Fidelity
-
ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడుల విలువను సగానికి తగ్గించిన ఫిడెలిటీ
న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ, ఫ్లిప్‌కార్ట్‌లో తన పెట్టుబడుల విలువను అమెరికాకు చెందిన మ్యూచువల్ ఫండ్ ఫిడెలిటీ రట్లాండ్ స్క్వేర్ ట్రస్ట్ టూ సగానికి పైగా తగ్గించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఒక శాతం కంటే తక్కువగా(52,096 షేర్లు) ఫెడిలిటీకి వాటా ఉంది. ఈ షేర్ల విలువ గత ఏడాది నవంబర్ 30న 54 లక్షల డాలర్లుగా(ఒక్కో షేర్ విలువ 104 డాలర్లుగా) ఫిడెలిటీ అమెరికా నియంత్రణ సంస్థలకు నివేదించింది. ఇక ఈ నెల 24న నియంత్రణ సంస్థలకు వెల్లడించిన సమాచారంలో ఈ విలువను 27 లక్షల డాలర్లుగా(ఒక్కో షేర్ విలువ 52 డాలర్లని) ఫిడెలిటీ పేర్కొంది. కాగా ఈ విషయమై ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.మరోవైపు ఆన్లైన్ దిగ్గజం అమెజాన్‌లో పెట్టుబడులను 13% పెంచుకున్నట్లు ఫిడెలిటీ పేర్కొంది. ఇప్పుడు తమకు అమెజాన్‌లో 2,81,493 షేర్లు ఉన్నాయని, వీటి విలువ 21.12 కోట్ల డాలర్లని (ఒక్కో షేర్ విలువ 750 డాలర్లు) వివరించింది. -
ఫ్లిప్‌కార్ట్ విలువకు భారీగా కోత!
దేశీయ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు ఫిడెలిటీ మ్యూచువల్ ఫండ్ మరోసారి షాకిచ్చింది. ఫ్లిప్‌కార్ట్ షేర్ల విలువను 36.1శాతానికి తగ్గించేసింది. భారత్‌లో అత్యంత విలువైన ఇంటర్నెట్ కంపెనీగా ఉన్న ఫ్లిప్‌కార్ట్‌ను 5.56 బిలియన్ డాలర్లకు విలువ కట్టింది. 2016 ఆగస్టులో 81.55 డాలర్లగా ఉన్న ఒక్కో షేరు విలువను 2016 నవంబర్‌కు 52.13 డాలర్లకు తగ్గించింది. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద తగ్గింపు. మొత్తంగా నాలుగుసార్లు ఫ్లిప్‌కార్ట్ విలువను ఫిడెలిటీ తగ్గించింది. అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లలో ఒకటిగా ఉన్న మోర్గాన్ స్టాన్లీ కూడా ఫ్లిప్‌కార్ట్ షేర్ల విలువను సెప్టెంబర్ క్వార్టర్లో 52.13 డాలర్లకు తగ్గించిన సంగతి తెలిసిందే. ఇతర మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు కూడా దేశీయ అతిపెద్ద ఈ ఈ-కామర్స్ విలువకు కోతపెడుతున్నాయి.. అయితే దీనిపై ఫ్లిప్‌కార్ట్ స్పందించడం లేదు. ఇటీవలే సీఈవోగా బిన్నీ బన్సాల్‌ను తొలగిస్తూ కొత్త సీఈవోగా కల్యాణ్ కృష్ణమూర్తిని నియమిస్తూ ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం ప్రకటించిన సంగతి తెలిసిందే. టాప్ లెవల్ మేనేజ్మెంట్ మార్పుల అనంతరం ఈ కంపెనీ విలువకు కోత పెట్టడం గమనార్హం.