![తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/81479223888_625x300.jpg.webp?itok=tMqoyjxm)
తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డిజీల్ ధరలను తగ్గిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లీటరు పెట్రోలుపై రూ.1.46, లీటరు డీజిల్ పై రూ.1.53లను తగ్గించింది. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.
ఈ నెల 5వ తేదీన పెట్రోల్ పై రూ.0.89, డీజిల్ పై రూ.0.86లు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నుంచి పెట్రోలు, డీజిల్ రేట్లను మార్చడం ఇది ఆరోసారి. ప్రపంచవ్యాప్తంగా కరెన్సీ రేట్లు మారుతుండటంతోనే పెట్రోలు, డీజిల్ రేట్లలో తరచూ మార్పులు సంభవిస్తున్నాయి.