టెరిఫిక్ ఫీచర్స్ తో 'యుటోపియా' స్మార్ట్ ఫోన్ | Micromax launches new-age flagship smartphone YUTOPIA | Sakshi
Sakshi News home page

టెరిఫిక్ ఫీచర్స్ తో 'యుటోపియా' స్మార్ట్ ఫోన్

Published Thu, Dec 17 2015 4:43 PM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

టెరిఫిక్ ఫీచర్స్ తో 'యుటోపియా' స్మార్ట్ ఫోన్

టెరిఫిక్ ఫీచర్స్ తో 'యుటోపియా' స్మార్ట్ ఫోన్

న్యూఢిల్లీ: ప్రముఖ దేశీ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ 'యుటోపియా'ను విడుదల చేసింది. మైక్రోమ్యాక్స్ యూ టెలివెంచర్స్ గురువారం విడుదల చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ను విప్లవాత్మక ఉత్పత్తిగా, ప్రపంచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ గా పేర్కొంది.

ఇందులో 'అరౌండ్ యూ' అనే కొత్త ఆప్షన్ పొందుపరిచామని యూ టెలివెంచర్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. ట్రావెల్, ఫుడ్, ఎంటర్ టైన్ మెంట్ కు సంబంధించిన సమాచారం దీనిద్వారా సులవుగా పొందవచ్చన్నారు. దీంతో వినియోగదారులకు సమయం ఆదా అవుతుందన్నీరు. ఇలాంటి ఫోన్ తేవాలంటే ఇతర కంపెనీలకు కనీసం ఐదేళ్లు పడుతుందని చెప్పారు. ఫింగర్ ప్రింట్ స్కాన్ తో అర సెకను కంటే తక్కువ సమయంలో లాక్ ఓపెనవుతుందని తెలిపారు. అమెజాన్ లో ప్రిబుకింగ్స్ ప్రారంభించారు. ఈనెల 26 నుంచి డెలివరీ చేస్తారు.  

'యుటోపియా' స్పెసిఫికేషన్స్
21 ఎంపీ రియర్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ
5.2 ఇంచ్ షార్ప్‌ డబ్ల్యూక్యూహెచ్ డీ ఐపీఎస్ డిప్లే
810 క్వాల్ కమ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్
4 జీబీ డీడీఆర్ 4 ర్యామ్
32జీబీ మైక్రో ఎస్డీ ఎక్స్ పాన్సన్
5.1 ఆండ్రాయిడ్ లాలిపాప్
ధర రూ. 24,999.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement