Lee Hsien Loong
-
Singapore PM: మే 15న పదవి నుంచి తప్పుకుంటా: లూంగ్
సింగపూర్: సింగపూర్ ప్రధానిగా దాదాపు రెండు దశాబ్దాలపాటు కొనసాగిన లీ సీయన్ లూంగ్(72) రిటైర్మెంట్ ప్రకటించారు. మే 15వ తేదీన బాధ్యతల నుంచి వైదొలగనున్నట్లు లూంగ్ సోమవారం తెలిపారు. అదే రోజూన ఉప ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్(51) ప్రధానిగా బాధ్యతలు చేపడతారన్నారు. సింగపూర్ మూడో ప్రధానిగా 2004లో లూంగ్ బాధ్యతలు చేపట్టారు. ఏ దేశానికైనా నాయకత్వ మార్పిడి ఎంతో ముఖ్యమైన విషయమని ఆయన ఫేస్బుక్లో పేర్కొన్నారు. సింగపూర్‌కు మరింత ఉజ్వల భవిష్యత్తును అందించేందుకు వాంగ్ ప్రభుత్వానికి సహకారం అందించాల్సిందిగా ప్రజలను ఆయన కోరారు. -
బాబు ఫ్రెండ్ ఈశ్వరన్‌కు మరో షాక్.. జీతంలో భారీ కోత
చంద్రబాబు స్నేహితుడు, భారతీయ మూలాలున్న సింగపూర్ మాజీ మంత్రి ఎస్ ఈశ్వరన్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఇప్పటికే పీకల్లోతు అవినీతి ఉచ్చులో చిక్కుకున్న ఈశ్వరన్ జీతంలో కోత విధిస్తున్నట్లు తాజాగా సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈశ్వరన్ అవినీతి, అక్రమాస్తులపై దర్యాప్తు జరుగుతోందని సింగపూర్ ప్రధాని లీసీన్ లూంట్ వెల్లడించారు. ఈ మేరకు బుధవారం ఆయన పార్లమెంట్లో మాట్లాడుతూ.. ఈశ్వరన్ జీతంలో 82 శాతం కోత విధించినట్లు పేర్కొన్నారు. తదుపరి నోటీసు వచ్చే వరకు ఎస్ ఈశ్వరన్ జీతం నెలకు 8,500 డాలర్లకు పరిమితం చేసినట్లు తెలిపారు. బాధ్యతాయుత మంత్రి పదవిలో ఉంటూ అవినీతికి పాల్పడ్డారని చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున మరిన్ని వివరాలు వెల్లడించలేకపోతున్నానని తెలిపారు. చదవండి: ఇంటిదొంగ – ఈశ్వరన్! ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ వేతనం పొందేవారిలో సింగపూర్ రాజకీయ నాయకులు ముందు వరుసలో ఉంటారు. సింగపూర్ ప్రజా సేవల విభాగం 2023 ఏడాది గణాంకాల ప్రకారం ఒక మంత్రికి జీతభత్యంగా నెలకు 41వేల డాలర్లు(సుమారు రూ.34 లక్షలు) చెల్లిస్తారు. అంటే సంవత్సరానికి 8,20,000 డాలర్లు(సుమారు రూ.6.8 కోట్లు) జీతంగా పొందుతారు. ఈశ్వరన్ వేతనం 46,750 సింగపూర్ డాలర్లు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. 29 లక్షలు) కాగా.. 82% తగ్గిన తర్వాత 8,500 సింగపూర్ డాలర్లకు(రూ. 5,24,338) పరిమితం అయ్యింది. ఇదిలా ఉండగా అవినీతి ఆరోపణల కేసులో జూలై 11న ఈశ్వరన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. సింగపూర్ అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐబీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. సింగపూర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్న ఎస్. ఈశ్వరన్ తీసుకున్న నిర్ణయాల వల్ల దేశానికి భారీ ఎత్తున నష్టం వాటిల్లినట్లు సీపీఐబీ గుర్తించింది. అనంతరం మంత్రి పదవి బాధ్యతల నుంచి ఆయన్ను సింగపూర్ ప్రధాని తప్పించారు. దీంతో బెయిల్‌పై ఉంటూ విచారణకు హాజరవుతున్నారు. అయితే 650 మిలియన్ డాలర్ల కుంభకోణంలో ఈశ్వరన్ ప్రధాన పాత్ర వహించారని విపక్షాల ఆరోపిస్తున్నాయి. చదవండి: ఈశ్వరన్.. అమరావతి స్టార్టప్ ఏరియాలో రూ.లక్ష కోట్ల దోపిడీకి స్కెచ్ -
నెహ్రూస్ ఇండియా, ఎంపీల నేరచరిత్రపై వ్యాఖ్యలు చేసిన సింగపూర్ పీఎం... తప్పుబట్టిన భారత్!
India has slammed the Singapore Prime Minister's comments: సింగపూర్ పార్లమెంట్లో సిటీ-స్టేట్‌లో ప్రజాస్వామ్యంపై ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా ప్రధాని లీ హ్సీన్ లూంగ్ భారతదేశ మొదటి ప్రధానమంత్రి గురించి ప్రస్తావించారు. నెహ్రూస్ భారత్‌లో లోక్‌సభలో దాదాపు సగం మంది ఎంపీలపై అత్యాచారం హత్య ఆరోపణలతో సహా క్రిమినల్ అభియోగాలు పెండింగ్‌లో ఉన్నాయని నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాదు వీటిలో చాలా మటుకు రాజకీయ ఆరోపణలు కూడా ఉన్నాయని లీ అన్నారు. ఈ వ్యాఖ్యలను సింగపూర్ పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ఎలా పని చేయాలనే అంశంపై జరిగిన ఉద్వేగభరితమైన చర్చ సందర్భంగా లీ ఈ వ్యాఖ్యలు చేశారు. "చాలా దేశాలు ఉన్నతమైన ఆదర్శాలు. గొప్ప విలువల ఆధారంగా ఏర్పడినవే కానీ ఆ తర్వాత రానురానూ రాజీకీయ ఆకృతి మారుతోంది. చాలా రాకీయ పార్టీలు తమ వ్యవస్థాపక నాయకులను విస్మరిస్తోంది." అని లీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఈ ప్రసంగంలో ప్రధాని లీ భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతో సహా వివిధ ప్రధాన మంత్రుల గురించి ప్రస్తావిస్తూ..." చాలా దేశాలు మొదట చాలా ఉద్వేగభరితంగా ఏర్పడ్డాయి. డేవిడ్ బెన్-గురియన్లు, జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్రం కోసం పోరాడి సాధించిన గొప్ప నాయకులు. గొప్ప ధైర్యం అపారమైన సంస్కృతి, అద్భుతమైన సామర్థ్యం కలిగిన అసాధారణ వ్యక్తులు. అంతేకాదు వారు అపారమైన వ్యక్తిగత ప్రతిష్టతో, ధైర్యవంతమైన కొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి, దేశంలోని ప్రజల కొత్త భవిష్యత్తును రూపొందించడంలోనూ ప్రజల అంచనాలను అందుకోవడానికి సదా ప్రయత్నిస్తారు. కానీ ఈ ప్రారంభ ఉత్సాహాన్ని తరువాత తరాలకు కొనసాగించడం లేదా నడిపించడంలో విఫలమవ్వడం లేదా కష్టమవుతోంది. అలాగే బెన్-గురియన్స్ ఇజ్రాయెల్ రెండేళ్లలో నాలుగు సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పటికీ, కేవలం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంతోనే సరిపోయిందని, సీనియర్ రాజకీయ నాయకులు అధికారులు నేరారోపణలను ఎదుర్కొన్నారు". అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సింగపూర్‌లో ప్రజాస్వామ్యం ఎలా ? ఉండాలి, ఆ మార్గంలో పయనించకుండా ఉండాలంటే ఏం చేయాలని ప్రశ్నించారు. మనమేమి గొప్ప తెలివైనవాళ్లం, ధర్మాత్ములం కాదు కాబట్టి తరం వెంబడి తరం వ్యవస్థను పర్యవేక్షించి దాని నిర్మాణాన్ని కొనసాగిస్తే సాధ్యమవుతుందని లీ పేర్కొన్నారు. ఈ మేరకు భారత్ సింగపూర్ ప్రధాని లీ నెహ్రూస్ ఇండియా పై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిడమే కాక అనవసరమైన వ్యాఖ్యలుగా కొట్టిపారేసింది. అంతేకాదు విదేశాంగ మంత్రిత్వ శాఖ సింగపూర్ హైకమిషనర్‌ను పిలిపించి తమ అభ్యంతరాన్ని తెలియజేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. (చదవండి: ప్రతి సమస్యకు తొలి ప్రధాని నెహ్రునే నిందిస్తున్నారు: మన్మోహన్ సింగ్) -
సింగపూర్‌లో అధికార పార్టీదే గెలుపు
సింగపూర్: సింగపూర్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ ఆధిక్యం సాధించింది. ఇదే పార్టీ 1965 నుంచి అధికారంలో కొనసాగుతోంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 93 పార్లమెంటరీ సీట్లకు గాను 83 సీట్లు సాధించింది. 61.2 శాతం ఓట్లు కొల్లగొట్టింది. ప్రతిపక్ష వర్కర్క్ పార్టీ కేవలం 10 సీట్లకే పరిమితమైంది. అయితే, 2015 నాటి ఎన్నికలతో పోలిస్తే పీపుల్స్ యాక్షన్ పార్టీ బలం తగ్గిపోవడం గమనార్హం. అప్పట్లో 70 శాతం ఓట్లతో 89 సీట్లు సాధంచిన ఆ పార్టీ ఇప్పుడు 83 సీట్లతో సరిపెట్టుకుంది. ఇది తమకు ఫీల్‌గుడ్ ఎన్నిక కాదని ప్రధాని లీ సీన్ లూంగ్ అన్నారు. -
ప్రతిపక్షంలో చేరిన ప్రధాని సోదరుడు
సింగపూర్: దేశంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ సింగపూర్ ప్రస్తుత ప్రధానమంత్రి లీ సియాన్ లూంగ్ కు షాక్ తగిలింది. ఆయన సోదరుడు లీ సియాన్ యాంగ్ బుధవారం ప్రతిపక్ష ప్రొగ్రెస్ సింగపూర్ పార్టీ (పీఎస్పీ)లో చేరారు. ఈ ఏడాది జులై 10న జరగబోయే ఎన్నికల్లో లూంగ్ కు చెందిన పీపుల్స్ యాక్షన్ పార్టీ(పీఏపీ)కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని యాంగ్ పేర్కొన్నారు.(బీజింగ్‌లో కరోనా.. సూపర్ స్ర్పెడ్డర్ అతనేనా!) పీఎస్పీ నుంచి బరిలోకి దిగే విషయంపై మాత్రం మాట దాటేశారు. వీరి తండ్రి మోడరన్ సింగపూర్ వ్యవస్థాపకుడు లీ కువాన్ యూ ఆస్తుల పంపక వ్యవహారంలో తేడాలు రావడంతో అన్నదమ్ముల మధ్య అగాథం ఏర్పడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అది తారస్థాయికి చేరింది.(సోదరి ఆదేశాలు.. సైనిక చర్య వద్దన్న కిమ్!) -
స్వచ్ఛ భారతానికి ఉమ్మడిగా కృషి
