిప్‌కార్ట్‌లో 64జీబీ స్టోరేజ్ బేస్ మోడల్ దాదాపు రూ.40,999 తగ్గింపు ధరతో అందుబాటులో ఉంది. యాపిల్ ఐఫోన్ 11 సిరీస్ 2019లో భారతదేశంలో రూ.64,900 ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఈ సిరీస్‌లో ఐఫోన్11 ప్రొ, ప్రొమాక్స్‌ను తీసుకొచ్చిన సంగతి తె లిసిందే. 2020లో అత్యధికంగా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 11. అయితే ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తరువాత కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను నిలిపివేసింది. (ఐఫోన్ 14 కొనుగోలు చేశారా? తాజా వార్నింగ్ ఏంటో తెలుసా?)
ఐఫోన్ 11 స్పెసిఫికేషన్స్: 6.1-అంగుళాల లిక్విడ్ రెటినా HD డిస్‌ప్లే, 1792 x 828 పిక్సెల్స్‌రిజల్యూషన్, A13 బయోనిక్ చిప్‌సెట్, 12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా, 12 ఎంపీ సెల్ఫీ కెమెరా ప్రధానంగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment