
ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బజాజ్ త్వరలో దేశీయ మార్కెట్లోకి సీటీ 125 ఎక్స్(CT125X) పేరుతో కొత్త బైక్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ బైక్ ప్రస్తుతం ఉన్న CT110X కమ్యూటర్ బైక్ కంటే ఎత్తు కాస్త ఎక్కువగా ఉండబోతున్నట్లు సమాచారం. సీటీ 110ఎక్స్ తరహాలో రూపొందించిన ఈ బైక్ ఫీచర్ జాబితాను అప్‌డేట్ చేయడంతో పాటు బైక్ ఎక్స్‌టీరియర్‌ని కూడా కొత్త రంగులతో నింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధరను కస్టమర్లకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది బజాబ్.
ప్రత్యేకతలు(అంచనా)
ఇందులో.. టైల్‌లైట్ , టర్న్ ఇండికేటర్‌ల కోసం హాలోజన్ బల్బులు ఉన్నాయి. ట్యాంక్ గ్రిప్ ప్యాడ్‌లు, సీట్ కవర్, లగేజ్ క్యారియర్, అండర్ బెల్లీ ప్రొటెక్టర్ ప్లేట్ వంటివి ఫీచర్లు సాధారణ బైక్‌కు కాస్త భిన్నంగా దీన్ని నిలబెడుతుంది. ఇది కొత్త 125 సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో రాబోతున్నట్లు సమాచారం. మరో ప్రత్యేకత ఏంటంటే సీటీ 125 ఎక్స్ తరహాలో ఉండే ఈ కొత్త బైక్‌లో మొబైల్ చార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. దీంతో మనం బైక్‌పై ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మొబైల్ ఫోన్‌ను చార్జింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ బైక్ సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.
సుదీర్ఘకాలంగా బజాజ్.. 125 సీసీ సెగ్మెంట్ బైక్‌లు విడుదల చేయలేదు. అందుకే ఈ సెగ్మెంట్‌లో పట్టు పెంచుకునేందుకు సీటీ 125 ఎక్స్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం బజాజ్ సీటీ 110 ఎక్స్ ధర రూ.66 వేలు ఉండగా బజాజ్ సీటీ 125ఎక్స్ ధర దీనిపై అదనంగా 10 నుంచి 15 వేలు మధ్యలో ఉండనున్నట్లు సమాచారం.
చదవండి: భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు
Comments
Please login to add a commentAdd a comment