పారిశుభ్రతకు జాతీయప్రాధాన్యం ఇచ్చిన మహాత్ముడి మార్గంలోనే సింగపూర్ ప్రయాణించి లక్ష్య సాధనలో విజయం సాధించింది. నేడు పరిశుభ్ర వాతావరణం సృష్టించి, ప్రజారోగ్యం కాపాడే దిశగా కృషి చేస్తున్న భారత్‌కు సహకరించడానికి సింగపూర్ సిద్ధంగా ఉంది. భారత్‌తో పోల్చితే సింగపూర్ అతి చిన్న దేÔ]lమే అయినా సంపూర్ణ పారిశుద్ధ్యం దిశగా రెండు దేశాల ప్రయాణాల్లో పోలికలున్నాయి. 2019 నాటికి ‘పరిశుభ్ర భారతదేశం’ అనే లక్ష్య సాధనకు స్వచ్ఛ్ భారత్ మిషన్ ఉద్యమాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాలుగేళ్ల క్రితం ప్రారంభించారు. 2019 అక్టోబర్ రెండు మహాత్మా గాంధీ 150వ జయంతి కావడంతో అప్పటికి లక్ష్యం సాధించాలని నిర్ణ యించారు. పారి శుద్ధ్యాన్ని జాతీయ ప్రాధాన్యం గల అంశంగా మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ ప్రోత్సహించారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో ఈ విషయంలో భారత్ గొప్ప పురోగతి సాధించింది. దేశంలోని కోట్లాది ప్రజల కోసం ఎనిమిది కోట్ల 60 లక్షలకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. దాదాపు ఐదు లక్షల (4,70,000) గ్రామాలను ఆరు బయలు మల విసర్జన లేని గ్రామాలుగా ప్రకటించారు. సింగపూర్ కూడా ఇదే మార్గంలో నడిచింది. మాకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ మా ప్రజల కోసం పరిశుభ్ర, పచ్చని వాతావరణం కల్పించడానికి మేమెంతో కష్టపడి పనిచేశాం. తొలి రోజుల్లో అనేక ఇళ్లకు మురుగునీటి సౌకర్యాలు లేవు. మలాన్ని బకెట్లతో సేకరించి బాగా చెడు వాసన వచ్చే లారీల్లో దాన్ని మురుగు శుద్ధి ప్లాంట్లకు రవాణా చేసేవారు. అయితే, తరచు మానవ వ్యర్థాలను దగ్గరలోని కాలవలు, వాగులు, నదుల్లో పడేసేవారు. దీంతో వీటి జలాలు కలుషితమయ్యేవి. అపరిశుభ్ర జీవన పరిస్థితులు ఎన్నో ప్రజారోగ్య సమస్యలకు కారణమయ్యాయి. తరచు నీటి వల్ల కలిగే వ్యాధులు ప్రబలడానికి దారితీశాయి. ఈ పరిస్థితుల్లో నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని మా దేశ నిర్మాతలు నిర్ణయించారు. ‘పరిశుద్ధ సింగపూర్’ లక్ష్య సాధనకు వారు జాతీయస్థాయి ప్రచారోద్యమం ప్రారంభించారు. మేం ప్రతి ఇంటినీ శుభ్రం చేసుకున్నాం. మా నదులనూ పరిశుభ్రం చేశాం. ఈ క్రమంలో మేం వేలాది మంది ఆక్రమణదారులను ఖాళీచేయించాం. పెరటి పరిశ్రమలను, పందుల పెంపకం దొడ్లను, ఇంకా నదీపరీవాహక ప్రాంతంలో కాలుష్యానికి కారణమైన ఎన్నింటినో తొలగించాము. ఇంతటి కృషి ఫలితంగా నేడు స్వచ్ఛమైన సింగపూర్ నది నగరం గుండా ప్రవహిస్తూ మరీనా రిజర్వాయర్‌లో కలుస్తోంది. ఈ జలాశయమే మా జాతీయ నీటి సరఫరా వ్యవస్థకు ఆధారం. వైవిధ్యభరిత భారతం! సింగపూర్‌తో పోల్చితే ఎంతో వైవిధ్యభరిత దేశం భారత్. సింగపూర్ నది కంటే గంగా నది దాదాపు వెయ్యి రెట్లు పెద్దది. అయినా, పరశుభ్రత వైపు సాగిన ప్రయాణంలో భారత్, సింగపూర్‌లకు కొన్ని పోలికలున్నాయి. మొదటిది, రెండు దేశాల అనుభవాలు దేశ దార్శనికత, నాయకత్వం ప్రాధాన్యాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి. దివంగత సింగపూర్ ప్రధానమంత్రి లీ కాన్ యూ, భారత ప్రధాని నరేంద్రమోదీలు ఇరువురూ తమ దేశాలు పరిశుభ్రంగా, ఆకుపచ్చగా ఉండాలన్నది తమ ప్రాధాన్యతగా పెట్టుకున్నారు. ఈ విషయంలో ప్రజలను సమీకరించి, వారిలో చైతన్యం పెంచడానికి జన చేతన ఉద్యమాలను స్వయంగా నడిపించారు. ప్రజలతో కలిసి ఈ ఇద్దరు నేతలూ చీపుర్లు చేతపట్టి వీధులు ఊడ్చారు. లీ తనకు వ్యక్తిగతంగా ప్రేరణ అనీ, మన జీవనశైలిలో మార్పు ద్వారానే దేశంలో మార్పు మొదలవుతుందనే లీ ఆలోచన నుంచి తాను స్ఫూర్తి పొందానని ప్రధాని మోదీ చెప్పారు. ఈ రకంగా చూస్తే, వాస్తవానికి స్వచ్ఛ భారత ఉద్యమం కేవలం భారతదేశంలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమం మాత్రమే కాదు, మన ఆలోచన, మన పని, మన జీవన విధానంలో పరివర్తన తెచ్చే లోతైన సంస్కరణగా పరిగణించాలి. ఇక రెండో విషయం, జాతీయస్థాయిలో దీర్ఘకాలిక నిబద్ధత ఉంటేనే ఏ విషయంలోనైనా విజయం సాధించడం వీలవుతుంది. మా మురుగునీరు, నీటిపారుదల వ్యవస్థలను వేరుచేసి సింగపూర్ సర్కారు సూవరిజ్ మాస్టర్ ప్లాన్‌ను అమలు చేసింది. వర్షపు నీరు కలుషితం కాకుండా నివారించడం, ఈ నీటిని సేకరించి సద్వినియోగం చేసుకోవడమే దీని లక్ష్యం. అదే సమయంలో సింగపూర్‌లో ఒకసారి వాడిన నీటిని మురుగునీటి శుద్ధి కేంద్రాల్లో శుభ్రం చేసి మళ్లీ ఉపయోగిస్తున్నారు. ఈ నీటిని రివర్స్ ఆస్మాసిస్ పద్ధతి ద్వారా శుద్ధి చేసి మంచి తాగు నీరు ఉత్పత్తి చేస్తున్నారు. ఇది అత్యంత పరిశుభ్రమైన, అత్యున్నత ప్రమాణాలతో కూడిన మంచి నీరు. అయితే, ఒకసారి వాడిన నీటిని ఏం చేయాలనే సమస్య తలెత్తింది. దీనికి పరిష్కారం దొరికింది. ఇది నీటి కొరత అనే మరో సమస్యకు పరిష్కారమార్గమైంది. భారతదేశంలో పారిశ్రామిక సంస్థలు, పాఠశాలలు వంటి వివిధ వర్గాల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్ ఉద్యమ రూపంలో ముందుకు సాగడం ఆశాజనకమైన ఫలితాలనిచ్చింది. 2006 నాటికి ఇండియాలో 50 శాతం పాఠశాలల్లో మాత్రమే పారిశుద్ధ్య సౌకర్యాలుండేవి. అయితే, ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని స్కూళ్లలో మరుగుదొడ్లు వంటి అన్ని రకాల పారిçశుద్ధ్య ఏర్పాట్లు ఉన్నాయి. ఈ వివరాలను ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యూనిసెఫ్ 2018 సంవత్సరానికి సంబంధించి పాఠశాలల్లో తాగునీరు, పారిశుద్ధ్యం, పరిశుభ్రత అనే అంశాలపై విడుదల చేసిన ప్రపంచ బేస్‌లైన్ నివేదికలో వెల్లడించింది. అంతర్జాతీయ సహకారానికే పెద్ద పీట! ఇక మూడో అంశం ఏమంటే, సింగపూర్, భారతదేశం రెండూ అంతర్జాతీయ సహకారానికి విలువనిస్తాయి. ఒక సమస్యకు ఒక దేశంలో అమలు చేసే పరిష్కారమార్గం మరో దేశంలో పనిచేయకపోవచ్చు. అయితే, మనం ఇతర దేశాల నుంచి విషయాలు నేర్చుకోవడం, వారి అనుభవాలను తెలుసుకోవడం వల్ల మనమంతా ప్రయోజనం పొందవచ్చు. మహాత్మాగాంధీ ప్రారంభ అంతర్జాతీయ పారిశుద్ధ్య సదస్సు విజయవంతంగా నిర్వహించినందుకు భారతదేశాన్ని నేను అభినందిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశుద్ధ్య నిపుణులు, ఉద్యమకారులు, నాయకులను ఈ సదస్సు ఒక చోటకు చేర్చింది. వారంతా తమ అనుభవాల గాథలను పంచుకున్నారు. సింగపూర్ కూడా ప్రపంచ నగరాల ద్వైవార్షిక శిఖరాగ్రసభ, అంతర్జాతీయ జల వారోత్సవం వంటి అంతర్జాతీయ సమావేశాలను నిర్వహిస్తోంది. పారిశుద్ధ్యరంగంలో ప్రపంచం ఎదుర్కొంటున్న సవాలుపై అవగాహన కల్పించడానికి ‘అందరికీ పరిశుభ్రత’ అనే సింగపూర్ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి 2013లో ఆమోదించింది. అంటే, నవంబర్ 19ని ప్రపంచ టాయ్‌లెట్ దినంగా పాటించాలనే సింగపూర్ ఆలోచనకు ఐరాస మద్దతు పలికింది. భారత్‌తో అనుభవాలను పంచుకోవడం ఆనందదాయకం భారత్‌తో మరింత మెరుగైన జీవనానికి, దేశవ్యాప్తంగా ప్రగతి సుస్థిరంగా నిలిచే స్మార్ట్ నగరాల అభివృద్ధికి తన కృషి కొనసాగిస్తున్నందున సింగపూర్ తన అనుభవాలను భారత్‌తో పంచుకోవడం ఆనందదాయక అనుభవంగా భావిస్తోంది. నగర ప్లానింగ్, నీటిసరఫరా, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై వందలాది మంది అధికారులకు శిక్షణ ఇవ్వడానికి భారతదేశ టౌన్, కంట్రీ ప్లానింగ్ సంస్థతో కలిసి సింగపూర్ పనిచేస్తోంది. తమ నగరాల అభివృద్ధికి కృషిచేస్తున్న ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలకు సహకరించడానికి, పరిష్కారమార్గాలు సూచించడానికి సింగపూర్ సిద్ధంగా ఉంది. స్వచ్ఛ భారత్ విషయంలో భారత ప్రజలకు, నరేంద్రమోదీకి శుభాకాంక్షలు. రాబోయే తరాలకు శుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం అందించాలన్న ఐరాస లక్ష్యాల సాధనలో రెండు దేశాల మధ్య మరింత సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను. లీ సియస్ లూంగ్ సింగపూర్ ప్రధాని -
ట్రంప్ కూడా వచ్చేశాడోచ్...!
సింగపూర్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సింగపూర్ చేరుకున్నారు. అంత్యంత ప్రాధాన్యం సంతరించుకున్న భేటీ నేపథ్యంలో ట్రంప్ సింగపూర్ పర్యటనకు వెళ్లారు. ఈ 12న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌తో పలు అంశాలపై ట్రంప్ చర్చించనున్నారు. కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సులో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో సింగపూర్ వచ్చారని అధికారులు తెలిపారు. కిమ్‌కు స్వాగతం పలికిన సింగపూర్ విదేశాంగశాఖ మంత్రి వివియన్ బాలకృష్ణన్ అమెరికా అధ్యక్షుడికి కూడా ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక భద్రత మధ్య హోటల్‌కు ట్రంప్ చేరుకున్నారు. అయితే కిమ్‌తో భేటీపై ఎలా స్పందిస్తారన్న ప్రశ్నకు.. వెరీ గుడ్ అంటూ సమాధానమిచ్చారు. మరోవైపు ట్రంప్‌తో భేటీ కోసం ఉత్తరకొరియా నేత కిమ్ ఇదివరకే సింగపూర్ చేరుకుని ప్రధాని లీ హీన్ లూంగ్‌తో భేటీ అయ్యి పలు విషయాలపై చర్చించారు. కాగా, దేశంలో రెండు దేశాల అధినేతలు కీలక భేటీకి రావడంతో సింగపూర్ అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. భారత కాలమానం ప్రకారం ఈ నెల 12న (మంగళవారం) ఉదయం 6.30 గంటలకు సింగపూర్‌లో కిమ్, ట్రంప్ భేటీ కానున్నారు. అయితే కిమ్ వైఖరి నచ్చకపోతే మధ్యలోనే వెళ్లిపోతానంటూ తన మీటింగ్ పార్ట్నర్కు ట్రంప్ హెచ్చరికలు పంపిన విషయం తెలిసిందే. -
డొనాల్డ్ ట్రంప్ సింగపూర్ చేరుకున్నారు
-
కిమ్‌కు సింగపూర్‌లో ఘనస్వాగతం
-
ఉత్తర కొరియా నియంతకు ఘన స్వాగతం
సింగపూర్ : ప్రపంచం దృష్టంతా ఇప్పుడు సింగపూర్‌పైనే కేంద్రీకృతమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కీలక భేటీనే అందుకు కారణం. ఈ 12న సమావేశం నేపథ్యంలో ట్రంప్‌తో సమావేశం కోసం కిమ్ సింగపూర్ చేరుకున్నారు. ఎయిర్ చైనా విమానంలో నార్త్ కొరియా నియంత కిమ్ సింగపూర్ చేరుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు కెనడాలో జరుగుతున్న జీ7 సదస్సులో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ సైతం కిమ్‌తో భేటీ కోసం సింగపూర్ బయలుదేరినట్లు అమెరికా అధికార వర్గాల సమాచారం. ఆదివారం ఉదయం ఎయిర్ చైనా విమానంలో ప్యాంగ్యాంగ్ నుంచి బయలుదేరిన కిమ్ జాంగ్ ఉన్.. సింగపూర్ చేరుకోగా అక్కడ ఘనస్వాగతం లభించింది. ట్రంప్‌తో భేటీ నేపథ్యంలో తమ దేశానికి విచ్చేసిన ఉత్తర కొరియా అధినేతకు స్థానిక ఛాంగీ ఎయిర్‌పోర్టులో సింగపూర్ విదేశాంగ మంత్రి వివియాన్ బాలకృష్ణన్ ఘన స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య హోటల్‌కు చేరుకున్న కిమ్‌ను సింగపూర్ అధ్యక్షుడు లీ హీన్ లూంగ్ కలుసుకున్నారు. అనంతరం లీ హీన్ లూంగ్, కిమ్‌లు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. మరోవైపు కిమ్ బస చేసిన హోటల్ వద్ద భద్రతను సింగపూర్ అధికారులు కట్టుదిట్టం చేశారు. సెంటోసా ద్వీపంలో కిమ్, ట్రంప్ భేటీ కానున్న విషయం తెలిసిందే. -
సింగపూర్ ప్రధాని లీ సైన్‌తో మోదీ భేటీ
-
సింగపూర్ ప్రధానికి మోదీ అరుదైన గిఫ్ట్
సింగపూర్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ దేశ ప్రధాని హెచ్ఈ లీ సీన్ లూంగ్‌కు అరుదైన కానుకను అందించారు. 1849 నాటి సింగపూర్ దీవుల మ్యాప్ పునర్ముద్రణను ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చారు. 1842-45 మధ్యకాలంలో నిర్వహించిన సర్వే ఆధారంగా రూపొందించిన ఈ నక్షలో అప్పటి సింగపూర్ నగరం, దాని చుట్టపక్కల ప్రాంతాలు, దిగువప్రాంత జలాలను చిత్రించారు. భారత జాతీయ ఆర్కైవ్స్ సంస్థ నుంచి సేకరించిన రేఖాచిత్రాల ఆధారంగా ఆనాటి మ్యాపును 52X52 అంగుళాల వెడల్పులో మళ్లీ యాథాతథంగా పునర్ముద్రించి.. అరుదైన కానుకగా మోదీ, లీ సీన్ లూంగ్‌కు అందజేశారు. -
సింగపూర్ ప్రధానితో చంద్రబాబు భేటీ
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లుంగ్ తో సమావేశమయ్యారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు లీ సీన్ లుంగ్ ను ఆయన ఆహ్వానించారు. తమ రాష్ట్రంలో మౌలిక వసతుల ఏర్పాటుకు సహకరించాలని సింగపూర్ ప్రధానమంత్రిని చంద్రబాబు కోరారు. అక్టోబర్ 22న ఏపీ రాజధాని అమరావతి నగరం నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. రాజధాని డిజైన్, నిర్మాణ పనులను సింగపూర్ సంస్థలకు ప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే. Glad to meet Singapore PM @leehsienloong. Invited him for Amaravati's foundation-laying ceremony on October 22nd. pic.twitter.com/iEbuBv5U6Q — N Chandrababu Naidu (@ncbn) September 22, 2015 -
'లీ' కి విజయవంతంగా శస్త్ర చికిత్స
సింగపూర్: ప్రోస్టేట్ కేన్సర్‌తో బాధపడుతున్న సింగపూర్ ప్రధానమంత్రి లీ హిజైన్ లూంగ్ కు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైందని అక్కడి ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. శస్త్ర చికిత్స అనంతరం తాను పూర్తిగా కోలుకుంటానని లీ ఆశాభావం వ్యక్తం చేశారు. రోబోట్ సహాయంతో శస్త్రచికిత్స ద్వారా కేన్సర్ కణాలను తొలగించినట్టు వైద్యులు సోమవారమిక్కడ తెలిపారు. 63 ఏళ్ల 'లీ' ప్రోస్టేట్ కేన్సర్ గా నిర్ధారణ కావడంతో ఆయన శస్త్రచికిత్స చేయించు కోవాలని నిర్ణయించుకున్నారు. గతనెలలో ఎమ్ఆర్ఐ స్కాన్ ద్వారా కేన్సర్ నిర్ధారక పరీక్షలు నిర్వహించారు. నిర్ధారక పరీక్షల్లో ఒకటి నుంచి 38పైగా ప్రోస్టేట్ కేన్సర్ కారక కణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. ప్రొపెసర్ క్రిష్టోపర్ చింగ్ యురాలిజిస్ట్ పర్యవేక్షణలో ప్రధాని 'లీ' కి సింగపూర్ జనరల్ హాస్పిటల్లో సర్జరీ నిర్వహించారు. సర్జరీ విజయవంతంగా పూర్తి అయిందని, త్వరలో లీ పూర్తిగా కోలుకుంటారని చింగ్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రధాని లీ కి కేన్సర్ రావడం ఇది రెండోసారిగా చింగ్ చెప్పారు. లీ కి 1992లో లింఫోమా వచ్చింది. దాంతో ఆయన కెమోథెరఫీ చేయించుకున్నారు. కాగా లీ కి వచ్చిన ప్రోస్టేట్ కేన్సర్‌కు గతంలో వచ్చిన లింఫోమాతో ఎలాంటి సంబంధం లేదని చింగ్ స్పష్టం చేశారు. కాగా, ప్రధాని లీ ఒక వారంపాటు సెలవులో ఉన్నట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది. ప్రధాని కోలుకునేవరకు డిప్యూటీ ప్రధాని టీయో చీ హీన్ ప్రధానిగా విధులు నిర్వర్తించనున్నట్టు తెలిపింది.