bajaj ct100
-
బజాజ్ సీటీ 125 ఎక్స్.. బోలెడు ఫీచర్లతో పాటు చార్జింగ్ సాకెట్ కూడా!
ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న బజాజ్ త్వరలో దేశీయ మార్కెట్లోకి సీటీ 125 ఎక్స్(CT125X) పేరుతో కొత్త బైక్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ బైక్ ప్రస్తుతం ఉన్న CT110X కమ్యూటర్ బైక్ కంటే ఎత్తు కాస్త ఎక్కువగా ఉండబోతున్నట్లు సమాచారం. సీటీ 110ఎక్స్ తరహాలో రూపొందించిన ఈ బైక్ ఫీచర్ జాబితాను అప్డేట్ చేయడంతో పాటు బైక్ ఎక్స్టీరియర్ని కూడా కొత్త రంగులతో నింపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధరను కస్టమర్లకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది బజాబ్. ప్రత్యేకతలు(అంచనా) ఇందులో.. టైల్లైట్ , టర్న్ ఇండికేటర్ల కోసం హాలోజన్ బల్బులు ఉన్నాయి. ట్యాంక్ గ్రిప్ ప్యాడ్లు, సీట్ కవర్, లగేజ్ క్యారియర్, అండర్ బెల్లీ ప్రొటెక్టర్ ప్లేట్ వంటివి ఫీచర్లు సాధారణ బైక్‌కు కాస్త భిన్నంగా దీన్ని నిలబెడుతుంది. ఇది కొత్త 125 సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో రాబోతున్నట్లు సమాచారం. మరో ప్రత్యేకత ఏంటంటే సీటీ 125 ఎక్స్ తరహాలో ఉండే ఈ కొత్త బైక్‌లో మొబైల్ చార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది. దీంతో మనం బైక్‌పై ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా మొబైల్ ఫోన్‌ను చార్జింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ బైక్ సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులో లేనప్పటికీ త్వరలో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. సుదీర్ఘకాలంగా బజాజ్.. 125 సీసీ సెగ్మెంట్ బైక్‌లు విడుదల చేయలేదు. అందుకే ఈ సెగ్మెంట్లో పట్టు పెంచుకునేందుకు సీటీ 125 ఎక్స్ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం బజాజ్ సీటీ 110 ఎక్స్ ధర రూ.66 వేలు ఉండగా బజాజ్ సీటీ 125ఎక్స్ ధర దీనిపై అదనంగా 10 నుంచి 15 వేలు మధ్యలో ఉండనున్నట్లు సమాచారం. చదవండి: భయమేస్తోంది! చార్జింగ్ పెట్టిన గంటకే పేలిన ఎలక్ట్రికల్ బైకులు -
రూ. 35 వేలకే బైకు.. మైలేజి 90 కిలోమీటర్లు!
బజాజ్ ఆటోమొబైల్స్ సంస్థ మళ్లీ అత్యంత చవకైన బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఉత్పత్తి ఆపేసిన సీటీ100 బైకును మళ్లీ తీసుకొచ్చింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మామూలు స్పోక్స్ ఉన్న బైకు అయితే రూ. 35,034, అల్లాయ్ వీల్స్ అయితే రూ. 38,304 (ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర) చొప్పున నిర్ణయించారు. ఈ మోటార్ సైకిల్‌కు 99.3 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. నాలుగు గేర్లుంటాయి. ఇదే తరహా ఇంజన్ ప్లాటినా, డిస్కవర్ 100 సీసీ బైకులకు కూడా ఉంది. ఈ బైకు లీటరు పెట్రోలుకు 89.5 కిలోమీటర్ల మైలేజి ఇస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించినట్లు చెబుతున్నారు. దీనికి ముందువైపు సంప్రదాయ హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనకవైపు బజాజ్ ఎస్ఎన్ఎస్ సస్పెన్షన్ ఉన్నాయి. దీని ధరను బట్టి చూస్తే చిన్ననగరాల్లో కస్టమర్లను దృష్టిలో పెట్టుకునే బజాజ్ ఆటో సంస్థ ఈ బైకును తీసుకొచ్చిందని నిపుణులు అంటున్నారు. అక్కడ ఎక్కువ మైలేజి ఇచ్చే చవక బైకులకు ఆదరణ బాగుంటుంది.