షావోమి.. దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఈ కంపెనీ పేరు మారుమోగుతోంది. ప్రతి సెగ్మెంట్‌లోనూ ఈ కంపెనీ స్మార్ట్‌ఫోన్లు తమ హవా సాగిస్తున్నాయి. కానీ ఫ్లాగ్‌షిప్‌ల దగ్గరికి వచ్చేసరికి షావోమి తన మార్కును చూపించుకోలేకపోతుంది. ముఖ్యంగా భారత్‌లో హైఎండ్ వేరియంట్ల విషయంలో వన్‌ప్లస్, హువాయ్ నుంచి గట్టి పోటీ, ఈ కంపెనీ తన సత్తాను చాటలేకపోవడం ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లపై షావోమి దృష్టి సారించింది. షావోమి ఎంఐ 7 పేరుతో వచ్చే ఏడాది ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతుంది. బెజెల్-లెస్ డిస్‌ప్లే, డ్యూయల్ కెమెరా సెటప్‌తో ఇది రూపొందుతుంట. ఈ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ ఎక్స్, వన్‌ప్లస్ 5టీకి గట్టిపోటీ ఇవ్వగలదని తెలుస్తోంది.
మైడ్రైవర్స్ రిపోర్టు ప్రకారం వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తారని, క్వాల్‌కామ్ అప్‌కమింగ్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్‌సెట్‌తో రూపొందుతుందని తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 6.01 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లే కూడా ఉంటుందట. 6జీబీ ర్యామ్, 16ఎంపీ సెన్సార్లతో వెనుకవైపు రెండు డ్యూయల్ కెమెరాలు, తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోగ్రఫీ, 3350 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ దీనిలో ఫీచర్లుగా ఉండబోతున్నాయని మైడ్రైవర్స్ రిపోర్టు చేసింది. రిపోర్టు ప్రకారం ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.26,600గా ఉండబోతుందని అంచనా. దేశీయ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్ కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి షావోమికి ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో సహకరిస్తుందని టెక్ వర్గాలంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment