సింగపూర్: ప్రోస్టేట్ కేన్సర్తో బాధపడుతున్న సింగపూర్ ప్రధానమంత్రి లీ హిజైన్ లూంగ్ కు చేసిన శస్త్రచికిత్స విజయవంతమైందని అక్కడి ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. శస్త్ర చికిత్స అనంతరం తాను పూర్తిగా కోలుకుంటానని లీ ఆశాభావం వ్యక్తం చేశారు. రోబోట్ సహాయంతో శస్త్రచికిత్స ద్వారా కేన్సర్ కణాలను తొలగించినట్టు వైద్యులు సోమవారమిక్కడ తెలిపారు.
63 ఏళ్ల 'లీ' ప్రోస్టేట్ కేన్సర్ గా నిర్ధారణ కావడంతో ఆయన శస్త్రచికిత్స చేయించు కోవాలని నిర్ణయించుకున్నారు. గతనెలలో ఎమ్ఆర్ఐ స్కాన్ ద్వారా కేన్సర్ నిర్ధారక పరీక్షలు నిర్వహించారు. నిర్ధారక పరీక్షల్లో ఒకటి నుంచి 38పైగా ప్రోస్టేట్ కేన్సర్ కారక కణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
ప్రొపెసర్ క్రిష్టోపర్ చింగ్ యురాలిజిస్ట్ పర్యవేక్షణలో ప్రధాని 'లీ' కి సింగపూర్ జనరల్ హాస్పిటల్లో సర్జరీ నిర్వహించారు. సర్జరీ విజయవంతంగా పూర్తి అయిందని, త్వరలో లీ పూర్తిగా కోలుకుంటారని చింగ్ అభిప్రాయపడ్డారు. అయితే ప్రధాని లీ కి కేన్సర్ రావడం ఇది రెండోసారిగా చింగ్ చెప్పారు. లీ కి 1992లో లింఫోమా వచ్చింది.
దాంతో ఆయన కెమోథెరఫీ చేయించుకున్నారు. కాగా లీ కి వచ్చిన ప్రోస్టేట్ కేన్సర్కు గతంలో వచ్చిన లింఫోమాతో ఎలాంటి సంబంధం లేదని చింగ్ స్పష్టం చేశారు. కాగా, ప్రధాని లీ ఒక వారంపాటు సెలవులో ఉన్నట్టు ప్రధాని కార్యాలయం పేర్కొంది. ప్రధాని కోలుకునేవరకు డిప్యూటీ ప్రధాని టీయో చీ హీన్ ప్రధానిగా విధులు నిర్వర్తించనున్నట్టు తెలిపింది.
'లీ' కి విజయవంతంగా శస్త్ర చికిత్స
Published Mon, Feb 16 2015 12:27 PM | Last Updated on Sat, Sep 2 2017 9:26 PM
Advertisement
Advertisement