Premium smartphones
-
5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుదారులకు బంపరాఫర్
చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్మీ 5జీ స్మార్ట్ ఫోన్లపై బంపరాఫర్ ప్రకటించింది. ఆ సంస్థకు చెందిన ప్రీమియం ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందిస్తున్నట్లు తెలిపింది. రియల్మీ అక్టోబర్ 26 నుంచి అక్టోబర్ 31వరకు ‘రియల్మీ ఫెస్టివ్ డేస్ సేల్’ పేరుతో ప్రత్యేకంగా అమ్మకాలు జరపనుంది. అయితే ఈ సేల్ నిర్వహణకు ముందే రియల్మీ జీటీ 2 ప్రో ఫోన్లపై రూ.5వేల డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. 8జీబీ ర్యామ్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఫోన్ ధర రూ.49,999 ఉండగా రూ.44,999కే పొందవచ్చు. ఇక ఐసిఐసిఐ క్రెడిట్ కార్డుతో కొనుగోలుపై అదనంగా రూ.3వేల డిస్కౌంట్ పొందవచ్చు. ఈ ఆఫర్ అక్టోబర్ 16తో ముగియనుంది. రియల్మీ జీటీ 2 ప్రో ఫీచర్లు,స్పెసిఫికేషన్లు రియల్మీ సంస్థ 5000ఏఎంహెచ్ బ్యాటరీ, 1440*3216 పిక్సెల్స్ రెజెల్యూషన్‌తో 6.7 అంగుళాల 2కే ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లేతో రియల్మీ జీటీ 2 ప్రోను తయారు చేసింది. 120హెచ్‌జెడ్ రిఫ్రెష్‌రేటుతో డిస్ప్లే, ఫోన్ సురక్షితంగా ఉండేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్ ప్రొటెక్షన్ తో 12జీబీ ర్యామ్,256 జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంది. అంతేకాదు ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 చిప్ సెట్, ప్రపంచంలోనే తొలి బయోపాలిమర్ డిజైన్‌తో మార్కెట్‌కు పరిచయం చేసినట్లు రియల్మీ ప్రతినిధులు తెలిపారు. రియల్మీ జీటీ 2 ప్రోలో 3 కెమెరాలతో వస్తుండగా ఫోటోలు తీసేందుకు అనువుగా ఈ ఫోన్ వెనుక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్, ఓఐఎస్ సపోర్ట్‌తో 50 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 50 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీలు దిగేందుకు 2 మెగా పిక్సెల్ మ్యాక్రో కెమెరా, 32 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాలున్నాయి. వీటితో పాటు డిస్ప్లేలో ఫింగర్ ప్రింట్ సెన్సార్లు, ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 65డబ్ల్యూ సూపర్ డార్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ సౌకర్యం ఉంది. రియల్మీ యూఐ 3.0 ఆండ్రాయిడ్ 12 సపోర్ట్‌తో 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై6, బ్లూటూత్ 5.2,జీపీఎస్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ - సీ పోర్ట్ సౌకర్యం ఉంది. చదవండి👉 ఐఫోన్ కోసం దుబాయ్ వెళ్లాడు..కానీ చివరికి -
దాని దూకుడు ముందు శాంసంగ్, ఆపిల్ ఔట్
న్యూఢిల్లీ : ఇన్ని రోజుల భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్(రూ.30,000 ప్లస్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్)లో టాప్ లీడర్లు ఎవరూ అంటే.. దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్, అమెరికా టెక్ దిగ్గజం ఆపిల్ పేర్లే చెప్పేవారు. కానీ ఈ రెండు కంపెనీలను వెనక్కి నెట్టేసి, భారత ప్రీమియం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త లీడర్ దూసుకొచ్చింది. అదే చైనీస్‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్‌ప్లస్. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తాజాగా వెల్లడించిన రిపోర్టులో ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్లో శాంసంగ్, ఆపిల్‌ను మించిపోయి వన్‌ప్లస్ లీడ్‌లోకి వచ్చినట్టు తెలిసింది. మొట్టమొదటిసారి వన్‌ప్లస్ కంపెనీ ఈ చోటును దక్కించుకున్నట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. 2018 రెండో క్వార్టర్లో 40 శాతం మార్కెట్ షేరుతో వన్‌ప్లస్ ఈ స్థానాన్ని సంపాదించుకుంది. ఈ కంపెనీ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 6 బలమైన అమ్మకాలు.. వన్‌ప్లస్‌ను టాప్ స్థానంలో నిలబెట్టడానికి దోహదం చేశాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. వన్‌ప్లస్ 6 రికార్డు షిప్మెంట్లను నమోదు చేసినట్టు తెలిపింది. అయితే దిగ్గజ కంపెనీలైన ఆపిల్, శాంసంగ్ షిప్మెంట్లు ఏడాది ఏడాదికి కిందకి పడిపోయినట్టు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వెల్లడించింది. 