సాక్షి, న్యూఢిల్లీ : ఇటీవలి కాలం దాకా ధరల మోతతో వాహనదారులకు బెంబేలెత్తించిన ఇంధన ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. వరుసగా మూడో రోజు కూడా వాహనదారులకు ఊరట లభించింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు గురువారం (సెప్టెంబర్ 17) పెట్రోల్, డీజిల్ ధరలను 13-20 పైసలు తగ్గించాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సమాచారం ప్రకారం ఢిల్లీలో, పెట్రోల్ ధర లీటరుకు. 81.55 నుండి 81.40 రూపాయలకు, డీజిల్ లీటరుకు 72.56 రూపాయల నుండి 72.37కు దిగి వచ్చింది. (రెండో రోజూ దిగొచ్చిన పెట్రోల్ ధర!)
దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఇంధన ధరలు ఇలా ఉన్నాయి
ఢిల్లీ లోపెట్రోలు 81.40, డీజిల్ 72.37 రూపాయలు
కోల్‌కతాలో పెట్రోలు రూ. 82.92, డీజిల్ 75.87రూపాయలు
ముంబైలో పెట్రోలు రూ. 88.07, డీజిల్ 78.85 రూపాయలు
చెన్నైలో పెట్రోలు రూ. 84.44, డీజిల్ 77.73 రూపాయలు
హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ.84.60, డీజిల్ ధర 78.88 రూపాయలు
అమరావతిలో పెట్రోల్ ధర రూ.86.18, డీజిల్ 80.07 రూపాయలు
Comments
Please login to add a commentAdd a comment