ఫ్లిప్కార్ట్ విలువకు భారీగా కోత!
ఫ్లిప్కార్ట్ విలువకు భారీగా కోత!
Published Wed, Jan 25 2017 4:41 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్కు ఫిడెలిటీ మ్యూచువల్ ఫండ్ మరోసారి షాకిచ్చింది. ఫ్లిప్కార్ట్ షేర్ల విలువను 36.1శాతానికి తగ్గించేసింది. భారత్లో అత్యంత విలువైన ఇంటర్నెట్ కంపెనీగా ఉన్న ఫ్లిప్కార్ట్ను 5.56 బిలియన్ డాలర్లకు విలువ కట్టింది. 2016 ఆగస్టులో 81.55 డాలర్లగా ఉన్న ఒక్కో షేరు విలువను 2016 నవంబర్కు 52.13 డాలర్లకు తగ్గించింది. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద తగ్గింపు. మొత్తంగా నాలుగుసార్లు ఫ్లిప్కార్ట్ విలువను ఫిడెలిటీ తగ్గించింది.
అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో ఒకటిగా ఉన్న మోర్గాన్ స్టాన్లీ కూడా ఫ్లిప్కార్ట్ షేర్ల విలువను సెప్టెంబర్ క్వార్టర్లో 52.13 డాలర్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇతర మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కూడా దేశీయ అతిపెద్ద ఈ ఈ-కామర్స్ విలువకు కోతపెడుతున్నాయి.. అయితే దీనిపై ఫ్లిప్కార్ట్ స్పందించడం లేదు. ఇటీవలే సీఈవోగా బిన్నీ బన్సాల్ను తొలగిస్తూ కొత్త సీఈవోగా కల్యాణ్ కృష్ణమూర్తిని నియమిస్తూ ఫ్లిప్కార్ట్ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. టాప్ లెవల్ మేనేజ్మెంట్ మార్పుల అనంతరం ఈ కంపెనీ విలువకు కోత పెట్టడం గమనార్హం.
Advertisement
Advertisement