34 శాతం షేరుతో శాంసంగ్ ఈ సెగ్మెంట్లో రెండో స్థానంలో నిలిచింది. గతేడాది లాంచ్ చేసిన గెలాక్సీ ఎస్8 కంటే, గెలాక్సీ ఎస్9 షిప్మెంట్లు 25 శాతం పడిపోయాయి. షిప్మెంట్లు పడిపోయినప్పటికీ, ఫ్లాగ్షిప్ గెలాక్సీ ఎస్9 సిరీస్ ప్రమోషన్లు బలంగానే ఉన్నాయని కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ తెలిపింది. మరోవైపు ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్ లకు డిమాండ్ ఈ క్వార్టర్లో ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, ఆపిల్ మార్కెట్ షేరు భారీగా పడిపోయింది. కేంద్రం డ్యూటీలను పెంచడంతో, ఆపిల్ కూడా తన ప్రొడక్ట్‌లపై ధరలను పెంచింది. దీంతో ఐఫోన్ 8, ఐఫోన్ ఎక్స్ సిరీస్ షిప్మెంట్లు క్షీణించాయి. ఇదే సమయంలో కంపెనీ మార్కెట్ షేరు కూడా ప్రీమియం సెగ్మెంట్లో భారీగా పడిపోయి కేవలం 14 శాతం మాత్రమే నమోదైంది. అయితే మొత్తంగా ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ ఈ క్వార్టర్లో వార్షికంగా 19 శాతం పెరిగింది. ఈ సెగ్మెంట్లోకి హువావే(పీ20), వివో(ఎక్స్21), నోకియా హెచ్ఎండీ(నోకియా 8 సిరోకో), ఎల్జీ(వీ30 ప్లస్) స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు కొత్తగా వచ్చి చేరాయి. శాంసంగ్, వన్‌ప్లస్, ఆపిల్ టాప్-3 బ్రాండ్లు మొత్తం మార్కెట్ షేరు 88 శాతంగా ఉంది. ఇది ముందు క్వార్టర్లో 95 శాతంగా నమోదైంది. -
టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్.. ‘ఐఫోన్ 5ఎస్’
న్యూఢిల్లీ: భారత్‌లో టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా యాపిల్ ‘ఐఫోన్ 5ఎస్’ అవతరించింది. ఢిల్లీ, గుజరాత్, కర్నాటక, మహరాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలో ఐఫోన్–5ఎస్ టాప్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌గా కొనసాగుతోంది. దీని తర్వాతి స్థానాన్ని ఐఫోన్ 6 కైవసం చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌ను మినహాయిస్తే శాంసంగ్ ఎస్4 మిని ఫోన్ ప్రీమియం కేటగిరిలో రెండో అత్యంత ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌గా ఉంది. ఢిల్లీ, గుజరాత్లో ఐఫోన్ 7 ఐదో స్థానాన్ని దక్కించుకుంది. కర్నాటకలో వన్‌ప్లస్ 3టీ 4వ స్థానంలో నిలిచింది. మొబిలిటిక్స్ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ 3టీ అతి తక్కువ కాలంలో టాప్–5లో స్థానం దక్కించుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని నివేదిక పేర్కొంటోంది. ఓపో, వివో బ్రాండ్ విక్రయాలు కూడా బాగున్నాయని కానీ జాబితాలో స్థానంలో పొందలేకపోయాయని తెలిపింది. -
హెచ్‌టీసీ యూ అల్ట్రా విక్రయాలు ప్రారంభం
-
హెచ్‌టీసీ యూ అల్ట్రా విక్రయాలు ప్రారంభం
ధర రూ.59,990 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రీమియం స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ హెచ్‌టీసీ రూపొం దించిన యూ అల్ట్రా మోడల్ విక్రయాలు ప్రారంభం అయ్యాయి. మొబైల్స్ రిటైల్ విక్రయంలో ఉన్న టెక్నోవిజన్ సోమవారమిక్కడ ప్రత్యేక కార్యక్రమంలో హెచ్‌టీసీ ప్రతి నిధుల సమక్షంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. 5.7 అంగుళాల క్యూహెచ్డీ సూపర్ ఎల్సీడీ డిస్‌ప్లేతోపాటు అలర్ట్స్, నోటిఫికేషన్లు చూపించేందుకు 2 అంగుళాల టిక్కర్ స్టైల్ సెకండరీ డిస్ప్లే దీని ప్రత్యేకత. 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, గొరిల్లా గ్లాస్, 12 అల్ట్రా పిక్సెల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ దీనికి పొందుపరిచారు. ధర రూ.59,990 ఉంది. విస్తరణలో టెక్నోవిజన్.. టెక్నోవిజన్కు ప్రస్తుతం హైదరాబాద్‌లో 7 స్టోర్లు ఉన్నాయి. 2018 డిసెంబరుకల్లా మరో 13 ఔట్లెట్లు ప్రారంభిస్తామని కంపెనీ మేనేజింగ్ పార్టనర్ మొహమ్మద్ సికిందర్ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ‘ధర విషయంలో ఆన్లైన్ కంపెనీల దూకుడుతో విస్తరణ ప్రణాళికను రెండేళ్లుగా వాయిదా వేశాం. ఇప్పుడు ఆన్లైన్లోనే ధరలెక్కువగా ఉన్నాయి. రిటైల్ దుకాణాలకు కస్టమర్ల రాక గణనీయంగా పెరిగింది. 4జీ రాకతో బేసిక్ ఫోన్ వినియోగదార్లు ఇప్పుడు స్మార్ట్ఫోన్ల వైపుకు మళ్లుతున్నారు. రానున్న రోజుల్లో ఈ రంగంలో అనూహ్య మార్పులుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇతర నగరాలకూ విస్తరిస్తాం’ అని వివరించారు.