క్రిస్మస్, న్యూయర్‌కు వెల్ కమ్ చెబుతూ పలు దిగ్గజ ఈకామర్స్ సంస్థలు ప్రత్యేక సేల్ నిర్వహిస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు భారీ డిస్కౌంట్‌లు ప్రకటిస్తున్నాయి. ఈ తరుణంలో సౌత్ కొరియా దిగ్గజం శాంసంగ్ ఆయా ఫోన్‌లను భారీ డిస్కౌంట్‌లకే కొనుగోలు దారులు దక్కించుకోవచ్చని తెలిపింది.
ముఖ్యంగా ఫోల్డబుల్ ఫ్లాగ్ షిప్ డివైజ్‌లపై శాంసంగ్ ఆఫర్లు పెట్టింది. గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4 ఫోన్ ధర రూ.1,54,999 ఉండగా రూ.8,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, రూ. 8,000 అప్‌గ్రేడ్ బోనస్‌తో రూ.1,46,999కే కొనుగోలు చేయొచ్చు. అదనంగా, గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 4ని కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ. 34,999 విలువైన గెలాక్సీ వాచ్ 4 క్లాసిక్ బీటీ 46ఎంఎంపై రూ. 2,999 క్యాష్ బ్యాక్ పొందవచ్చు. శాంసంగ్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి అన్ని ఉత్పత్తులపై అదనంగా 10 శాతం క్యాష్ బ్యాక్‌ను సొంతం చేసుకోవచ్చు.
అదేవిధంగా, రూ. 89,999 గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 4పై రూ. 7వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 7వేల అప్‌గ్రేడ్ బోనస్‌తో సహా రూ. 82,999 కే కొనుగోలు చేయొచ్చు. ఈ ఆఫర్లు ప్రముఖ ఈ కామర్స్ సైట్లతో పాటు అన్నీ రిటైల్ స్టోర్‌లలో లభిస్తాయని శాంసంగ్ ప్రతినిధులు వెల్లడించారు.
వీటితో పాటు రూ.1,09,999 ఖరీదైన గెలాక్సీ ఎస్ 22 ఆల్ట్రా పై రూ. 5వేల బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 7వేల అప్‌గ్రేడ్ బోనస్‌తో రూ. 1,02,999కి కొనుగోలు చేయొచ్చు. శాంసంగ్ ఎస్ 22 ఆల్ట్రాని కొనుగోలు చేసే కస్టమర్‌లు రూ.26,999 విలువైన స్మార్ట్ వాచ్ గెలాక్సీ వాచ్ 4 బీటీ 44ఎంఎంను కేవలం రూ.2,999కే పొందవచ్చు.
రూ. 72,999 ధర కలిగిన గెలాక్సీ ఎస్22ని రూ. 54,999 తగ్గింపు ధరతో కొనుగోలు చేయొచ్చు. గెలాక్సీ బడ్స్2ని కేవలం రూ. 2,999కే పొందవచ్చు. రూ.84,999 ధర కలిగిన గెలాక్సీ ఎస్ 22 ప్లస్ రూ. 59,999కే అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ. 15,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్ లేదా రూ. 13,000 అప్‌గ్రేడ్ బోనస్, అలాగే రూ. 10,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్‌లు ఉన్నాయి.
గెలాక్సీ జెడ్ ఫోల్డ్ 3 ని కొనుగోలు చేయాలనుకునే కస్టమర్‌లు రూ. 20,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్‌ని పొందవచ్చు. రూ.26,999 విలువైన గెలాక్సీ వాచ్4 బీటీ 44 ఎంఎం స్మార్ట్ వాచ్‌ను రూ. 2,999కే పొందవచ్చు.
ఇక, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ధర రూ . 84,999 ఉండగా.. ప్రత్యేక సేల్‌లో రూ. 59,999కి అందుబాటులో ఉంటుంది. ఇందులో రూ. 15వేలు ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ. 10,000 అప్‌గ్రేడ్ బోనస్ ఉన్నాయి.గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈని రూ . 39,999 నుండి కొనుగోలు చేయొచ్చు. ఇందులో రూ. 3,000 బ్యాంక్ క్యాష్‌బ్యాక్, రూ. 7,000 ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్, రూ. 10,000 అప్‌గ్రేడ్ బోనస్ ఉన్నాయి. గెలాక్సీ ఎస్ 20 ఎఫ్‌ఈ రూ. 5,000 క్యాష్‌బ్యాక్, రూ. 3,000 అప్‌గ్రేడ్ బోనస్‌తో సహా రూ. 32,999 నుండి అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment