చంద్రబాబు స్నేహితుడు, భారతీయ మూలాలున్న సింగపూర్ మాజీ మంత్రి ఎస్ ఈశ్వరన్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పీకల్లోతు అవినీతి ఉచ్చులో చిక్కుకున్న ఈశ్వరన్ జీతంలో కోత విధిస్తున్నట్లు తాజాగా సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈశ్వరన్ అవినీతి, అక్రమాస్తులపై దర్యాప్తు జరుగుతోందని సింగపూర్ ప్రధాని లీసీన్ లూంట్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ఈశ్వరన్ జీతంలో 82 శాతం కోత విధించినట్లు పేర్కొన్నారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎస్ ఈశ్వరన్ జీతం నెలకు 8,500 డాలర్లకు పరిమితం చేసినట్లు తెలిపారు. బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉంటూ అవినీతికి పాల్పడ్డారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేకపోతున్నానని తెలిపారు.
చదవండి: ఇంటిదొంగ – ఈశ్వరన్!
ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వేతనం పొందేవారిలో సింగపూర్ రాజకీయ నాయకులు ముందు వరుసలో ఉంటారు. సింగపూర్ ప్రజా సేవల విభాగం 2023 ఏడాది గణాంకాల ప్రకారం ఒక మంత్రికి జీతభత్యంగా నెలకు 41వేల డాలర్లు(సుమారు రూ.34 లక్షలు) చెల్లిస్తారు. అంటే సంవత్సరానికి 8,20,000 డాలర్లు(సుమారు రూ.6.8 కోట్లు) జీతంగా పొందుతారు.
ఈశ్వరన్ వేతనం 46,750 సింగపూర్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 29 లక్షలు) కాగా.. 82% తగ్గిన తర్వాత 8,500 సింగపూర్ డాలర్లకు(రూ. 5,24,338) పరిమితం అయ్యింది. ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణల కేసులో జూలై 11న ఈశ్వరన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.
సింగపూర్ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐబీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఎస్. ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సీపీఐబీ గుర్తించింది. అనంతరం మంత్రి పదవి బాధ్యతల నుంచి ఆయన్ను సింగపూర్ ప్రధాని తప్పించారు. దీంతో బెయిల్‌పై ఉంటూ విచారణకు హాజరవుతున్నారు. అయితే 650 మిలియన్ డాలర్ల కుంభకోణంలో ఈశ్వరన్ ప్రధాన పాత్ర వహించారని విపక్షాల ఆరోపిస్తున్నాయి.
చదవండి: ఈశ్వరన్.. అమరావతి స్టార్టప్ ఏరియాలో రూ.లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్
Comments
Please login to add a commentAdd a comment