హెచ్టీసీ 10 లాంచింగ్ నేడే | HTC 10 India launch today: Key specs, features and more | Sakshi
Sakshi News home page

హెచ్టీసీ 10 లాంచింగ్ నేడే

Published Thu, May 26 2016 10:36 AM | Last Updated on Mon, Sep 4 2017 12:59 AM

HTC 10 India launch today: Key specs, features and more

హెచ్ టీసీ 10 స్మార్ట్ ఫోన్  భారత మార్కెట్లో గురువారం లాంచ్ కానుంది.  మెరుగైన హెచ్ టీసీ సెన్స్ 8 స్కిన్ , ఆండ్రాయిడ్  6 వెర్షన్ లో వస్తున్న సరికొత్త స్మార్ట్ ఫోన్ ఈ రోజు మన ముందుకు రాబోతోంది.  ఇప్పటికే మార్కెట్లోకి  లీకైన సంచలనంగా మారి, ఇపుడు విడుదల కాబోతున్న హెచ్ టీసీ 10 ఫీచర్స్  లో  బూమ్ సౌండ్ టెక్నాలజీ  ఆసక్తికరంగా  మారింది.
 
 స్పెసిఫికేషన్స్
 5.2 అంగుళాల 2కె డిస్ ప్లే  820  క్వాల్కం  స్నాప్ డ్రాగన్  ప్రాసెసర్
 1440x2560 ఫిక్సల్స్
4జీబీ రామ్ . 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.
12 మెగాఫిక్సెల్, అల్ట్రా మెగా ఫిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్

5 మెగాఫిక్సె ల్ ఫ్రంట్ కెమెరా
 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

 టైప్ సీ యూఎస్బీ పోర్టు దీని ప్రత్యేకతగా నిలుస్తోంది. ఛార్జింగ్ ను, డేటా ఎక్సేంజ్ మార్పిడి లాంటి  కొత్త ఫీచర్లతోపాటు  ఫింగర్ ప్రింట్ స్కానర్   దీనిలో ఉంది.    అటు అరగంటలో అతి త్వరగా దాదాపుసగం   చార్జ్ పూర్తవుతుందని, 27 గంటలు పాటు నిలుస్తుందని కంపెనీ చెబుతోంది.  అయితే దీని ధర అమెరికాలో సుమారు రూ.46,400లు  మరి భారత మార్కెట్లో దీనిఎంతకు నిర్ణయిస్తుందని అనేది మాత్రం సస్సెన్స్.  కాగా ఈ ఫ్లాగ్ షిప్  ఫోన్ కు సంబంధించి గతంలో వీడియో, ఫోటోలు లీకవ్వడంతో  దీనిపై టెక్ ప్రియుల్లో ఉన్న ఆసక్తి నెలకొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement