భారీగా తగ్గనున్న 2000 మెడిసిన్ల ధరలు
భారీగా తగ్గనున్న 2000 మెడిసిన్ల ధరలు
Published Mon, Nov 7 2016 11:30 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM
దాదాపు రెండు వేల మెడిసిన్ల ధరలు కిందకి దిగిరానున్నాయి. అమృత్ పథకం కింద ఆ మెడిసిన్ల రేట్లను మాక్సిమమ్ రిటైల్ ధర(ఏంఆర్పీ) కంటే 90 శాతం వరకు తగ్గించనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రకటించారు. జబల్పూర్ మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ శంకుస్థాపన వేడుకకు హాజరై, ఆయన ప్రసంగించారు. ఈ ప్రసంగంలో భాగంగా సుమారు రెండు వేల మెడిసిన్ల ధరలను ఎంఆర్పీ కంటే 60 నుంచి 90 శాతం రేట్లను తగ్గిస్తామని తెలిపారు. అదేవిధంగా మధ్యప్రదేశ్లో రిటైల్ షాపులను మరిన్ని ప్రారంభించినున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను మెరుగుపరచడానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రప్రభుత్వం అవసరమైన సహాయ సహకరాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.
రూ.150 కోట్లతో నిర్మిస్తున్న ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్, రాష్ట్రంలో నాణ్యమైన వైద్య సహకారాలను అందించడానికి ఉపయోగపడాలని తెలిపారు. ఈ ఫంక్షన్లో భాగంగా రాష్ట్ర క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను రూ.120 కోట్లతో నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. జబల్పూర్లో ఈ సూపర్ స్పెషాలిటీ బ్లాక్ను నిర్మించిన అనంతరం, స్థానిక ప్రజలు, సమీపంలోని జిల్లాల ప్రజలు చికిత్స నిమిత్తం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సినవసరం లేదని ఈ కార్యక్రమానికి హాజరైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఏ ప్రభుత్వమైనా నిర్వహించాల్సిన ప్రధాన కర్తవ్యమని పేర్కొన్నారు.
Advertisement