రూ. 35 వేలకే బైకు.. మైలేజి 90 కిలోమీటర్లు! | the cheapest bike that gives 90kmpl mileage | Sakshi
Sakshi News home page

రూ. 35 వేలకే బైకు.. మైలేజి 90 కిలోమీటర్లు!

Published Thu, Mar 19 2015 4:57 PM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

రూ. 35 వేలకే బైకు.. మైలేజి 90 కిలోమీటర్లు!

రూ. 35 వేలకే బైకు.. మైలేజి 90 కిలోమీటర్లు!

బజాజ్ ఆటోమొబైల్స్ సంస్థ మళ్లీ అత్యంత చవకైన బైకును మార్కెట్లోకి విడుదల చేసింది. దాదాపు తొమ్మిదేళ్ల క్రితం ఉత్పత్తి ఆపేసిన సీటీ100 బైకును మళ్లీ తీసుకొచ్చింది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. మామూలు స్పోక్స్ ఉన్న బైకు అయితే రూ. 35,034, అల్లాయ్ వీల్స్ అయితే రూ. 38,304 (ఢిల్లీలో ఎక్స్ షోరూం ధర) చొప్పున నిర్ణయించారు. ఈ మోటార్ సైకిల్కు 99.3 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. నాలుగు గేర్లుంటాయి. ఇదే తరహా ఇంజన్ ప్లాటినా, డిస్కవర్ 100 సీసీ బైకులకు కూడా ఉంది.

ఈ బైకు లీటరు పెట్రోలుకు 89.5 కిలోమీటర్ల మైలేజి ఇస్తుందని ఏఆర్ఏఐ ధ్రువీకరించినట్లు చెబుతున్నారు. దీనికి ముందువైపు సంప్రదాయ హైడ్రాలిక్ సస్పెన్షన్, వెనకవైపు బజాజ్ ఎస్ఎన్ఎస్ సస్పెన్షన్ ఉన్నాయి. దీని ధరను బట్టి చూస్తే చిన్ననగరాల్లో కస్టమర్లను దృష్టిలో పెట్టుకునే బజాజ్ ఆటో సంస్థ ఈ బైకును తీసుకొచ్చిందని నిపుణులు అంటున్నారు. అక్కడ ఎక్కువ మైలేజి ఇచ్చే చవక బైకులకు ఆదరణ బాగుంటుంది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement