శాంసంగ్‌ మరో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ | Galaxy S20 Samsung  next flagship smartphone Report  | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ మరో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌

Published Thu, Jan 2 2020 12:25 PM | Last Updated on Thu, Jan 2 2020 12:39 PM

 Galaxy S20 Samsung  next flagship smartphone Report  - Sakshi

సియోల్‌ : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం  శాంసంగ్‌  తరువాత తరం గెలాక్సీ ప్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది.  ఫిబ్రవరి 11 న శాన్ఫ్రాన్సిస్కోలో నిర్వహించనున్న కార్యక్రమంలో విడుదల చేయ బోతున్నట్లు సమాచారం. ‘ఎస్ 20’  పేరుతో లాంచ్‌ చేయనుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. కొ ఎస్ 11 కు బదులుగా దీన్ని విడుదల చేసేందుకు యోచిస్తోంది. ఎస్‌ 10కు సంబంధించిన ఒక ఫోటోను టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్  ట్వీట్‌ చేసింది. ఎస్ 11 ఇ, ఎస్ 11 ,ఎస్ 11ప్లస్‌ కు బదులు, గెలాక్సీ ఎస్ 10 సిరీస్‌కు కొనసాగింపుగా  ఎస్ 20, ఎస్ 20 ప్లస్‌, ఎస్ 20 అల్ట్రా సిరీస్‌ను లాంచ్‌  చేయనుందని తెలిపింది.  

స్పెసిఫికేషన్ల  విషయానికి వస్తే  కొన్ని మార్కెట్లలో ఎక్సినోస్ 990  ప్రాసెసర్‌, మెజారిటీ మార్కెట్లలో స్నాప్‌డ్రాగన్ 865 ను  జోడించింది. బేస్‌ వేరియంట్‌గా గెలాక్సీ ఎస్ 20 6.2-అంగుళాల స్క్రీన్‌ను, ఎస్ 20 + 6.7అంగుళాల స్క్రీన్‌ను, గెలాక్సీ 20 అల్ట్రా 6.9 అంగుళాల  డిస్‌ప్లే కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాదు  శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌ 20, ఎస్‌ 20 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్స్‌లో 108 ఎంపీ మెయిన్‌గా, క్వాడ్‌  కెమెరాఫీచర్‌  ప్రధాన ఆకర్షణగా వుండనుంది.  4000, 4400, 5000 ఎంఏహెచ్‌బ్యాటరీని అమర్చినట్టు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement