ప్రధాని లీ సీన్ లూంగ్
సింగపూర్: సింగపూర్ సార్వత్రిక ఎన్నికల్లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ ఆధిక్యం సాధించింది. ఇదే పార్టీ 1965 నుంచి అధికారంలో కొనసాగుతోంది. తాజాగా వెలువడిన ఫలితాల్లో 93 పార్లమెంటరీ సీట్లకు గాను 83 సీట్లు సాధించింది. 61.2 శాతం ఓట్లు కొల్లగొట్టింది. ప్రతిపక్ష వర్కర్క్ పార్టీ కేవలం 10 సీట్లకే పరిమితమైంది. అయితే, 2015 నాటి ఎన్నికలతో పోలిస్తే పీపుల్స్ యాక్షన్ పార్టీ బలం తగ్గిపోవడం గమనార్హం. అప్పట్లో 70 శాతం ఓట్లతో 89 సీట్లు సాధంచిన ఆ పార్టీ ఇప్పుడు 83 సీట్లతో సరిపెట్టుకుంది. ఇది తమకు ఫీల్‌గుడ్ ఎన్నిక కాదని ప్రధాని లీ సీన్ లూంగ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment